Jump to content

ద్రౌపదీ మానసంరక్షణం

వికీపీడియా నుండి
ద్రౌపదీ మానసంరక్షణం
(1936 తెలుగు సినిమా)
రచన ఎస్.జగన్నాధ్, రమణమూర్తి
తారాగణం బళ్ళారి రాఘవ,
ఎస్.రంగస్వామి,
శివరామ కృష్ణారావు,
హెచ్.ఎన్.చౌదరి,
దైతా గోపాలం, కల్యాణి,
జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
సురభి కమలాబాయి,
బందా కనకలింగేశ్వరరావు,
కొమ్మూరి పద్మావతీదేవి,
శ్రీహరి,
లీల
నిర్మాణ సంస్థ సరస్వతీ టాకీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ద్రౌపదీ మానసంరక్షణం 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.జగన్నాధ్, రమణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బళ్ళారి రాఘవ, ఎస్.రంగస్వామి, శివరామ కృష్ణారావు, హెచ్.ఎన్.చౌదరి, దైతా గోపాలం, కల్యాణి, జంధ్యాల గౌరీనాథశాస్త్రి, సురభి కమలాబాయి, బందా కనకలింగేశ్వరరావు, కొమ్మూరి పద్మావతీదేవి, శ్రీహరి, లీల నటించారు.

బళ్ళారి రాఘవ

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: ఎస్.జగన్నాధ్, రమణమూర్తి
  • నిర్మాణ సంస్థ: సరస్వతీ టాకీస్
  • గాయనీ గాయకులు: దైతాగోపాలం, సురభి కమలాబాయి, టి.సుబ్రహ్మణ్యం,పారుపల్లి సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, ఎ.వి.సుబ్బారావు, మాస్టర్ దుర్గాప్రసాద్, పద్మావతీదేవి, రాగిణీదేవి
  • విడుదల:05:02:1936.

పాటల జాబితా

[మార్చు]

1.ఎవ్వరికి తరమౌను జగదీశు మహిమలను వర్ణించుట- దైతా గోపాలం

2.కనవా నా దుర్గతిదేవా కనికరమేమది - సురభి కమలాబాయి

3. కుంజ విహారి కృష్ణమురారి గోవర్ధన గిరిధారి - టి.సుబ్రహ్మణ్యం

4. గిరిధర గోపాలా పాహిమాం కృపాలవాలా నందగోపబాలా - టి. సుబ్రహ్మణ్యం

5.గోపాలా మాంపాలయ గోపీలోలా కృపజూపవేలారా- సురభి కమలాబాయి

6. జన్మసార్థక మయ్యేగా నామది సంతసభరితమయ్యే - పారుపల్లి సుబ్బారావు

7. జయ జయ జయ జగదీశ్వర సాధుసంగ శ్యామలాంగా - బృందం

8.తగనిపని నాయనా మనకిది ధర్మమూర్తుల కుతంత్రుల - ధైతా గోపాలం

9. దయసేయన్ వలయుసుమా దేవి పయనగుము- సురభి కమలాబాయి

10.ధన్యులెవ్వరు మీకన్నను రాజన్యులు - బందా కనకలింగేశ్వరరావు 11. పందేమిడిన యాభాహువు పటా పంచెలుగా చేతు - ఎ. వి.సుబ్బారావు

12. పద్మవల్లభా పాలయ భగవాన్ - బృందం

13.భారతదేశ గౌరవంబంతయు పాడొనరించేదరా నేటితో - మాస్టర్ దుర్గాప్రసాద్

14.మాతా మాంపాలయా గిరిజాతా కరుణాలయా - పద్మావతీదేవి

15.మించిన పనికి పిదప యోచించిన కలగదు లాభమటంచు - దైతా గోపాలం

16. యశోదానంద కంద యాదవాన్వయాబ్ది చంద్ర - బృందం

17. వీరకేసరులారా వెడలుడు వేవేగా భారతాంబకు మన - మాస్టర్ దుర్గాప్రసాద్

18. శ్రిత కమలాకుచ మండలా కృష్ణా దృతకుండలా- రాగిణీదేవీ

19. సకలధర్మ వేదులారా సభాసీనులగు మహాత్ములారా - సురభి కమలాబాయి.

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.