దైతా గోపాలం
దైతా గోపాలం | |
---|---|
జననం | 1900 పాపనాశనం, శ్రీకాకుళం జిల్లా |
మరణం | 1958 |
వృత్తి | రంగస్థల, సినీ నటుడు, రచయిత |
దైతా గోపాలం (1900-1958), తెలుగు రంగస్థల నటుడు, సినీ గీత రచయిత, నటుడు
శ్రీకాకుళం శివార్లలో ఉన్న పాపనాశనంలో జన్మించిన దైతా గోపాలం తెలుగు నాటకరంగం, మరచిపోలేని మేటి కళాకారుడు. ఈయన అనేక నాటకాలు ఆడారు. అచ్యుత రామశాస్త్రి రచించిన 'సక్కుబాయి' నాటకాన్ని దైతా గోపాలం తన సొంత పాటలతో దర్శకత్వంతో నడిపించారు. సుప్రసిద్ధ చిత్రసంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుకు సక్కుబాయి పాత్రను నేర్పి చాలాసార్లు ప్రదర్శించారు. నాటకాల్లోనేకాక సినిమా రచయితగా కూడా పేరుగాంచాడు. శ్రీరాజరాజేశ్వరీ ఫిలింకంపెనీ అధినేత కడారు నాగభూషణం ఆదరణతో వారి చిత్రాలు సతీసుమతి (1941) సతీ సక్కుబాయి (1954) శ్రీకృష్ణ తులాభారం (1955) మొదలగు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. 'సతీసుమతి'లో ఆయన వ్రాసిన నిన్న సాయంత్రమున అనేపాట ఎంతోపేరు తెచ్చిపెట్టింది. ఈయన 'వరవిక్రయం' చలన చిత్రంలో కూడా నటించాడు. ఘంటసాల, అక్కినేని వీరిని తరచూ కలుస్తూ ఈయన సలహాలను గైకొనేవారు.[1] 1958లో నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధం ఇతడు పాటలు సమకూర్చిన చివరి చిత్రం[2].
దైతా గోపాలం రంగస్థలం బయట కూడా చాలా సౌమ్యంగా, సాధువులాగా ఉండేవాడు. ఆయన సాధువు పాత్రలు వేయటంలో బాగా రాణించాడు. విదురుడు, అక్రూరుడు ఈయనకు బాగా నచ్చిన పాత్రలు. సక్కుబాయి నాటకంలో శివయోగి పాత్రను కూడా ఈయన చిరస్మరణీయం చేశాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ దివి సీమ దివ్వెలు - ఆంధ్రప్రభ సెప్టెంబరు 23, 2010[permanent dead link]
- ↑ పైడిపాల (2010). "కనిపించని కవి వినిపించని పాట". తెలుగు సినీగేయకవుల చరిత్ర (ప్రథమ ed.). చెన్నై: స్నేహ ప్రచురణలు. pp. 39–40.
|access-date=
requires|url=
(help) - ↑ Sastry, S. M. Y. (1975). Modern Telugu Literature and Theatre: Two Studies. Bombay Andhra Mahasabha and Gymkhana. p. 57. Retrieved 3 March 2015.
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా నటులు
- తెలుగు రంగస్థల నటులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తెలుగు కళాకారులు
- శ్రీకాకుళం జిల్లా సినిమా రచయితలు
- శ్రీకాకుళం జిల్లా రంగస్థల నటులు
- శ్రీకాకుళం జిల్లా సినిమా నటులు