సత్యభామ (1942 సినిమా)
'సత్యభామ' తెలుగు చలన చిత్రం,1942 ఏప్రిల్ 5 న విడుదల.యరగుడిపాటి వరదారావు నిర్మాత, దర్శకుడు, నటుడు గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో వై.వి రావు తో పాటు పుష్పవల్లి, అద్దంకి శ్రీరామమూర్తి, స్థానం నరసింహారావు.లాంటి తొలితరం నటులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం గొట్టు నారాయణ అయ్యర్ అందించారు.
సత్యభామ (1942 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.వి.రావు |
---|---|
నిర్మాణం | వై.వి.రావు |
తారాగణం | వై.వి.రావు, పుష్పవల్లి, అద్దంకి శ్రీరామమూర్తి, స్థానం నరసింహారావు |
సంగీతం | గొట్టు నారాయణ అయ్యర్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
[మార్చు]వై. వరదారావు
పుష్పవల్లి
అద్దంకి శ్రీరామమూర్తి
స్థానం నరసింహారావు
కస్తూరి
పద్మ
పూర్ణిమ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు, నిర్మాత: వై.వి.రావు
నిర్మాణ సంస్థ: శ్రీ జగదీష్ ఫిలిమ్స్
సంగీతం: గొట్టు నారాయణ అయ్యర్
నేపథ్య గానం: స్థానం నరసింహారావు, ఎన్.భీమారావు
విడుదల:05:04:1942.
పాటల జాబితా
[మార్చు]1. జగదాదారా ప్రభో నగధర విగత వికారా వేదంతసారా, గానం.స్థానం నరసింహారావు
2.ధరణిపతియే నీతిమాలిన తగవుదీర్చు నాథులెవరు, గానం.ఎన్.భీమారావు
3.గౌరీమాతా దయగనుమా కాపాడగ తరిఇదే ,
4.చాలు చాలు నీ జాణతనములిక చాలును పదవోయీ
5 . చూచితిన్ నేటికిని చూచితిన్ కృష్ణుని సుందరరూపుని , గానం. పుష్పవల్లీ
6.జయహారతి జగదేక విధాత సారసవిహితా ఛాయసహిత, గానం.బృందం
7.దుర్గమ్మ తల్లి ఓ దుర్గమ్మతల్లి, సర్వంబున వెలుగు
8.నారాయణ శౌరి శ్రీమన్నారాయణ శౌరీ నరహరి, గానం.స్థానం నరసింహారావు
9.నిందలపాలాయేగదా నేటికీ మా బ్రతుకు అకటా,
10.ప్రాణపతి వనమాలీ మానినిపై దయరాదా దీనలోక,
11.మంచి మంచి వన సుమములతో మూలికల్ సమకూర్చగా
12.విధి బలమున్ మీరగనౌనా ఈ ఇలనెవ్వరికైనన్
13.శ్రీరాముడే ప్రాణాసేడాయే మనోరధములు పరిపూర్ణ, గానం.పుష్పవల్లి
14.సీతాపతిన్ నేగాంతునుగా మా శ్రీరామచంద్రునీ ,
15.సూర్యమూర్తే నమోస్తుతే సుందర చాయాధిపతే, గానం.అద్దంకి శ్రీరామమూర్తి.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.