టూ టౌన్ రౌడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టూ టౌన్ రౌడీ
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

టూ టౌన్ రౌడీ 1989 నాటి తెలుగు సినిమా. శ్రీ విజయలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై సి వెంకట్ రాజు, బి.శివరాజు నిర్మించారు. దర్శకత్వం దాసరి నారాయణ రావు . ఇందులో వెంకటేష్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు.[1] ఇది హిందీ చిత్రం తేజాబ్కు రీమేక్.[2] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనేలా ఆడింది.[3]

ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు ( కృష్ణంరాజు ) ఒక పేరుమోసిన నేరస్థుడు శక్తి ( వెంకటేష్) తన అధికార పరిధిలోకి వచ్చినట్లుగా ఉప్పందుతుంది. అందువల్ల అతను శక్తి ఫైలును తనిఖీ చేస్తాడు. రంజిత్ కుమార్ శక్తి ఎవరో తెలిసి షాక్ అవుతాడు. అతడొక ఎన్‌సిసి క్యాడెట్, ఔత్సాహిక అధికారి, కొన్ని సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. వారి కళ్ళ ముందే ఒక దోపిడీ జరిగి, శక్తి తల్లిదండ్రులు చంపబడతారు. ఆ తరువాత శక్తి ఏమయ్యాడో రంజిత్ కుమార్‌కు తెలియలేదు.

ఏదేమైప్పటికీ, రంజిత్ కుమార్ శక్తిని గుర్తించి, లొంగిపోవాలని కోరతాడు. భయంకరమైన గ్యాంగ్ స్టర్ బాబా సాబ్ ( మోహన్ బాబు ) బారి నుండి తన ప్రియురాలు పద్మినిని ( రాధ ) కాపాడుకోవాలని శక్తి అతనికి చెబుతాడు. ఈ సంఘటన తర్వాత అతను తన సోదరి జ్యోతి (సుధా రాణి) తో కలిసి మద్రాసు వెళ్ళినట్లు అతను వెల్లడిస్తాడు. అతను పద్మిని అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. పద్మిని తండ్రి అప్పారావుకు (ప్రదీప్ శక్తి) వీరి సంబంధం నచ్చదు. అప్పారావు తాగుబోతు, తన నర్తకి భార్య సంపాదించిన డబ్బును దొంగిల్సితూంటాడు. చివరకు ఆమె అతనికి ఎదురు తిరిగినప్పుడు, అప్పా రావు ఆమె ముఖంపై సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి కాలుస్తాడు . ఆమె వెంటనే మరణిస్తుంది. దాని తరువాత అప్పారావు పద్మినిని తన తల్లి అడుగుజాడల్లో నడవమని బలవంతం చేస్తాడు.

అప్పారావు బాబా సాబ్ వద్ద అప్పు చేస్తాడు. దానిని తిరిగి చెల్లించటానికి ఏకైక మార్గం పద్మిని నృత్యం. కానీ పద్మిని ఒప్పుకోదు. శక్తిని కలుస్తూనే ఉంటుంది. అప్పారావు బాబా సాబ్ ( అహుతి ప్రసాద్ ) తమ్ముడిని కలుస్తాడు. అతను దొంగతనం నేరానికి గాను జైల్లో ఉండి శిక్ష పూర్తయ్యాక బయటికి వస్తాడు. శక్తి కారణంగా అతన్ని అరెస్టు చేశారు. బాబా సాబ్‌కు శక్తి ఎవరో తెలియదు. అప్పా రావు తక్షణమే శక్తిని గుర్తించి బాబా సాబ్‌కు ప్రతిదీ వివరిస్తాడు. చోటే శక్తి ఇంటికి వెళ్లి ప్రతీకారంగా జ్యోతిని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. శక్తి దీనిని అడ్డుకుని చోటేను చంపుతాడు. శక్తిని అరెస్టు చేసి ఒక సంవత్సరం జైలు శిక్ష వేస్తారు. తరువాతే అతను శక్తి అవుతాడు. శిక్ష అనుభవించిన తరువాత, శక్తి తన స్నేహితుల సహాయంతో బాబా సాబ్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. ప్రతీకారంగా, బాబా సాబ్ పద్మినిని కిడ్నాప్ చేస్తాడు. పద్మినిని రక్షించడానికి అప్పా రావు ఇప్పుడు శక్తితో మాట్లాడతాడు. శక్తి ఆమెను రక్షించి, ఆమెను తిరిగి తన తండ్రి వద్దకు పంపుతాడు, అది చూసి ఆమె షాక్ అవుతుంది.

ఈ మొత్తం కథంతా తెలుసుకున్న తరువాత రంజిత్ కుమార్, శక్తిని తన పని పూర్తి చేయడానికి అనుమతిస్తాడు. పద్మినిని కాపాడిన తరువాత, శక్తి రంజిత్ కుమార్‌కు బేషరతుగా లొంగిపోతాడు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. తిరిగి విచారణ తరువాత, శక్తి తన ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదలవుతాడు. గోవాలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని యోచిస్తాడు. అయితే, పద్మినిని అంగీకరించమని జ్యోతి అతన్ని ఒత్తిడి చేస్తుంది. పద్మిని శక్తిని కలిసేందుకు పోబోగా, అప్పారావు కోపంతో ఆమెను వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నించి ఆమె ముఖం మీద యాసిడ్ పోయబోతాడు. కానిఅ అనుకోకుండా అతనునే చనిపోతాడు. పద్మిని మళ్ళీ శక్తిని కలుస్తుంది.

అయితే, శక్తి నిర్దోషిగా విడుదలైనట్లు తెలుసుకున్న బాబా సాబ్, అతన్ని డాక్ యార్డ్ వద్ద చంపడానికి కుట్ర పన్నాడు. బాబా ( నరేష్ ) బాబా సాబ్ యొక్క కుట్ర గురించి తెలుసుకుని బాబా సాబ్ ను సవాలు చేస్తాడు. బాబా సాబ్ కోపగిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య పోరాటంలో బాబా సాబ్ ఓడిపోతాడు. బాబా సాబ్‌ను బాబన్ చంపబోగా శక్తి అతన్ని అడ్డగించి అతన్ని హత్య చెయ్యకుండా నివారిస్తాడు. ఇంతలో, బాబా సాబ్ తన బలాన్ని కూడదీసుకుని ఒక రాడ్డుతో శక్తిపై దాడి చేయబోగా బాబన్ అడుపడి మరణిస్తాడు. శక్తి బాబా సాబ్‌తో తిరిగి పోరాడి అతనిని చంపబోతాడు. కానీ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ బాబా సాబ్ ను చంపకుండా ఆపుతాడు. శక్తిని చంపడానికి బాబా సాబ్ చేసిన మరో ప్రయత్నంలో, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చి బాబా సాబ్ ను చంపేస్తాడు. దానితో సినిమా ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

పాటలు దాసరి నారాయణరావు రాశాడు. రాజ్-కోటి స్వరపరిచారు. ఈ సంగీతాన్ని AMC ఆడియో కంపెనీలో విడుదల చేశారు.

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."వన్ టూ త్రీ"S. Janaki6:33
2."మా అమ్మాయికి"ఎస్.పి.,బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:33
3."మొక్కజొన్న పొత్తులు"ఎస్.పి.,బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:39
4."వద్దురా నిద్దర"మనో జయచంద్రన్, ఎస్. జానకి4:37
5."డింగ్ డాంగ్ డింగ్"ఎస్.పి.,బాలసుబ్రహ్మణ్యం4:42
మొత్తం నిడివి:25:04

మూలాలు

[మార్చు]
  1. "Two Town Rowdy Crew". entertainment.oneindia.in. Archived from the original on 8 మే 2014. Retrieved 17 February 2013.
  2. "Two Town Rowdi (1989)". aptalkies.com. Retrieved 8 October 2014.[permanent dead link]
  3. "Success and centers list - Venkatesh". idlebrain.com. Retrieved 30 October 2014.