చేగొండి వెంకట హరిరామజోగయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేగొండి వెంకట హరిరామజోగయ్య
చేగొండి వెంకట హరిరామజోగయ్య

చేగొండి వెంకట హరిరామజోగయ్య


నియోజకవర్గము నరసాపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1937-04-05) 1937 ఏప్రిల్ 5
పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ ప్రజారాజ్యం
జీవిత భాగస్వామి సి.భారతి
సంతానము 4 కుమారులు
నివాసము పాలకొల్లు
May 12, 2006నాటికి

మూలం: [1]

చేగొండి వెంకట హరిరామజోగయ్య (జ: 5 ఏప్రిల్, 1937) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తెలుగు సినిమా నిర్మాత.

వీరు నారాయణ స్వామి మరియు కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక మరియు కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.

1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.

వీరు 1972 - 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983 మరియు 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

ఇతడు 2004 సంవత్సరంలో 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు తెలుగు సినిమాలు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు చేగొండి హరిబాబు గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద దేవుళ్లు సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో

బయటి లింకులు[మార్చు]