మానవుడు - దానవుడు (1972 సినిమా)
Appearance
మానవుడు - దానవుడు (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | శోభన్ బాబు , శారద, కృష్ణకుమారి, ముక్కామల |
సంగీతం | అశ్వత్థామ |
నిర్మాణ సంస్థ | ఉషశ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మానవుడు దానవుడు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో ఉషశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.చిన్నపరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1972, జూన్ 23న విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు - డాక్టర్ వేణు, జగన్
- శారద - రాధ
- కృష్ణకుమారి - సీత
- కైకాల సత్యనారాయణ - భుజంగం
- రాజబాబు - రాజు
- జయకుమారి
- జ్యోతిలక్ష్మి
- ముక్కామల -దాదా
- మాస్టర్ ఆదినారాయణ
- అర్జా జనార్ధనరావు
- పి.జె.శర్మ
- కె.కె.శర్మ
- సీతారాం
- మాలతి
- మంజుల
- కె.వి.చలం
- మీనాకుమారి
- ఏడిద నాగేశ్వరరావు
- కృష్ణంరాజు
సాంకేతికవర్గం
[మార్చు]- కథ,స్క్రీన్ ప్లే, నిర్మాత: పి.చిన్నపరెడ్డి
- దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- ఛాయాగ్రహణం: కె.సుఖదేవ్
- కూర్పు: వేలూరి అంకిరెడ్డి
- కళ: వి.సూరన్న
- నృత్యాలు: బి.హీరాలాల్, కె.ఎస్.రెడ్డి, భాస్కర్, జెమిని రాజు
- మాటలు: మోదుకూరి జాన్సన్
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, మోదుకూరి జాన్సన్, ఉషశ్రీ
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు అశ్వత్థామ సంగీత దర్శకత్వం వహించాడు. పాటల వివరాలు:[2]
క్ర.సం. | పాట | రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | అమ్మ లాంటి చల్లనిది, లోకం ఒకటే ఉందిలే, ఆకలి ఆ లోకంలో లేనే లేదులే | దాశరథి | పి.సుశీల |
2 | ఓయ్! బోయ్! ఓ అబ్బాయో! నిలు నిలు నిలు నిలబడు మేమడిగినదానికి బదులిడు | మోదుకూరి జాన్సన్ | ఎల్.ఆర్.ఈశ్వరి, బృందం |
3 | కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పున ఉన్న పూలను చూడు మగడ నే మునుపటి వలనే లేనా? | ఉషశ్రీ | ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం |
4 | కంచెకాడ, మంచెకాడ, కందిచేను గుబురుకాడ, ఏటికాడ, గున్నమావితోట కాడ | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి |
5 | ఎవరు వీరు? ఎవరు వీరు? దేశమాత పెదవిపైన మాసిన చిరునవ్వులు మనసు లేని పిడికిలిలో నలిగి పడిన పువ్వులు | సినారె | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
6 | అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా | సినారె | ఎస్.పి.బాలసుబ్రమణ్యం, బృందం |
7 | పచ్చని మన కాపురం పాలవెలుగై మణిదీపాల వెలుగై కలకాలం నిలవాలి కళకళలాడాలి | సినారె | పి.సుశీల |
8 | అణువు అణువున వెలసిన దేవా, కనువెలుగై మము నడిపించరావా (శోకం) | సినారె | పి.సుశీల, బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Manavudu Dhanavudu (P. Chandrasekhara Reddy) 1972". ఇండియన్ సినిమా. Retrieved 7 January 2023.
- ↑ వెబ్ మాస్టర్. "Manavudu Dhanavudu (1972)-Song_Booklet". ఇండియన్ సినిమా. Retrieved 7 January 2023.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.