మోదుకూరి జాన్సన్
మోదుకూరి జాన్సన్ | |
---|---|
జననం | ఆగస్టు 8, 1936 కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లా |
మరణం | డిసెంబరు 24, 1988 |
మరణ కారణం | గుండెపోటు |
ప్రసిద్ధి | నటులు, నాటక కర్త |
తండ్రి | మోదుకూరి గరువయ్య (పేటూరు) |
తల్లి | రత్తమ్మ |
మోదుకూరి జాన్సన్ (ఆగస్టు 8, 1936 - డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన 'మరో ప్రపంచం' సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.[1]
జననం - విద్యాభ్యాసం - ఉద్యోగం
[మార్చు]వీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగస్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,
నాటకరంగ ప్రస్థానం
[మార్చు]ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు [[నటనాలయం (నాటకం)|నటనాలయం]],[2] దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]మోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు - ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు.[3] వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు - దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.[4]
రచించిన పాటలు
[మార్చు]- కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం (కరుణామయుడు)[5]
- మన జన్మభూమి... బంగారు భూమి(పాడిపంటలు)[1]
- స్వాగతం దొరా (దేశోద్ధారకులు)[3]
మరణం
[మార్చు]వీరు 1988, డిసెంబరు 24 తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 నవ తెలంగాణ. "జాన్సన్ చిరస్మరణీయుడు". Archived from the original on 18 సెప్టెంబరు 2021. Retrieved 8 August 2017.
- ↑ అద్భుత నాటకం నటనాలయం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 24 జూలై 2017, పుట.14
- ↑ 3.0 3.1 సాక్షి (24 December 2014). "ఆ పాట.. ఆయన.. చిరంజీవులు". Sakshi. రెంటాల జయదేవ. Archived from the original on 14 జూలై 2017. Retrieved 8 August 2017.
- ↑ విశాలాంధ్ర, సాహిత్యం (22 February 2010). "తెనాలి తేజోమూర్తులు బొల్లిముంత, జాన్సన్". పెనుగొండ లక్ష్మీనారాయణ. Archived from the original on 11 సెప్టెంబరు 2019. Retrieved 11 September 2019.
- ↑ సాక్షి. "కదిలింది కరుణరథం". Retrieved 8 August 2017.