దేశోద్ధారకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేశోద్ధారకులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం నందమూరి తారక రామారావు,
వాణిశ్రీ,
పద్మనాభం,
నాగభూషణం,
సావిత్రి
పద్మా ఖన్నా
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ దీప్తి ఇంటర్నేషనల్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దేశోద్ధారకులు , 1973లో విడుదలైన ఒక తెలుగు సినిమా. క్రైమ్ కథలో చక్కని పాటలను, మాటలను జోడించడంతో ఇసినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. బ్రౌన్ దొర గెటప్‌లో ఎన్టీయార్ ప్రేక్షకులకు చాలా సరదా కలిగించాడు.[1]

1974: కైరో చలన చిత్రోత్సవాల్లో ఈచిత్రం ప్రదర్శితమైనది.

ఈ సినిమా కథ చాలా సినిమాలలాగానే ఉంటుంది. పెద్ద మనుషుల ముసుగులో కొందరు దుష్టుల అక్రమాలు ఒక వూరిలో చలామణీ అవుతుంటాయి. వారే ఒక జమీందార్ కుటుంబం ప్రమాదంలో మరణించేలా చేసి వారి వంశపు విలువైన రత్నాభరణాలను హస్తగతం చేసుకొంటారు. అలా మరణించిన జమీందార్ తమ్ముడు (ఎన్టీయార్) బ్రౌన్ దొరగా విదేశాలనుండి రంగంలోకి ప్రవేశిస్తాడు. దుర్మార్గులతో చేతులు కలిపినట్లు నటించి వారి గుట్టు బయట పెడతాడు. 1970 దశకంలో సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను భారీ హంగులతోను, సాంకేతిక విలువలతోను నిర్మించారు.

ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్ళన్నారు నాయాళ్ళు, కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు వంటి పాటలు బాగా హిట్టయ్యాయి. ఇంకా డైలాగులు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. రాజశేఖరంగారూ! మీరు కుక్కకన్నా మిక్కిలి ఎక్కువ విశ్వాసం కలిగినవారు అని బ్రౌన్ దొర గారు వచ్చీరాని తెలుగు నటిస్తూ విలన్‌ను అన్యాపదేశంగా ఎత్తిపొడుస్తాడు.

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారక రామారావు,
  • వాణిశ్రీ,
  • సావిత్రి గణేశన్,
  • చిత్తూరు వి.నాగయ్య,
  • నాగభూషణం,
  • బి. పద్మనాబం,
  • అల్లు రామలింగయ్య,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • కైకాల సత్యనారాయణ,
  • రాజనాల,
  • దూళిపాళ,
  • రాజసులోచన,
  • సంధ్యారాణి,
  • లక్ష్మీ ఛాయ,
  • షబ్నం,
  • పద్మా ఖన్నా,
  • శుభ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాతలు: నందమూరి తారక రామారావు, యు.విశ్వేశ్వరరావు, ఎ.కె.వి. ప్రసాద్;
  • రచయిత: ఆర్.హనుమంత రావు;
  • సినిమాటోగ్రాఫర్: జి.కె. రాము;
  • స్వరకర్త: కె.వి. మహదేవన్;
  • సాహిత్యం: ఆచార్య ఆత్రేయ,
  • సి. నారాయణ రెడ్డి,
  • శ్రీ శ్రీ,
  • ఆరుద్ర,
  • మోదుకూరి జాన్సన్,
  • యు. విశ్వేశ్వరరావు

పాటలు[2]

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
ఇదికాదు మా సంస్కృతి ఇదికాదు మా ప్రగతి సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల
ఈ వీణకు శృతిలేదు ఎందరికో హృదయంలేదు నా పాటకు పల్లవిలేదు ఈ బ్రతుకెందులకో అర్ధంకాదు ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల
స్వాగతం దొరా సుస్వాగతం తేనెలాంటి పిలుపువున్న తెలుగునేలకు అన్నపూర్ణను మించిన ఆంధ్రభూమికి సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ పి.సుశీల, బృందం
మబ్బులు రెండూ బేటీ ఐతే మెరుపే వస్తుందీ మనసులు రెండూ సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల, బృందం
ఆకలయ్యీ అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళూ - కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు కె.వి.మహదేవన్ బాలు, బృందం
  • ఏదొ తాపం ఒకటే మైకం ఇంత అందం ఏం చేసుకుంటానురా - ఎల్. ఆర్. ఈశ్వరి
  • కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు పట్టుదొరికి ఎందుకో పట్టనట్టే ఉన్నారు - సుశీల
  • మడి మడి శుచి శుచి అది నిన్నటి మాట తడి తడి రుచి రుచి ఇదే నేటి మాట - ఎస్. జానకి

మూలాలు

[మార్చు]
  1. "Desoddhaarakulu (1973)". Indiancine.ma. Retrieved 2023-07-29.
  2. .వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు

[మార్చు]