డబ్బుకు లోకం దాసోహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డబ్బుకు లోకం దాసోహం
(1973 తెలుగు సినిమా)
Dabbukulokamdasoham.jpg
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం మిద్దె జగన్నాధరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
ఎస్.వి. రంగారావు
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ (యస్.వి.యస్. ఫిలింస్)
భాష తెలుగు

కథ[మార్చు]

సర్పంచ్ ధర్మారావు, అతని తమ్ముడు తాగుబోతు సత్యం చేసే అన్యాయాలను చదువుకున్న యువకుడు రాము ఎదురిస్తాడు. అనాథ అయిన చెల్లెలు ఆస్తిని కాజేసి, ఆమె కూతురు అరుణను తమ్ముడు తాగుబోతు సత్యానికిచ్చి పెళ్ళి చేయాలన్న ధర్మారావు ఎత్తుగడలు విఫలమౌతాయి. అరుణ రాము ప్రేమించుకుంటారు. తనకు అవరోధంగా మారిన రాముపై ధర్మారావు మోసంతో హత్యానేరం మోపి జైలుకు పంపాడు. జైలు నుండి విడుదలై వచ్చిన లాటరీలో డబ్బు గడించి, తన స్నేహితుల సహాయంతో పెద్ద కోటీశ్వరుడై ఆ గ్రామానికే వచ్చి డబ్బు మహిమ ఎలాంటిదో అమాయక ప్రజలకు తెలియజెప్పి, ధర్మారావు అతని అనుచరుల అన్యాయలను బహిర్గతం చేస్తాడు. తనను అపార్థం చేసుకున్న అరుణను నిజాన్ని గ్రహించేటట్టు చేసి, ఎలా తనదానిగా చేసుకొన్నది చిత్రం పతాక సన్నివేశం[1].

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

 1. ఏక్ దో తీన్ చార్ పంచ్ పఠానా అరె చమ్క్ చలోనా ఊరునాడు - ఘంటసాల
 2. చదువు సంపద అందరిదీ పాడి పంట అందరిది - ఘంటసాల, సుశీల, రమాదేవి
 3. చెప్పాలనిఉన్నది నీకొక్కమాట నువ్వు సిగ్గుపడక వింటావా - పిఠాపురం, ఎల్.ఆర్. ఈశ్వరి
 4. చూస్తున్నావా ఓ దేవా చూస్తూ ఊరికే ఉన్నావా జరిగే ఘోరాలు - ఘంటసాల
 5. డబ్బుకు లోకం దాసోహం గణనాధ ఇది దాచాలన్నా దాచని - మాధవపెద్ది బృందం
 6. తాగుతా నీయబ్బ తాగుతా తాగుబోతు నాయాళ్ళ కల్లోదూరెళ్లుతా - మాధవపెద్ది
 7. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట ఒకే బాట - ఘంటసాల, సుశీల
 8. నువ్వూ నేనూ నడిచింది ఒకే బాట ఒకే బాట నువ్వు నేను పలికింది - ఘంటసాల

మూలాలు, వనరులు[మార్చు]

 1. రెంటాల, గోపాలకృష్ణ (19 January 1973). "చిత్రసమీక్ష - డబ్బుకులోకందాసోహం". ఆంధ్రప్రభ దినపత్రిక (సంపుటి 38 సంచిక 18). మాడభూషి కృష్ణస్వామి. Retrieved 17 March 2018. CS1 maint: discouraged parameter (link)
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)