మహమ్మద్ బిన్ తుగ్లక్ (సినిమా)
మహమ్మద్ బిన్ తుగ్లక్ (1972 తెలుగు సినిమా) | |
మహమ్మద్ బిన్ తుగ్లక్ సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
నిర్మాణం | వి.జగన్మోహనరావు |
కథ | చో రామస్వామి |
తారాగణం | నాగభూషణం, సంధ్యారాణి, కృష్ణంరాజు, రమాప్రభ, ఛాయాదేవి, సుకుమారి, రాజబాబు, కె.వి.చలం, బలరాం, అల్లు రామలింగయ్య |
సంగీతం | సాలూరు హనుమంతరావు |
సంభాషణలు | దాసరి నారాయణరావు |
నిర్మాణ సంస్థ | చలన చిత్ర |
భాష | తెలుగు |
మహమ్మద్ బిన్ తుగ్లక్ 1972, ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు సినిమా. తమిళ రంగస్థలంపై ఒక ఊపు ఊపిన చో రామస్వామి నాటకం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. దాసరి నారాయణరావు ఈ సినిమాకు సంభాషణలు అందించాడు.
చిత్రకథ
[మార్చు]ఎన్నికలద్వారా రాజకీయ చదరంగంలో ఎత్తులకు పైఎత్తులు వేసి, అధికార పీఠాలకు అతుక్కుపోయే నాయకులపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్.
హిస్టరీ ప్రొఫెసర్ రంగనాథం చారిత్రక పరిశోధనలు జరిపే తరుణంలో త్రవ్వకాలలోంచి 600 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని పరిపాలించిన తుగ్లక్, అతని మిత్రుడు 'వదుదా' ఒక శవపేటికలోంచి పైకి లేచివస్తారు. అన్ని సంవత్సరాలు గడిచినా అతనికీ అతని స్నేహితుడు వదుదాకీ వార్ధక్యం అన్నమాటే లేదు. ప్రొఫెసర్ రంగనాథం పరిశోధన గురించి తుగ్లక్ పునరాగమనం గురించి వార్తలు దేశం నలుమూలలా వ్యాపిస్తాయి. ప్రొఫెసర్ రంగనాథం, అతని భార్య మీనాక్షి, కొడుకు రాజు, కూతురు పద్మ, మామ రమణయ్య, తండ్రి కనకయ్య, సర్వమంగళం, ఆమె చెవిటి భర్త, కొడుకు, కూతురు, దేశభక్తుడు ధర్మారావు, చిలకజోస్యం చెప్పి డబ్బులు సంపాదించే రవణమ్మ వీరందరూ తుగ్లక్ కార్యకలాపాలను అతి శ్రద్ధగా పరిశీలిస్తుంటారు.
ధర్మారావు ప్రభృతుల ప్రోత్సాహంతో తుగ్లక్ పార్లమెంటుకు పోటీ చేస్తాడు. ఈనాటికి అనుకూలమైన అన్ని రాజకీయపుటెత్తులూ వేసి పార్లమెంటు సభ్యుడౌతాడు. ప్రధాని కూడా అవుతాడు. తనను నమ్ముకున్న రంగనాథానికి ఒక మంత్రి పదవి, రవణమ్మకు ఒక మంత్రి పదవి ఇస్తాడు. ఐక్య సంఘటనతో ప్రభుత్వాన్ని ఏర్పరచి, మంత్రివర్గాన్ని తన చేతిలో కీలుబొమ్మలుగా చేసుకుని రాజకీయ ధురంధరు డనిపించుకుంటాడు. రాజకీయంగా, పరిపాలనాపరంగా తన ఆశయాలు ఒక్కొక్కటే వల్లించి ఏకపక్ష నిర్ణయాలు చేస్తుంటాడు. ఇట్లా జరుగుతున్న కథ డిశెంబరు 31 అర్ధరాత్రి తుగ్లక్, వదుదాల మధ్య జరిగిన ఆంతరంగిక సంభాషణలలో ఒక పెద్దమలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏమిటనేది ఈ చిత్రానికంతటికీ పెద్ద సస్పెన్స్[1].
నటీనటులు
[మార్చు]- తుగ్లక్ - నాగభూషణం
- వదుదా - కృష్ణంరాజు
- ప్రొఫెసర్ రంగనాథం - రావి కొండలరావు
- ప్రొఫెసర్ రంగనాథం కొడుకు - రాజబాబు
- ప్రొఫెసర్ రంగనాథం కూతురు - సంధ్యారాణి
- ప్రొఫెసర్ రంగనాథం వియ్యంకుడు - అల్లు రామలింగయ్య
- ఛాయాదేవి
- సాక్షి రంగారావు
- రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: బి.వి.ప్రసాద్
సంగీతం: సాలూరు హనుమంతరావు
నిర్మాత: వి.జగన్మోహనరావు
నిర్మాణ సంస్థ: చలన చిత్ర
కధ: చో రామస్వామి
మాటలు: దాసరి నారాయణరావు
పాటలు: సి నారాయణ రెడ్డి, దాశరథి,కొసరాజు
గాయనీ గాయకులు: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి, విజయలక్ష్మి, కన్నారావు
విడుదల:1972: ఫిబ్రవరి:11.
పాటలు
[మార్చు]- అల్లా అల్లా యాఅల్లా అల్లా ఏమిటయ్యా నీ లీల ఎందుకయ్యా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- కొంటె చూపుల చిలకమ్మా నీ జంట నేనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: దాశరథి
- జోహారు జోహారు ఢిల్లీశ్వరా - విజయలక్ష్మీ కన్నారావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: సినారె
- పద్మనాభ పురుషోత్తమ వాసుదేవా ( పద్యం ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- నిరుపమ గుణశాలి సుల్తాను మౌళి నీసరి వారేరి వేలనలో - పి.సుశీల - రచన: సినారె
- వయసులో రూబీ రూబీ దిల్ రుబా సొగసులో రోజీ రోజీ - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: సినారె
- హేపి బర్త్ డే టు యు ... దేశం కోసం మీ తండ్రెంతో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ ఐ., ఎస్. (13 February 1972). "చిత్ర సమీక్ష: మహమ్మద్ బిన్ తుగ్లక్". ఆంధ్రజ్యోతి దినపత్రిక: 8. Retrieved 11 December 2016.[permanent dead link]