కురుక్షేత్రం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుక్షేత్రం
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ మాధవీ పద్మాలయ కంబైన్స్
భాష తెలుగు

1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం. పౌరాణిక బ్రహ్మ గా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో , భారీ తారాగణంతో, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,చంద్రమోహన్, మోహన్ బాబు, బాలయ్య, జమున,అంజలీ దేవి, విజయ నిర్మల, నటించగ సంగీతం, ఎస్ రాజేశ్వరరావు అందించారు.

వివాదం[మార్చు]

ఈ చిత్రానికి పోటిగా దాన వీర శూర కర్ణ చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.

చిత్ర సన్నివేశాలు[మార్చు]

మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

విశేషాలు[మార్చు]

సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు. దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయ దుంధుబి మ్రోగించింది.

పాత్రలు - పాత్రధారులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

.దర్శకుడు : కమలాకర కామేశ్వరరావు

.కదా రచయిత : త్రిపురనేని మహారది

. నిర్మాణ సంస్థ: మాధవి పద్మాలయ కంబైన్స్

. నిర్మాత: ఏ.ఎస్.ఆర్ . ఆంజనేయులు

. ఎడిటింగ్: కోటగిరి గోపాలరావు

. గీత రచయితలు: శ్రీ శ్రీ, సి నారాయణ రెడ్డి, ఆరుద్ర , వేటూరి సుందర రామమూర్తి , సముద్రాల జూనియర్

గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల .




పాటల జాబితా[మార్చు]

1: ధర్మక్షేత్రం , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2: అలుకల కులుకుల , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3: ఇదే మయసభ మందిరం , రచన: సముద్రాల జూనియర్, గానం.పి సుశీల

4: హరివిల్లు దివినుంచి , రచన: ఆరుద్ర, గానం.పి సుశీల , వి.రామకృష్ణ

5: మ్రోగింది కళ్యాణవీణ , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి, సుశీల .

మూలాలు[మార్చు]