మా నాన్నకు పెళ్ళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా నాన్నకు పెళ్ళి
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం అర్జునరాజు
తారాగణం శ్రీకాంత్,
సిమ్రాన్,
కృష్ణంరాజు,
అంబిక
ఎమ్మెస్ నారాయణ
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ రోజా మూవీస్
భాష తెలుగు

మా నాన్నకు పెళ్ళి 1997 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం. ఇందులో శ్రీకాంత్, సిమ్రాన్, కృష్ణంరాజు ముఖ్యపాత్రలు పోషించారు.[1] ఈ చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.

కథ[మార్చు]

బాలరాజు ( శ్రీకాంత్ ) రాఘవ రాజు (కృష్ణంరాజు ) కు ఏకైక కుమారుడు. సుబ్బరాజు మనవడు ( కోటా శ్రీనివాసరావు ). బాలరాజు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. రాఘవ రాజు తన తల్లి లేని లోటు తెలీకుండా చాలా జాగ్రత్తగా పెంచుతాడు. అతను మరొక పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా చెయ్యడు. ఎందుకంటే అందువలన కొడుకు పట్ల ఉన్న ప్రేమకు దెబ్బకొడుతుందని అతడు భావిస్తాడు.

విమాన ప్రయాణంలో బాలరాజు లాహరి ( సిమ్రాన్ ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అతని ప్రేమను అందరూ అంగీకరిస్తారు. ఒక రోజు, అతను తన తండ్రి డైరీని చదివేటప్పుడు తన తండ్రి శ్రావణి ( అంబికా ) అనే మహిళ పట్ల ప్రేమ భావాలను అణచివేసినట్లు తెలుసుకుంటాడు. తన పెళ్ళితో పాటు తన తండ్రికి శ్రావణితో పెళ్ళి జరిపించాలని అనుకుంటాడు. లహరి అతడి ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోగా అతను తన ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతాడు. తన కొడుకు ప్రేమ కష్టాల్లో పడిందన్న సంగతి తెలుసుకున్న రాఘవరాజు, తన కొడుకు పెళ్ళి ఎలాంటి సమస్యలు లేకుండా జరిగేలా శ్రావణిని దూరంగా పంపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే సుబ్బరాజు, బాలరాజు దీనిని ఆపి రాఘవరాజును ఒప్పిస్తారు. చివరగా కథ సుఖాంతమౌతుంది

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • అదిరిందిరా తాతా అమ్మడి అందం (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • దేవుడి గుళ్ళో పెళ్ళికి అంతా చుట్టాలేనంట (గానం: మనో, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "మా నాన్నకి పెళ్ళి (1997) | మా నాన్నకి పెళ్ళి Movie | మా నాన్నకి పెళ్ళి Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-21. Retrieved 2020-08-21.