మాతృ మూర్తి
Appearance
(మాతృమూర్తి నుండి దారిమార్పు చెందింది)
మాతృ మూర్తి (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మానాపురం అప్పారావు |
---|---|
తారాగణం | హరనాధ్, బి.సరోజాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | విశ్వజ్యోతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
మాతృమూర్తి 1972లో విడుదలైన తెలుగు సినిమా. విశ్వజ్యోతి పిక్చర్స్ పతాకంపై వి.వి. రాజేంద్ర కుమార్, కె. సత్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు మానాపురం అప్పారావు దర్శకత్వం వహించాడు. హరనాథ్, బి.సరోజాదేవి ప్రధాన తాగారణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- అంజలీ దేవి
- హరనాథ్
- చంద్రమోహన్
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- బి.సరోజాదేవి
- అల్లు రామలింగయ్య
- రాజబాబు
- రమాప్రభ
- ధూళిపాళ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: మానాపురం అప్పారావు
- స్టూడియో: విశ్వజ్యోతి పిక్చర్స్
- నిర్మాత: వి.వి. రాజేంద్ర కుమార్, కె. సత్యనారాయణ;
- స్వరకర్త: పెండ్యాల నాగేశ్వరరావు
- విడుదల తేదీ: అక్టోబర్ 6, 1972
- మాటలు: రాజశ్రీ, దాసరి నారాయణరావు
- పాటలు: రాజశ్రీ, కొసరాజు, దాశరథి
- నేపధ్యగానం: ఘంటసాల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, యల్.ఆర్.ఈశ్వరి, జమునారాణి
- సంగీతం: పెండ్యాల
- కళ: రాజేంద్రకుమార్
- కూర్పు: దాశరథి
- నృత్యాలు:హీరాలాల్, కె.ఎస్.రెడ్డి, తంగరాజ్
- స్టిల్స్: డి.రాధాకృష్ణమూర్తి
- ఇంతే ఈ లోకం తీరింతే త్యాగానికి ఫలితం ఇంతే - ఘంటసాల - రచన: దాశరధి
- నీనీడగా నన్ను కదలాడని నీ గుండెలో నన్ను- పి.సుశీల,ఘంటసాల - రచన: రాజశ్రీ
- అమ్మము మీరిద్దరు ఒకటే ఒకటే - సుశీల- రచన: రాజశ్రీ
- కళ్ళజోడు పెట్టుకున్న అమ్మాయీ! -ఎస్.పి.బాలు, రచన: కొసరాజు
- ఎడమొగం పెడమొగం ఎంది ఈ కత - జమునారాణి - రచన: రాజశ్రీ
మూలాలు
[మార్చు]- ↑ "Mathru Moorthi (1972)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.