ఎ. వి. ఎస్

వికీపీడియా నుండి
(ఎ.వి.ఎస్. (నటుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అమంచి వెంకట సుబ్రహ్మణ్యం
జననం
అమంచి వెంకట సుబ్రహ్మణ్యం

(1957-01-02) 1957 జనవరి 2 (వయసు 67)[1]
మరణంనవంబర్ 8 2013
ఇతర పేర్లుఎ.వి.ఎస్.
గుర్తించదగిన సేవలు
జర్నలిస్ట్, నటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత
తల్లిదండ్రులువీర రాఘవయ్య, శివ కామేశ్వరి

ఎ.వి.ఎస్ గా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (జనవరి 2, 1957 - నవంబర్ 8, 2013) తెలుగు చిత్ర హాస్యనటుడూ, రచయితా, దర్శకుడూ, నిర్మాతా, రాజకీయనాయకుడూ. ఇతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

తెలుగు చలనచిత్ర సీమలో ఎ.వి.ఎస్ గా పిలువబడే అమంచి వెంకట సుబ్రమణ్యం గుంటూరు జిల్లా తెనాలిలో 1957, జనవరి 2న వీర రాఘవయ్యా, శివ కామేశ్వరీ దంపతులకు జన్మించాడు. వీఎస్‌ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశాడు. ఆ కళాశాల లెక్చరర్ నఫీజుద్దిన్ /ఎం.డి.సౌజన్య రాసిన నాటకాల్లో ఏవీఎస్ నటిస్తుండేవాడు. రసమయి సంస్థను రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరుతెచ్చుకున్నాడు. లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమా, కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలూ, సన్మానాలూ నిర్వహిస్తుండేవాడు. శారద కళాపీఠం, నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించాడు. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు ‘‘మిస్టర్ పెళ్ళాం’’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నాడు. ఆంధ్రజ్యోతి లో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన ఏవీఎస్, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఏవీఎస్ నటించిన ఆఖరి చిత్రం పవిత్ర.

19 ఏళ్లలో ఏవీఎస్ 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారాడు. సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఏవీఎస్, నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతను కొద్ది కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జనరల్ సెక్రటరీగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

కుటుంబం

[మార్చు]

ఏవీఎస్‌కు 1980లో ఆశాకిరణ్మయి తో వివాహం జరిగింది. తెనాలిలో స్టేజి కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కుమార్తె శ్రీ ప్రశాంతి, ఒక కుమారుడు ప్రదీప్.

నట జీవితము

[మార్చు]

ఎన్టీఆర్ నిర్మించిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లో నటించినప్పటికీ ‘మిస్టర్ పెళ్లాం’ ముందుగా విడుదలైంది. ఈ రెండు సినిమాలకూ బాపు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికే నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ‘మిస్టర్ పెళ్లాం’ ఘన విజయం సాధించడంతో ఏవిఎస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది. హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా సుమారు 500 సినిమాల్లో నటించారు. ‘మిస్టర్ పెళ్లాం’లో ‘తుత్తి’ పదంతో ఆయన పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది. ‘సూపర్ హీరోస్’, ‘ఓరి నీ ప్రేమ బంగారం కానూ’, ‘రూమ్‌మేట్స్’, ‘అంకుల్’, ‘కోతిమూక’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయక తరహా పాత్రల్లోనూ మెప్పించారు. తొలి సినిమా ‘మిస్టర్ పెళ్లాం’లో నటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. మాయలోడు, మేడమ్, ఆమె, శభమస్తు, ఓహో నా పెళ్లంట, ధర్మ చక్రం, మా విడాకులు, ‘శుభలగ్నం’, ‘యమలీల’, ‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’, ‘కంటే కూతుర్నే కను’, ‘వినోదం’ వంటి అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షక జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. టీవీ నటుడిగా, వ్యాఖ్యాతగానూ రాణించారు. కోతి మూక చిత్రానికి ఉత్తమ కథా రచయితగా, అంకుల్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఎ.వి.ఎస్ తన నటనప్రతిభకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బహుమతులు అందుకున్నాడు. అంకుల్ , ఓరి నీ ప్రేమ బంగారం కానూ అనే రెండు సినిమాలు నిర్మించాడు.[3][4]

ఇతర వివరాలు

[మార్చు]

చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను, చదువు చెప్పిన గురువులను, నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదికపైనా స్మరించుకునే వారు. తెనాలి వచ్చినప్పుడల్లా తనతోపాటు పరిశ్రమకు చెందిన కళాకారులను ఎందరినో తీసుకువచ్చి, తెనాలి ప్రాధాన్యం తెలిసేలా వారిని గౌరవించేవారు. తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపనపడ్డారు. ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవీఎస్‌ చేసిన కృషి మరువలేనిది. చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ఆంధ్రాప్యారిస్‌ గొప్పతనాన్ని చాటారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌, నటులు మురళీ మోహన్‌ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అందజేయడంలో భాగస్వాములయ్యారు. రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవీఎస్‌ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు. పట్టణంలో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు.

‘తుత్తి’ మ్యానరిజం చేసిన ఆయన, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’, శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు. ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దాదాపు 450 సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరుసంపాదించారు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్, కోతిమూకలు సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు.

ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని, నటుడు కమలహాసన్, కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవీఎస్ చెపుతుండేవారు. రాజకీయ రంగంపైనా ఆసక్తి ఉండటంతో ఏవిఎస్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొన్నారు. పలు సాంస్కృతిక సంఘాల నుంచి అనేక అవార్డులు, ఘన సన్మానాలు పొందారు.

విశేషాలు

[మార్చు]

చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను, చదువు చెప్పిన గురువులను, నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదికపైనా స్మరించుకునే వారు. తెనాలి వచ్చినప్పుడల్లా తనతోపాటు పరిశ్రమకు చెందిన కళాకారులను ఎందరినో తీసుకువచ్చి, తెనాలి ప్రాధాన్యం తెలిసేలా వారిని గౌరవించేవారు. కళలకాణాచి పేరును సార్థకం చేసేందుకు ఆయన నిత్యం పరితపించారు. తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపనపడ్డారు. ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవీఎస్‌ చేసిన కృషి మరువలేనిది. చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ఆంధ్రాప్యారిస్‌ గొప్పతనాన్ని చాటారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌, నటులు మురళీ మోహన్‌ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అందజేయడంలో భాగస్వాములయ్యారు. రంగస్థల నటునిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవీఎస్‌ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు. వివేకా విద్యా సంస్థలు, గ్లోబల్‌ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు. పట్టణంలో ఓపెన్‌ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన బాపును ప్రతివేదికపైనా గురువుగా చెప్పుకునేవారు.బాపు గీసిన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శ్రీనాథ సార్వభౌమ సినిమాలో బాపు, రమణలు ఏవీఎస్‌కు మంచి అవకాశం కల్పించారు. చిత్ర విచిత్రమైన మ్యానరిజాలతో ప్రేక్షకుల్ని నవ్వించడం, సెంటిమెంట్‌తో కంట తడిపెట్టించడం ఆయనకే సొంతం. ‘తుత్తి’ మ్యానరిజం చేసినా, ఘటోత్కచుడు సినిమాలో ‘రంగుపడుద్ది’, శుభలగ్నం సినిమాలో ‘గాలి కనపడుతుందా’ వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు. ఆ తరువాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్‌గా, ఇన్‌చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. దాదాపు 450 సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరుసంపాదించారు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్, కోతిమూకలు సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రల్లోనూ నటించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు.సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు. ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని, నటుడు కమలహాసన్, కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవీఎస్ చెపుతుండేవారు. పుట్టినగడ్డ ఆంధ్రాప్యారిస్ తెనాలికి సేవ చేయాలని ఎప్పుడూ తపనపడుతుండేవారు. ఇక్కడ ఏషియన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. వివేక విద్యాసంస్థల డెరైక్టర్ రావిపాటి వీరనారాయణ సహకారంతో గ్లోబల్ హాస్పటల్ సౌజన్యంతో రెండు సార్లు తెనాలిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెనాలిని సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని కోరుతుండేవారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయారు.

మరణం

[మార్చు]

2008లో ఆయన కుమార్తె దానం చేయడంవల్ల కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిరిగి కోలుకుని, పలు చిత్రాల్లో నటించాడు. కాలేయం వ్యాధి మళ్ళీ ముదరడంతో మణికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో 2013 నవంబరు 8వ తేదీ రాత్రి కన్ను మూశారు.

ముఖ్యమైన చిత్రాలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

నంది పురస్కారాలు

[మార్చు]

నటించిన చిత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "AVS- Biography". telugumovietalkies.com. Archived from the original on 20 June 2011. Retrieved 15 June 2011.
  2. "AVS - Profile". altiusdirectory.com. Archived from the original on 26 జూలై 2011. Retrieved 17 జూన్ 2013.
  3. "AVS - Producer". indyarocks.com. Archived from the original on 1 September 2011. Retrieved 15 June 2011.
  4. "AVS - Directed Movies". telugumovietalkies.com. Archived from the original on 20 June 2011. Retrieved 15 June 2011.
  5. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
  6. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.
  7. "48.Name :Sri A.V.Subramanyam". Telugucinemacharitra. Retrieved 23 June 2011.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎ._వి._ఎస్&oldid=3979604" నుండి వెలికితీశారు