Jump to content

మహానంది (సినిమా)

వికీపీడియా నుండి
మహానంది
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. సముద్ర
చిత్రానువాదం వి. సముద్ర
తారాగణం సుమంత్, అనుష్క, శ్రీహరి, అభినయశ్రీ, నాజర్, కోట శ్రీనివాసరావు, సుమన్, కౌసల్య, వేణు మాధవ్, కొండవలస లక్ష్మణరావు, సుబ్బరాజు
నిర్మాణ సంస్థ ఆర్.ఎస్.మూవీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 3 డిసెంబర్ 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మహానంది 2005 లో విడుదలైన తెలుగు యాక్షన్ / డ్రామా చిత్రం. వి సముద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో సుమంత్, అనుష్క శెట్టి, శ్రీహరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2005 డిసెంబరు 3 న విడుదలైంది.[1] ఇది బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరి విజయాన్ని సాధించింది. దీనిని హిందీలోకి ఏక్ ఔర్ మహాయుద్ధ్ అని, మలయాళంలో ఉల్లాసం పేరుతోనూ డబ్ చేశారు.[2]

స్వామి ( శ్రీహరి ) బాల్యంలో తన తల్లిదండ్రులను ప్రత్యర్థి వర్గం వారు హత్య చేయడంతో తన సోదరితో కలిసి రాయలసీమను విడిచిపోతాడు. పెద్దయ్యాక స్వామి శక్తివంతమైన డాన్ అవుతాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రత్యర్థి వర్గపు నాయకుడు భాస్కర్, చర్లపల్లి జైల్లో ఉంటాడు. అతని ప్రధాన లక్ష్యం స్వామిని చంపడం.

శంకర్ (సుమంత్) స్వామి పెంచి పెద్ద చేసిన అనాథ. అతడికి బాడీ గార్డుగాను, కుడిభుజం గానూ ఎదుగుతాడు. స్వామి తన సోదరి నందిని (అనుష్క శెట్టి) పెళ్ళి, ఆమె సమ్మతి అడగకుండానే, నాయర్ కుమారుడు (కోట శ్రీనివాసరావు) తో కుదుర్చుతాడు. ఈ ప్రతిపాదన నందినికి నచ్చదు. ఈ పెళ్ళి తప్పించుకోవాలని చూస్తుంది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి కుమార్ ( సాయి కిరణ్ ) ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని ఆమె శంకర్ కు అబద్ధం చెబుతుంది. ఇంటి నుండి తప్పించుకోవడానికి ఆమె శంకర్ సహాయం తీసుకుంటుంది. శంకర్, తప్పనిసరి పరిస్థితిలో అయిష్టంగానే ఒప్పుకుంటాడు. తప్పించుకునే ముందు, నందిని స్వామికి ఒక లేఖ రాస్తూ, వాస్తవానికి తాను శంకర్‌ను ప్రేమిస్తున్నాని, తామిద్దరూ పారిపోతున్నామని చెబుతుంది. ఈ లేఖ శంకర్, స్వామిల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. శంకర్ ద్రోహం చేసినట్లు భావిస్తాడు. తరువాత, నందిని శంకర్ కు తాను నిజంగా ప్రేమిస్తున్నది తననేనని, కుమార్ ను కాదనీ చెబుతుంది. శంకర్ షాక్ అవుతాడు. ఇంతలో స్వామి శంకర్ ల మధ్య ఏర్పడిన విభేదాలను సద్వినియోగం చేసుకోవడానికి భాస్కర్ ప్రయత్నిస్తాడు. దాడిని ప్లాన్ చేస్తాడు. శంకర్ కూడా క్రమంగా నందీనితో ప్రేమలో పడతాడు. చివరికి స్వామి, శంకర్ కలిసి భాస్కర్ తో పోరాడతారు. వారు చివరకు రాజీపడతారు, కాని స్వామి అతని గాయాల కారణంగా మరణిస్తాడు. శంకర్, నందిని వివాహం చేసుకుంటారు. వారికి ఒక కుమారుడు పుడతాడు. వాడికి స్వామి అని పేరు పెడతాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఫార్చ్యూన్ కత్రియా హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహానంది ఆడియోను నటుడు వెంకటేష్ విడుదల చేశాడు. మధుర ఎంటర్టైన్మెంట్స్ లేబుల్ ఆడియోను పంపిణీ చేసి విక్రయించింది. రాజమండ్రి సమీపంలో తన మరో చిత్రం గోదావరి షూటింగ్‌లో ఉన్నందున సుమంత్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.[3]

పాట పేరు సింగర్స్ లిరిసిస్ట్
"ఏమైనా" హరిహరన్, చిత్ర బండారు దానయ్య కవి
"టైట్గున్నా జీన్స్ పాంటు" టిప్పు తైదల బాపు
"ఇంద్రధనుస్సు" శ్రేయా ఘోషల్ ఈశ్వర్ తేజ
"ఎటు చూస్తే అటు నువ్వే" కె.ఎస్.చిత్ర వేల్పుల వెంకటేష్
"చంపకమాల" శంకర్ మహదేవన్, మాలతి భాస్కరభట్ల
"నా పంచ ప్రాణాలు" ఎస్పీ బాలసుబ్రమణ్యం, కె.ఎస్.చిత్ర గురుచరణ్
"కత్తిలాంటి అమ్మాయి" అద్నాన్ సమీ, సుజాత, కమలాకర్ వేటూరి సుందరరామ మూర్తి

మూలాలు

[మార్చు]
  1. Mahanandi
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-06.
  3. "Mahanandi - audio function - Telugu Cinema - Sumanth, Anushka & Srihari". Idlebrain.com. 2005-10-31. Retrieved 2013-08-02.