Jump to content

మిస్టర్ పెళ్ళాం

వికీపీడియా నుండి
‌మిస్టర్ పెళ్ళాం
దర్శకత్వంబాపు
నిర్మాతగవర పార్థసారథి
తారాగణంరాజేంద్ర ప్రసాద్,
ఆమని
ఛాయాగ్రహణంఆర్.కె.రాజు
కూర్పుకె.ఎన్.రాజు
సంగీతంఎం. ఎం. కీరవాణి
భాషతెలుగు

మిస్టర్ పెళ్ళాం బాపు రమణల చిత్రం. ఇది 1993లో విడుదలయినది. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రంలోని పాత్రకు ఎ.వి.ఎస్.కు నంది ఉత్తమ హాస్య నటుడు పురస్కారం వరించింది. శ్రీ చాముండి చిత్ర పతాకంపై బాపు దర్శకత్వంలో గవర పార్థ సారథి నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ఈ చిత్రం మిస్టర్ మామ్ అనే ఆంగ్ల చిత్రం నుండి ప్రేరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది.[1][2][3]

బాలాజీ (రాజేంద్ర ప్రసాద్) బ్యాంకు ఉద్యోగి. భార్య ఝాన్సీ (ఆమని) ఒక గృహిణి. వారికి ఇద్దరు అందమైన పిల్లలు. బాలాజీ హెడ్ క్యాషియర్‌గా పదోన్నతి పొందుతాడు. నిబంధనల ప్రకారం, బ్యాంక్ వాల్ట్ కు చెందిన ఒక తాళం చెవి అతని వద్ద, రెండవది బ్యాంకు మేనేజరు (తనికెళ్ళ భరణి) వద్దా ఉంటాయి. అతను ఒక టెలివిజన్ సెట్ (కాలనీలో మొదటిది!) కొని తన ప్రమోషన్ను జరుపుకుంటాడు. కాని మేనేజరు మరో బ్యాంకు ఉద్యోగితో కలిసి బాలాజీని మోసం చేసి డబ్బు కొట్టేస్తారు. తత్కారణంగా, బాలాజీ బ్యాంకుకు 1 లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది. ప్రమోషన్ రోజునే అతను బ్యాంకు నుండి సస్పెండవుతాడు. అతని నెగటివ్ రికార్డ్ కారణంగా వేరే ఉద్యోగం కూడా రాదు.

ఝాన్సీ బాలాజీని ఒప్పించి అన్నపూర్ణ ఫుడ్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. దీని మేనేజింగ్ డైరెక్టరు గోపాల్ కృష్ణ (ఎవిఎస్) 12 వ తరగతి నుండి ఆమెకు స్నేహితుడు. ఆమె ఆఫీసులో తన స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళినపుడు యాదృచ్ఛికంగా జరుగుతున్న బోర్డు సమావేశంలో వ్యాపార సమస్యను పరిష్కరించడంలో ఆమె తెలివివైన సలహాలు ఇస్తుంది. వెంటనే ఆమెకు నెలకు 10 వేల వేతనంతో సేల్స్ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉద్యోగం పొందుతుంది. 3 వేల నెలసరి వేతనంతో ఉద్యోగం సంపాదించానని ఆమె భర్తకు చెబుతుంది.

ఆ తరువాత వాళ్ళిద్దరి మధ్య ఇంటి పనుల విషయమై కొన్ని పోట్లాటలు వస్తాయి. చివరకు, గోపాల్ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకల సంఘటనల తరువాత, బాలాజీ తన సంయమనం కోల్పోతాడు. తనను గోపాల్‌తో పోల్చి చిన్నబుచ్చేందుకే అక్కడికి తీసుకెళ్ళిందని ఆమెను నిందిస్తాడు. అమ్మకాలలో భారీ పెరుగుదలకు గాని ఆమెకు 20 వేల బోనస్, ఆమె పొదుపూ కలిపి మొత్తం 85 వేలు ఆమెకు లభిస్తుంది. ఆమె గోపాల్ నుండి 15 వేలు రుణం తీసుకుని బ్యాంకుకు కట్టాల్సిన లక్ష రూపాయలు బాలాజీకి ఇస్తుంది. ఇది బాలాజీకి కోపం తెప్పిస్తుంది. తాను దొంగతనం చేశానని ఆమె నిర్ధారించిందని కోపిస్తాడు. అతను మేనేజరుకు ఓ పబ్లిక్‌ ఫోన్ నుండి ఫోను చేసి, అతడి నీచమైన ప్రణాళిక తనకు తెలిసిపోయిందని చెప్తాడు. ఇంతలో, ఝాన్సీ తన స్నేహితుడు గోపాల్ సహాయం తీసుకొని బ్యాంక్ చైర్మన్‌ను పిలిచి తప్పుడు కేసు గురించి చెబుతాడు. పరిస్థితులన్నీ గాట్లో పడి అ జంట తమ మధ్య ఉన్న అంతరాలను సరిచేసుకుంటారు.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."అడగవయ్య అయ్యగారీ"Arudraఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర3:46
2."రాదే చెలీ"వేటూరి సుందరరామమూర్తికె.ఎస్.చిత్ర3:14
3."మాయదారి కృష్ణయ్య"ఆరుద్రఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం4:27
4."సొగసు చూడ తరమా"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:25
5."ముల్లు పొయ్యి కట్టె వచ్చె"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం,3:09
మొత్తం నిడివి:19:41

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 3 March 2012.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-20. Retrieved 2020-08-21.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2003-11-26. Retrieved 2020-08-21.