మిమిక్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిమిక్రీ (Mimicry) అనేది అనేక శబ్దాలను నోటితో అనుకరించగలిగే ఒక అపురూపమైన కళ. కొన్ని సంధర్బాలలో వ్యక్తుల ప్రవర్తనలను కూడా అనుకరిస్తారు. దీనినే తెలుగులో ధ్వన్యనుకరణ అంటారు. ఆంధ్రప్రదేశ్ లో నేరెళ్ళ వేణుమాధవ్ అనే ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ కళాకారుని పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మిమిక్రీ కళాకారులు,వివిధ సినిమా, నాటక కళాకారుల గొంతుకనూ, పక్షులు, జంతువులు చేసే శబ్దాలనూ, వివిధ వాయిద్య పరికరాలు చేసే శబ్దాలనూ, వివిధ వాహనాలు వెలువరించే శబ్దాలను నోటితో పలికిస్తుంటారు.

మిమిక్రీ కళాకారులు

[మార్చు]

తెలుగు భాషలో ధ్వన్యనుకరణం

[మార్చు]

ధ్వన్యనుకరణలో శబ్దాన్ని అనుకరణ చేస్తాము. అయితే తెలుగు భాషలో కొన్ని కొన్ని పనులకు మన పూర్వులు కొన్ని పేర్లు పెట్టారు. ఠంగుఠంగుమని గంట కొట్టడం, గలగల పారడం, కిలకిల నవ్వడం మొదలైనవి. ఆయా సందర్భాలలో మనం వీటిని ఉపయోగిస్తుంటాం లేదా విని ఆస్వాదిస్తుంటాం.

క్రమసంఖ్య ధ్వన్యనుకరణం విధానం
1. అహాహా, అహాహా ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది
2. ఇహిహి, ఇహ్హిహ్హిహ్హి నవ్వడాన్ని తెలియజేస్తుంది
3. ఉహుహూ, హుహుహు చలి అనుభవాన్ని తెలియజేస్తుంది
4. కటకట కరువు బాధను తెలియజేస్తుంది
5. కరకర, కఱకఱ నమిలే లేదా కొరికే విధానాన్ని తెలియజేస్తుంది.
6. కలకల, కిలకిల నవ్వే విధానాన్ని తెలియజేస్తుంది
7. కిచకిచ, కువకువ పక్షుల కూతను తెలియజేస్తుంది
8. కిఱ్ఱుకిఱ్ఱు కొన్ని రకాల చెప్పులు చేయు ధ్వనిని తెలియజేస్తుంది
9. కుతకుత అన్నాదులు ఉడుకుతున్న ధ్వనిని తెలియజేస్తుంది
10. కొఱకొఱ కోపంగా చూడడాన్ని తెలియజేస్తుంది
11. గబగబ త్వరగా పోవడాన్ని తెలియజేస్తుంది
12. గమగమ, గుమగుమ పరిమళాన్ని తెలియజేస్తుంది
13. గిజగిజ కాళ్ళు చేతులు కొట్టుకోవడాన్ని తెలియజేస్తుంది
14. గిరగిర తిరుగుటను తెలియజేస్తుంది
15. గిలిగిలి చక్కలిగింతను తెలియజేస్తుంది
16. గొణగొణ గొణుగుకొనుటను తెలియజేస్తుంది
17. చకచక పరిగెత్తే విధానాన్ని తెలియజేస్తుంది
18. చటచట, చిటపట మంటలో వస్తువులు పేలడాన్ని తెలియజేస్తుంది
19. చిమచిమ కురుపు మంటను తెలియజేస్తుంది
20. చురచుర, చుఱచుఱ మండడాన్ని తెలియజేస్తుంది
21. టకటక గుర్రము వంటి జంతువుల నడకను తెలియజేస్తుంది
22. ఠంగుఠంగు గంటల మ్రోతను తెలియజేస్తుంది.
23. తలతల, తళతళ మెరయుటను తెలియజేస్తుంది
24. తహతహ తమకాన్ని తెలియజేస్తుంది
25. దడదడ గుండె కొట్టుకొనడాన్ని తెలియజేస్తుంది
26. ధగధగ, మిలమిల ప్రకాశించుటను తెలియజేస్తుంది
27. నకనక ఆకలి బాధను తెలియజేస్తుంది
28. నిగనిగ కాంతి విశేషాన్ని తెలియజేస్తుంది
29. పకపక నవ్వినప్పటి శబ్దాన్ని తెలియజేస్తుంది
30. పెళపెళ చెట్లు విరుగుట ధ్వనిని తెలియజేస్తుంది
31 బొటబొట కారుటను తెలియజేస్తుంది
32. బెకబెక కప్ప అరుపును సూచిస్తుంది
33. రెపరెప గాలివీచుటను సూచిస్తుంది
34. సలసల ద్రవాలు మరుగుటను సూచిస్తుంది
35. సరసర పాము ప్రాకడం సూచిస్తుంది

ఉపయక్త గ్రంథ సూచి

[మార్చు]
  1. మిమిక్రి-మిమిక్రి- బి.శ్రీనివాస్
  2. మిమిక్రీ పాఠాలు-బి.శ్రీనివాసరావు
"https://te.wikipedia.org/w/index.php?title=మిమిక్రీ&oldid=2883195" నుండి వెలికితీశారు