Jump to content

మధుమాసం

వికీపీడియా నుండి
మధుమాసం
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్ర సిద్ధార్థ
నిర్మాణం డి.రామానాయుడు
కథ బలభద్రపాత్రుని రమణి
తారాగణం సుమంత్,
స్నేహ,
కృష్ణుడు (నటుడు),
పార్వతి మెల్టన్,
సీమ,
నరేష్,
రావి కొండలరావు,
చలపతి రావు,
అస్మిత,
శివపార్వతి,
దీపాంజలి,
బేబీ యాని,
వెంకట్
సంగీతం మణిశర్మ
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌
భాష తెలుగు

మధుమాసం 2007 లో చంద్రసిద్ధార్థ దర్శకత్వంలో[1] విడుదలైన శృంగార కథా చిత్రం. దీనిని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. రామానాయుడు నిర్మించారు. మధుమాసం 9 ఫిబ్రవరి 2007న మిశ్రమ సమీక్షలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది, కొన్ని కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శింపబడింది. ఇందులో సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్ ముఖ్యపాత్రల్లో నటించారు.

కథాగమనం

[మార్చు]

ఈ చిత్రంలో కథ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలిగే మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్ (సుమంత్) పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ (పార్వతీ మెల్టన్) ఇంకొక అడుగు ముందుకు వేసి సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, నచ్చిన మగాడితో తిరగడం లాంటివి చేసే విచ్చలవిడి మనస్తత్వం కలిగిన అత్యాధునిక స్త్రీ. వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం గల అమ్మాయి హంస (స్నేహ). తను ఉద్యోగం చేస్తూ తండ్రిని పోషిస్తుంటుంది. ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా, కొన్ని సంఘటనల వలన సంజయ్ ప్రేమను నమ్మే వాడుగా మారి హంసను ప్రేమించడం ప్రారంభిస్తే, అందుకు విరుద్ధంగా హంస ప్రేమ, ఆప్యాయతలు, స్వార్ధమునుండే పుడతాయని ప్రేమాభిమానాలు నమ్మని వ్యక్తిగా మారుతుంది. విచ్చలవిడిగా తిరిగే మనస్తత్వంగల మాయ ఒక పరిణితి చెందిన స్త్రీగా మారుతుంది. తననిష్టపడే యువకున్ని పెళ్ళి చేసుకొంటుంది. సంజయ్ ప్రేమించే హంస, సంజయ్ ప్రేమను సైతం నమ్మనిదిగా మారగా ఆమెలో మార్పు తీసుకొచ్చి పెళ్ళి చేసుకొంటాడు సంజయ్.

చిత్రవిశేషాలు

[మార్చు]

చాలా కాలం విరామం తరువాత రచయిత సత్యానంద్ ఈ చిత్రానికి సంభాషణలు అందించారు. పాటలు అన్నీ బావున్నా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఏపాటా గుర్తుండదు. సినిమాను కుటుంబసమేతంగా చూసే విధంగా తీసారు. ఎక్కడా అసభ్యత అశ్లీలం కనిపించవు. కమర్షియల్గా పెద్ద విజయం సాధించనప్పటికీ విలువలు కలిగిన సినిమాగా నిలబడింది.

తారాగణం

[మార్చు]
  • సంజయ్ గా సుమంత్
  • హంస వాహిని "హంస" గా స్నేహ
  • మాయగా పార్వతి మెల్టన్
  • సంజయ్ తండ్రిగా చలపతిరావు
  • సంజయ్ తల్లిగా కవిత
  • హంస తండ్రిగా గిరి బాబు
  • సంజయ్ మామగా నరేష్
  • హంస బావమరిది గా సూర్య
  • హంసా అన్నయ్యగా సమీర్
  • సంజయ్ మామగా ఆహుతి ప్రసాద్
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు వేణుమాధవ్
  • హంసాస్ బాస్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • హాస్టల్ వాచ్ మాన్ గా ఎల్ బి శ్రీరామ్
  • డాక్టర్ గా AVS
  • మాయ ఇంటి యజమానిగా కొండవలస
  • పోలీస్ ఇన్స్పెక్టర్ గా శివా రెడ్డి
  • సంజయ్ తాతగా రావి కొండల రావు
  • మాయ బాస్ గా రవిబాబు
  • హంసా స్నేహితురాలిగా అశ్మితా కర్ణాని
  • నర్స్‌గా రజిత (డాక్టర్‌కు సహాయకురాలు)
  • హాస్టల్ వార్డెన్ గా బెంగళూరు పద్మ
  • దీపాంజలి
  • పోలీస్ కానిస్టేబుల్ గా గుండు హనుమంత రావు
  • సంజయ్ స్నేహితుడిగా ఉత్తేజ్
  • మంగతాయారు 'మంగ'గా సీమ, సంజయ్ కజిన్
  • సుమన్ శెట్టి
  • సంజయ్ స్నేహితుడిగా కృష్ణుడు
  • పీటర్ గా వెంకట్ (అతిథి పాత్ర)
  • హంసను ఆకర్షించడానికి సంజయ్‌తో ఆటపట్టించే అమ్మాయిగా బేబీ అన్నీ (గుర్తింపు లేని పాత్ర)

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చారు .[2] ఆదిత్య మ్యూజిక్ ద్వారా సంగీతం విడుదలైంది .

Track list
సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."దేవదాసు కన్న"పెద్దాడ మూర్తికార్తీక్ , భార్గవి04:12
2."వాలెంటైన్"చంద్ర బోస్రాహుల్ నంబియార్ , రీటా04:31
3."ప్రామిస్ చేస్తూ ఉన్నా"పెద్దాడ మూర్తిరంజిత్, రీటా04:48
4."ఊహలే"పెద్దాడ మూర్తికె.ఎస్. చిత్ర , కార్తీక్04:42
5."ఓణి మెరుపులు"సుద్దాల అశోక్ తేజమురళీధర్, రంజిత్, జయదేవ్04:41
6."వసంతం"వేటూరిరంజిత్, రీటా04:42
మొత్తం నిడివి:27:36

మూలాలు

[మార్చు]
  1. "Madhumasam: A different tale of love". www.rediff.com. Retrieved 2026-01-02.
  2. Madhumasam Songs: Madhumasam MP3 Telugu Songs by Mani Sharma Online Free on Gaana.com (in ఇంగ్లీష్), archived from the original on 2022-11-28, retrieved 2026-01-02
"https://te.wikipedia.org/w/index.php?title=మధుమాసం&oldid=4743553" నుండి వెలికితీశారు