కృష్ణుడు (నటుడు)
కృష్ణుడు | |
జన్మ నామం | కృష్ణుడు |
జననం | చింతలపల్లి రాజోలు తాలూకా, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1975 జూలై 29
ప్రముఖ పాత్రలు | హ్యాపీ డేస్ వినాయకుడు దూకుడు (సినిమా) |
కృష్ణుడు ఒక తెలుగు సినీ నటుడు. తన భారీ కాయంతో తనదైన ప్రత్యేక శైలి నటనను సృష్టించుకున్నాడు.
నేపథ్యం
[మార్చు]ఇతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు.తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, చింతలపల్లి ఇతడి స్వగ్రామము. ఇతడు విజయనగరంలో జన్మించాడు. వీళ్ళ నాన్నగారి పేరు అల్లూరి సీతారామరాజు. అమ్మ సావిత్రీదేవి. నాలుగో తరగతి వరకు నిడదవోలులో, తొమ్మిది వరకు విశాఖపట్నంలో, పదో తరగతి కాకినాడలో చదివాడు. బెంగళూరులో పాలిటెక్నిక్ కోర్సు, ఆటోమొబైల్‌లో డిప్లొమా చేశాడు.[1]
నటనా నేపథ్యం
[మార్చు]1997లో హైదరాబాదు చేరుకుని కమలాపూర్ కాలనీలో ఉన్న దేవదాస్ కనకాలగారి ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. రాజీవ్ కనకాల కూడా అప్పుడప్పుడు వీరికి క్లాసులు చెప్పేవారు. వారి అమ్మ లక్ష్మీదేవి కనకాల రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాడు. ఇతడితోపాటు శ్రీవాస్తవ్ కూడా దర్శకత్వంలో శిక్షణ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. శిక్షణ పూర్తయి అవకాశాలు వస్తున్న సమయంలో ఇతడి స్కూటర్‌ని లారీ డీకొట్టి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముక విరగడంతో రాజోలు సమీపంలోని వీరి సొంతూరు చింతలపల్లి వెళ్లిపోయాడు. నటీమణి హేమ కూడా రాజోలు నివాసే. వారి సహకారం ఇతడికి బాగా లభించింది.
నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | |
2019 | ఆపరేషన్ గోల్డ్‌ఫిష్[2] | ||
2013 | దళం | ||
బుల్లబ్బాయ్ | |||
మిస్టర్ మన్మథ | |||
2012 | ఎటో వెళ్ళిపోయింది మనసు | ప్రకాశ్ | |
2012 | నిప్పు | ||
2010 | బృందావనం (2010 సినిమా) | ||
2010 | చంద్రుడు | ||
మ్యాంగో | |||
అమాయకుడు | |||
కోతిమూక | |||
పప్పు | |||
ఏ మాయ చేశావే | నిజ జీవిత పాత్ర | ||
2009 | ఆర్య 2 | ||
విలేజ్ లో వినాయకుడు[3] | కార్తీక్ | ||
ఓయ్! | ఫాట్సో | ||
2009 | అదుర్స్ (సినిమా) | ||
2008 | వినాయకుడు (సినిమా) | కార్తీక్ | |
జల్సా | ప్రతినాయకుడి పరిచయ దృశ్యం | ||
2007 | హ్యాపీ డేస్ | లావుపాటి సీనియర్ | |
మధుమాసం | |||
ఒక్కడున్నాడు | |||
2006 | పోకిరి | ||
2004 | ఆర్య | ||
2003 | అప్పుడప్పుడు | ||
గంగోత్రి (సినిమా) |
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "వాళ్లు నన్ను నిరుత్సాహపరిచినా...పూరీజగన్నాథ్ ఓ సలహా ఇచ్చారు". andhrajyothy.com. 2017-01-06. Archived from the original on 2017-01-08. Retrieved 2017-01-06.
- ↑ ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్ గోల్డ్‌ఫిష్". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.
- ↑ "Krishnudu, Saranya in ‘Village Lo Vinayakudu’ Archived 2012-03-14 at the Wayback Machine", MSN India, 15 September 2009, retrieved 2011-07-12