Jump to content

ఓయ్!

వికీపీడియా నుండి
ఓయ్!
సినిమా పోస్టర్
దర్శకత్వంఆనంద్ రంగ
రచనఆనంద్ రంగ
నిర్మాతడి.వి.వి. దానయ్య
తారాగణంసిద్ధార్థ్
శామిలి[1]
కూర్పుకె వెంకటేష్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
యూనివర్సల్ మీడియా
విడుదల తేదీ
3 జూలై 2009 (2009-07-03)
సినిమా నిడివి
166 నిడివి
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్10 కోట్లు
బాక్సాఫీసు43 కోట్లు

ఓయ్ సినిమా తెలుగు యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం.

ఉదయ్ (సిద్దార్ధ) తన ప్రియురాలు సంధ్య (షామిలి) జ్ఞాపకాలను గుర్తు చేసికోవటంతో కథ ప్రారంభమవుతుంది.ఫ్లాష్ బ్యాక్ లో ఉదయ్ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త కొడుకు.సంధ్య (షామిలి) సాధారణ యువతి. వైజాగ్ అమ్మాయి సంధ్య (షామిలి). ఒకరోజు తన బర్త్ డే వేడుకను ఓ పబ్ లో జరుపుకొంటున్న టైం లో ఫ్రెండ్ బలవంతం మీద అక్కడుకు వచ్చిన సంధ్య సిద్దార్థ కంటపడుతుంది. ఓయ్ అంటూ ఆమె పిలిచిన పిలుపుతో అతను ప్రేమలో పడిపోతాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే.[2]

తారాగణం

[మార్చు]
  1. సిద్దార్థ్
  2. శామిలి
  3. నేపోలియన్
  4. సునిల్
  5. ఆలీ
  6. ప్రదీఫ్ రావత్
  7. ఎమ్ ఎస్ నారాయణ
  8. తనికెళ్ళ భరణి
  9. సురేఖ వాణి
  10. కృష్ణుడు

పాటలు

[మార్చు]

ఈ సినిమా సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించారు. 2009 మే 22న రామా నాయుడు స్టూడియోలో విడుదల చేశారు.మొత్తం 6 పాటలు ఉన్నాయి. వీటిలో యువన్ శంకర్ రాజా స్వయంగా ఒక పాట పాడగా మరొక పాటను చిత్ర ప్రధాన నటుడు సిద్ధార్థ్ పాడారు.యువన్ శంకర్ రాజా తన సంగీత స్కోరుకు చాలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ పాటలు అపారమైన ఆదరణ పొందాయి.[3][4][5][6][7]

పాటలు
సం.పాటపాట రచయితArtist(s)పాట నిడివి
1."ఓయ్ ఓయ్"చంద్ర బోస్సిద్ధార్థ్4:42
2."సరదాగా"అనంత శ్రీరామ్సునిధి చౌహాన్, కార్తీక్ ముత్తురామన్4:38
3."వెయిటింగ్ ఫర్ యు"వనమాలికె.కె5:54
4."అనుకోలేదేనాడు"వనమాలిశ్రేయ ఘోషాల్, శ్వేతా పండిట్4:44
5."పోవోద్దె ప్రేమ"వనమాలియువన్ శంకర్ రాజా4:35
6."షేహరి"Surendra Krishna, Krishna Chaitanyaతోషి స‌బ్రి, ప్రియ హిమేష్4:45
మొత్తం నిడివి:29:18

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
  2. https://telugu.filmibeat.com
  3. "Oy! audio review". idlebrain.com. Archived from the original on 5 June 2009. Retrieved 2009-07-04.
  4. "'Oy!' almost complete". indiaglitz.com. Archived from the original on 2009-06-20. Retrieved 2009-07-04.
  5. "'Oye' to can last song in Chennai". musicindiaonline.com. Retrieved 2009-07-04. [dead link]
  6. "Shamili debuts as heroine". indiaglitz.com. Archived from the original on 2009-07-03. Retrieved 2009-07-04.
  7. "Andhra Mesmerized With Yuvan's Tune". sivajitv.com. Retrieved 2009-07-04.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓయ్!&oldid=4348473" నుండి వెలికితీశారు