వనమాలి
వనమాలి | |
---|---|
![]() | |
జననం | మణి గోపాల్ జనవరి 31, 1974 |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | వనమాలి |
వృత్తి | సినీ గీత రచయిత పాత్రికేయుడు (పూర్వం) |
పిల్లలు | వనమాలి (కుమారుడు) |
వనమాలి వర్థమాన సినీ గీత రచయిత. ఈయన హ్యాపీ డేస్ చిత్రానికి ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పూర్వాశ్రమంలో ఈయన సితార పత్రికలో పాత్రికేయులుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పి.హెచ్.డి చేశారు.
బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]
వనమాలి అసలు పేరు మణి గోపాల్. వీరు జన్మతః తమిళులు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కడప, కదిరి లో సాగింది. పిమ్మట హిందీ భాషా పండిట్ శిక్షణ ను కూడా పూర్తి చేశాడు. తరువాత తెలుగు భాష మీద ప్రత్యేక అభిమానంతో తొలుత ఎం.ఏ చేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయం వారి ఉపకార వేతనముతో పి.హెచ్.డి పూర్తి చేశాడు.
ఉద్యోగ ప్రస్థానం[మార్చు]
సితార సినీ వార పత్రిక ప్రకటించిన ఉద్యోగ ప్రకటన చూసి దానికి దరఖాస్తు చేయగా 176 అభ్యర్థులలో వీరు ఎంపికయ్యాడు. తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన అభిరుచి మేరకు రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు.
సినీరంగ ప్రవేశం[మార్చు]
ప్రముఖ తమిళ దర్శకులు గీతాకృష్ణ గారి టైమ్ చిత్రానికి గేయాలను రచించడం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు.
ఇంతవరకు పనిచేసిన చిత్రాలు[మార్చు]
- అలా ఎలా? (2014)
- ఓ మై ఫ్రెండ్ (2011)
- రంగం (సినిమా) (2011)
- 180 (2011)
- మరోచరిత్ర (2010)
- ప్రస్థానం (2010)
- ఆరెంజ్ (2010)
- గాయం2 (2010)
- రోబో (2010)
- సింహం (1997)
- కలవరమాయే మదిలో
- ఆవకాయ్ బిర్యాని
- హ్యాపీ డేస్
- చందమామ
- మనసు పలికే మౌన రాగం
- నోట్ బుక్
- శివ పుత్రుడు
- తపన
- సూర్యం
- టైమ్