పాత్రికేయులు

వికీపీడియా నుండి
(పాత్రికేయుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వార్తలను, ఇతర సమాచారాన్నీ సేకరించి ప్రజలకు అందించేవారు పాత్రికేయులు. ఈ వృత్తి పేరు పాత్రికేయ వృత్తి. వారు సామాన్య విషయాలపై పనిచెయ్యవచ్చు, ప్రత్యేకించి ఒక రంగంలో విశేష కృషి చెయ్యనూవచ్చు. ఎక్కువ మంది పాత్రికేయులు ఒక రంగంలో కృషి చేసి, నైపుణ్యం సాధించేందుకు మొగ్గు చూపిస్తారు. ఇతర నిపుణులతో కలిసి వివిధ విషయాలపై రచనలను కూర్చి పత్రికలను వెలయిస్తారు.[1] ఉదాహరణకు, క్రీడల పాత్రికేయులు క్రీడలకు సంబంధించిన వార్తలపై పనిచేస్తారు. అయితే వీళ్ళు అనేక రంగాల వార్తలను ప్రచురించే వార్తా పత్రికలో పనిచేస్తూండవచ్చు.

వివిధ పద్ధతుల ద్వారా పరిశీలన జరిపి వార్తలను సేకరించి వార్తాపత్రికలు, మేగజైన్ల ద్వారా అందించే పద్ధతిని ప్రింట్ మీడియా అని, టెలివిజన్, రేడియో, డాక్యుమెంటరీ చిత్రాల ద్వారా అందించే పద్ధతిని ఎలక్ట్రానిక్ మీడియా అని, అన్ లైన్ ద్వారా అందించే పద్ధతిని డిజిటల్ మీడియా అనీ అంటారు.

ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో కొన్ని వార్తా సంస్థలు (న్యూస్ ఏజన్సీలు) ఉన్నాయి. అవి ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాకు అనేక వార్తలను చేరవేస్తాయి. భారత దేశంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఇంటర్నేషనల్, ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్, భారత్ న్యూస్ ఇంటర్నేషనల్ మొదలైన వార్తా సంస్థలున్నాయి. బిఎన్‌ఐ మీడియా వారు తెలుగులో వార్తలను అందిస్తున్నారు.

పాత్రలు, పనులు[మార్చు]

పాత్రికేయ వృత్తిలో -రిపోర్టర్లు, సబ్-ఎడిటర్లు, ఎడిటర్లు, కాలమిస్టులు, ఫోటో జర్నలిస్టులు మొదలైన అనేక పాత్రలున్నాయి.

సమాచారాన్ని సేకరించే వారు రిపోర్టర్లు. రిపోర్టర్లు తమ సమయాన్ని రెండుగా విభజించుకుంటారు. క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించడం ఒక భాగం కాగా, న్యూస్‌రూములో పనిచెయ్యడం రెండవ భాగం. రిపోర్టర్లకు ఒక ప్రత్యేకించిన ప్రాంతంలో పనిచేస్తారు దీన్ని బీట్ అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Diderot, Denis. "Journalist". The Encyclopedia of Diderot & d'Alembert: Collaborative Translations Project. Retrieved 1 April 2015.