ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్
తరహావార్తా సంస్థ
స్థాపన{{{foundation}}}
స్థాపకులుప్రేమ్ ప్రకాష్
ప్రధానకేంద్రము
కార్య క్షేత్రంభారతదేశం, దక్షిణాసియా
కీలక వ్యక్తులు
  • సంజీవ్ ప్రకాష్
    (CEO)
  • ప్రేమ్ ప్రకాష్
    (చైర్మన్)
పరిశ్రమమీడియా
యజమానిANI మీడియా ప్రైవేట్ లిమిటెడ్[1]

ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) అనేది భారతదేశంలోని, ఇతర ప్రాంతాలలోని న్యూస్-బ్యూరోలకు సిండికేట్ మల్టీమీడియా న్యూస్ ఫీడ్‌ను అందించే భారతీయ వార్తా సంస్థ . [2] దీన్ని 1971 లో ప్రేమ్ ప్రకాష్ స్థాపించాడు. ఇది భారతదేశంలో వీడియో వార్తలను సిండికేట్ చేసిన మొదటి ఏజెన్సీ 2019 నాటికి, భారతదేశంలో అతిపెద్ద టెలివిజన్ వార్తా సంస్థ. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రచార సాధనంగా పనిచేసిందని విమర్శలు వచ్చాయి. [3][4] నకిలీ వార్తల వెబ్‌సైట్‌ల నుండి విశేషాలను పంపిణీ చేయడం, [5][6][7][8] సంఘటనలపై తప్పుడు నివేదికలు ఇవ్వడం వంటి విమర్శలు కూడా వచ్చాయి. [3] [9]

చరిత్ర[మార్చు]

స్థాపన, ప్రారంభ సంవత్సరాలు (1971–2000)[మార్చు]

ప్రేమ్ ఫోటోగ్రఫీ రంగంలో తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తరువాత అతను విస్‌న్యూస్,రాయిటర్స్ లలో ఫోటో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరి స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన చారిత్రక సంఘటనలను కవర్ చేసాడు. [3][4] 1970వ దశకంలో వార్తలు, డాక్యుమెంటరీ చలనచిత్రాల నిర్మాణంలో అతనికి ముఖ్యమైన పాత్ర ఉంది. అతను విదేశీ పాత్రికేయులు, చిత్రనిర్మాతలలో గణనీయమైన గౌరవాన్ని పొందాడు. బ్రిటిషు ప్రభుత్వం అతనికి MBE ని ప్రదానం చేసింది. [3][4]

1971లో, ప్రేమ్ ANI (ప్రారంభంలో దాని పేరు TVNF, భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ న్యూస్ ఫీచర్ ఏజెన్సీ)ని స్థాపించాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి అసాధారణమైన పలుకుబడి ఉండేది. [3] దూరదర్శన్ కోసం అనేక చిత్రాలను నిర్మించి, ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని సాధించి, భారతదేశాన్ని ఒక సానుకూల కోణంలో చూపించాలనే ఇందిరా గాంధీ కోరికలను నెరవేర్చడంలో TVNF కీలక పాత్ర పోషించింది. [3]

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో పూర్వ విద్యార్థి అయిన స్మితా ప్రకాష్ 1986లో ANIలో ఇంటర్న్‌గా చేరింది. తర్వాత పూర్తికాల ఉద్యోగిగా మారింది. [3] ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ ఇన్నా రామమోహనరావు కుమార్తె అయిన స్మిత, 1988లో ప్రేమ్ కుమారుడు సంజీవ్‌ను వివాహం చేసుకుంది. దీనితో ANI ప్రభుత్వానికి మరింతగా దగ్గరైంది. [3][10] 1993లో, రాయిటర్స్ ANIలో వాటాను కొనుగోలు చేసి, దాని భారతదేశ ఫీడ్‌పై పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండటానికి అనుమతించబడింది. [3]

తరువాతి సంవత్సరాలు (2000–ప్రస్తుతం)[మార్చు]

2000 నాటికి, భారతదేశంలో ప్రైవేట్ 24x7 వార్తా ఛానెల్‌ల విజృంభణ మొదలైంది; అయితే, నిలకడలేని రాబడి నమూనాల వలన దేశవ్యాప్తంగా వీడియో-రిపోర్టర్‌లను నియమించుకునే సామర్థ్యం వాటికి లేవు. [3] దీన్ని అవకాశంగా తీసుకుని సంజీవ్, ANI యొక్క దేశీయ వీడియో-ప్రొడక్షన్ సామర్థ్యాలను భారీగా విస్తరించాడు. అతను తన చురుకైన నిర్వహణా చాతుర్యంతో సంస్థలో కింది నుండి బాగా ఎదిగాడు. [3] వార్తాపత్రికలు, ఇతర పత్రికలకు ఫీడ్ అందించడానికి 2000లో ఏషియన్ ఫిల్మ్స్ టీవీని ఏర్పాటు చేశారు. [4] అయితే, సంస్థలో పనిచేసే క్షేత్ర స్థాయి ఉద్యోగులలో ఎక్కువ మంది తక్కువ-ధరతో రిక్రూట్ అయినవారని, వారికి జర్నలిజంతో పెద్దగా సంబంధం లేదనీ కారవాన్ పత్రిక రాసింది. [4]

2000లో, NDA ప్రభుత్వం కాశ్మీర్ ఆధారిత ప్రాంతీయ ఛానెల్‌ — DD కాశ్మీర్ ని ప్రారంభించింది. దాని కార్యక్రమాలను రూపొందించడానికి ANI ని నియమించారు. [3] [4] 2005 చివరి నాటికి, ANI యొక్క వ్యాపార-నమూనా స్థిరమైన ప్రాతిపదికన ఆకట్టుకునేలా ఉంది. ఇది తన కార్యాలయాన్ని గోలే మార్కెట్ నుండి RK పురంలోని కొత్త ఐదు అంతస్తుల భవనానికి మార్చింది. [3] ANIని ఆ తరువాత వచ్చిన UPA ప్రభుత్వాలు కూడా విశ్వసించాయి. భారతదేశం, USA యొక్క ప్రస్తుత నేతల ఉమ్మడి పత్రికా సమావేశంలో పాల్గొన్న ఇద్దరు సభ్యులలో ఒకరుగా స్మితను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. [3]

2000వ దశకంలో, ANI ఫీడ్ యొక్క ఛార్జీలు పెరగడం, దాని తక్కువ స్థాయి నాణ్యత కలిగిన జర్నలిజంతో పాటు, ప్రసార వ్యాన్‌లు రంగంలోకి రావడంతో అనేక జాతీయ, ప్రాంతీయ ఛానెల్‌లు సంస్థతో ఉన్న తమ చందాను ఆపివేసాయి. [3] 2010లో యశ్వంత్ దేశ్‌ముఖ్ UNI TV ప్రారంభించడంతో సంస్థకు గట్టి పోటీ ఎదురైంది. [3] అయితే, 2011లో కంపెనీలో చేరిన స్మిత కుమారుడు ఇషాన్ ప్రకాష్, అనేక LiveU యూనిట్లను సేకరించాడు. ANI విదేశీ బ్యూరోలను విస్తరించాడు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. [3][11] మళ్లీ గుత్తాధిపత్యం నెలకొల్పుకున్నాడు. చివరికి పోటీదారులు చాలా వరకు మూతబడ్డాయి. [3]

2011 చివరి నాటికి, రాయిటర్స్ ఫీడ్‌లో ANI కి 99% వాటా ఉంది. FY 2017–18లో, సేవల కోసం వారికి ₹ 2.54 కోట్లు చెల్లించారు. [4] ఆర్కైవ్ వీడియోలు సెకనుకు ₹ 1000 కంటే ఎక్కువ ధరలకు విక్రయించబడ్డాయి; FY 2017–18లో, సంస్థ ₹ 68.23 కోట్ల ఆదాయం, ₹ 9.91 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. [4]

వివాదాలు[మార్చు]

ప్రచారం[మార్చు]

ది కారవాన్, ది కెన్ పత్రికల్లో వచ్చిన నివేదికలు, ఇతర మీడియా వాచ్‌డాగ్‌ల నివేదికలతో పాటుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రచార సాధనంగా పనిచేసినట్లుగా ఈ సంస్థపై ఆలోపణలున్నాయి. [3][4] [12]

కాంగ్రెస్ పాలనలో ANI, విదేశాంగ మంత్రిత్వ శాఖకు బాహ్య ప్రచార విభాగంగా పనిచేసిందని, సైన్యాన్ని సానుకూల దృష్టితో చూపుతూ, ఏదైనా అంతర్గత అసంతృప్తి గురించిన వార్తలను అణిచివేసేదని కారవాన్ పేర్కొంది; సంస్థ యొక్క ప్రైవేట్ స్వభావం, దాని వ్యవస్థాపకుడి కీర్తి వలన, వారి వీడియోలకు పక్షపాతం లేని చట్టబద్ధత చేకూరింది. [3] కాశ్మీర్ సంఘర్షణలో తీవ్రవాదం గరిష్ట-స్థాయిలో ఉన్న సమయంలో అక్కడి వీడియో-ఫుటేజీని దాదాపుగా పూర్తిగా ANI యే అందించింది. మరీ ముఖ్యంగా రామ్మోహనరావు ప్రభుత్వ మీడియా సలహాదారుగా నియమితులయ్యాక. [3] 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ANI, ప్రభుత్వానికి మరింత దగ్గరైంది; బిజెపి రాజకీయ ప్రచారాలను సానుభూతితో కవర్ చేయడం నుండి ప్రత్యర్థి పార్టీల నాయకులతో విలేఖరులు ఘర్షణకు దిగడం వరకూ చేసేవారు. [3][4] స్మిత బీజేపీకి అనుకూలమైన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. [3] [13]

2020లో, EU DisinfoLab చేసిన పరిశోధనలో, ANI అనేక సందర్భాల్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగాను, కొన్నిసార్లు చైనా వ్యతిరేకంగానూ ఉన్న అభిప్రాయాలు వార్తల కంటెంట్‌ను ప్రచురించిందని, యూరోపియన్ రాజకీయ నాయకులు వెలిబుచ్చినట్లుగా తప్పుగా ఆపాదించబడిన అభిప్రాయాలు, ఇతర తప్పుడు సమాచారంతో వార్తలను ప్రచురించిందని నిర్ధారించింది. "శ్రీవాస్త గ్రూప్" అనే సంస్థ నడిపే అనేక భారతదేశ-అనుకూల నకిలీ వార్తల వెబ్‌సైట్‌ల నుండి ఈ వార్తలను సేకరించినట్లు తెలిసింది. [14][15][16][17][18][19]

ప్రధాన స్రవంతి భారతీయ వార్తా మాధ్యమాలు ANI అందించిన కంటెంట్‌పై ఆధారపడతాయని, ANI అనేక సందర్భాలలో తప్పుడూ వార్తల నెట్‌వర్కులు నడిపే "ప్రభావితం చేసే ఆపరేషన్"కి చట్టబద్ధతను కవరేజీనీ అందించిందని, ఈ నెట్‌వర్కు "ఏఎన్‌ఐపై ఆధారపడీనంతగా మరే ఇతర నెట్‌వర్కుపై ఆధారపడదనీ" ఆ నివేదిక పేర్కొంది. [14] ఈ ఫేక్ న్యూస్ కవరేజీ యొక్క ప్రాథమిక లక్ష్యం అంతర్జాతీయ ఫోరమ్‌లలో "పాకిస్తాన్‌ను అప్రతిష్టపాలు చేయడం". [14] ANI భారతదేశపు బాహ్య గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కు మిత్రపక్షంగా కూడా ముఖ్యమైన పాత్రలను పోషించిందని భావిస్తారు; దాని వీడియోలలో చాలా వరకు పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై అల్పస్థాయి లాబీ గ్రూపులు, కార్యకర్తల నిరసనలను చిత్రీకరించాయి.[3]

తప్పుడు సమాచారం[మార్చు]

ఆల్ట్ న్యూస్‌తో సహా పోయింటర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్ (IFCN) లు దీన్ని ధ్రువీకరించిన వాస్తవ తనిఖీదారులు ANI, సంఘటనలను తప్పుగా నివేదించిందని కూడా ఆరోపించాయి. [3] [20] కారవాన్ ANI పంపిన అనేక వీడియో ఫుటేజ్‌లను చూసింది, ఇందులో పాకిస్తాన్‌కు చెందిన యాదృచ్ఛిక టెలివిజన్ ఛానెల్‌ల లోగోలు, ఉర్దూ టిక్కర్‌లను భారతదేశాన్ని సానుకూల దృష్టిలో చూపించే వార్తలపై సూపరింపోస్ చేసారు; వారి వీడియో ఎడిటర్లు కూడా క్లిప్‌లను ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. [3]

ఉద్యోగుల నిర్వహణ[మార్చు]

కొత్త మేనేజ్‌మెంట్ కింద, జర్నలిస్టులు గరిష్ట ఆదాయ ఉత్పత్తిపై దృష్టి సారించి ఒక రకమైన దూకుడు జర్నలిజాన్ని అవలంబిస్తున్నట్లు ANI ఆరోపణలు ఎదుర్కొంది. [3][4] ANIకి ఎటువంటి మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ లేదని, తమ మాజీ ఉద్యోగుల పట్ల సంస్థ దురుసుగా ప్రవర్తించిందనీ పలువురు ఉద్యోగులు ఆరోపించారు. [3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Terms & Conditions". aninews.in (in ఇంగ్లీష్).
  2. "Footaging It Fleetly". Outlook India Magazine. Retrieved 2019-12-29.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 3.13 3.14 3.15 3.16 3.17 3.18 3.19 3.20 3.21 3.22 3.23 3.24 3.25 3.26 3.27 Donthi, Praveen (1 March 2019). "The Image Makers : How ANI Reports The Government's Version Of Truth". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2019-12-07.
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 Ahluwalia, Harveen; Srivilasan, Pranav (2018-10-21). "How ANI quietly built a monopoly". The Ken (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
  5. Hussain, Abid; Menon, Shruti (10 December 2020). "The dead professor and the vast pro-India disinformation campaign". BBC. Retrieved 10 December 2020. The network was designed primarily to "discredit Pakistan internationally" and influence decision-making at the UN Human Rights Council (UNHRC) and European Parliament, EU DisinfoLab said.
  6. Saeed, Saim; Kayali, Laura (9 December 2020). "New pro-India EU website enrolling MEPs campaigns against Pakistan". Politico. Retrieved 9 December 2020.
  7. Rej, Abhijnan. "EU Non-Profit Unearths Massive Indian Disinformation Campaign". thediplomat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
  8. "Indian Chronicles: deep dive into a 15-year operation targeting the EU and UN to serve Indian interests". EU DisinfoLab (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
  9. Chaudhuri, Pooja (2018-10-21). "ANI - A tale of inadvertent errors and oversights". Alt News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
  10. Ahluwalia, Harveen; Srivilasan, Pranav (2018-10-21). "How ANI quietly built a monopoly". The Ken (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
  11. Ahluwalia, Harveen; Srivilasan, Pranav (2018-10-21). "How ANI quietly built a monopoly". The Ken (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.
  12. Tiwari, Ayush (18 September 2019). "Meet ANI's 'European experts' on Kashmir. They're experts all right — just not on Kashmir". Newslaundry. Retrieved 4 January 2019.
  13. Dhillon, Amrit (2019-01-05). "Indian PM lampooned for 'manufactured' interview". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2019-12-29.
  14. 14.0 14.1 14.2 Hussain, Abid; Menon, Shruti (10 December 2020). "The dead professor and the vast pro-India disinformation campaign". BBC. Retrieved 10 December 2020. The network was designed primarily to "discredit Pakistan internationally" and influence decision-making at the UN Human Rights Council (UNHRC) and European Parliament, EU DisinfoLab said.
  15. Saeed, Saim; Kayali, Laura (9 December 2020). "New pro-India EU website enrolling MEPs campaigns against Pakistan". Politico. Retrieved 9 December 2020.
  16. Rej, Abhijnan. "EU Non-Profit Unearths Massive Indian Disinformation Campaign". thediplomat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
  17. "Indian Chronicles: deep dive into a 15-year operation targeting the EU and UN to serve Indian interests". EU DisinfoLab (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
  18. "ANI, Srivastava Group named in massive EU disinformation campaign to promote Modi government's interests". The Caravan (in ఇంగ్లీష్). Retrieved 2020-12-11.
  19. "Une vaste campagne de désinformation et d'influence indienne en Europe dévoilée". Le Monde.fr (in ఫ్రెంచ్). 2020-12-09. Retrieved 2020-12-11.
  20. Chaudhuri, Pooja (2018-10-21). "ANI - A tale of inadvertent errors and oversights". Alt News (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-12-28.