శ్రీమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమణి
జననం
పాగోలు గిరీష్

వృత్తిగీత రచయిత
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • పాగోలు వెంకటాచలం (తండ్రి)
  • నాగమణి (తల్లి)

శ్రీమణి ఒక తెలుగు సినీ గేయ రచయిత.[1] అత్తారింటికి దారేది సినిమాలో అతను రాసిన ఇది ఆరడుగుల బుల్లెట్టు పాటకు గాను ఉత్తమ గీత రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. శ్రీమణి 2021లో హైదరాబాద్ లో జరిగిన 'సైమా' అవార్డుల ప్రధానోత్సవంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి చిత్రంలో 'ఇదే కదా..' పాటకు ఉత్తమ గీత రచయితగా సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అందుకున్నాడు.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శ్రీమణి అసలు పేరు పాగోలు గిరీష్. అతనికి శ్రీ అనే పదం ఇష్టం కావడంతో తల్లిపేరులోని మణితో కలిసి శ్రీమణి అని పేరు మార్చుకున్నాడు. శ్రీమణి పుట్టింది విజయవాడ అయినా అతని స్వస్థలం ప్రకాశం జిల్లా, చీరాల. తండ్రి పాగోలు వెంకటాచలం అతనికి ఎనిమిదేళ్ళ వయసులో చనిపోయాడు. తల్లి నాగమణి అతనికి పన్నెండేళ్ళ వయసులో మరణించింది. దాంతో శ్రీమణి, అతని తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఎనిమిదో తరగతి దాకా చీరాలలోనే చదువుకున్నాడు. తొమ్మిది, పదో తరగతులు నందిగామ లోని పిన్నివాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం అమ్మమ్మ దగ్గరికి వచ్చేశాడు. తొమ్మిదో తగరతి చదివేటప్పటి నుంచి కవిత్వం, రచనలపై మక్కువ పెంచుకున్నాడు. తానే స్వంతంగా సందర్భాలు సృష్టించుకుని పాటలు రాసుకునే వాడు. ఇవి విన్నవారు ఇది ఏ సినిమాలోది అని అడిగేవారు. దాంతో అతనికి సినిమాల్లో పాటల రచయితా ప్రయత్నం చేస్తే బాగుండుననిపించింది. డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి కాగానే, తాను రాసిన పాటల పుస్తకం తీసుకునని గేయరచయితగా అవకాశాల కోసం హైదరాబాదుకు వచ్చాడు. పాటల రచయితగా ప్రయత్నాలు చేస్తూనే హైదరాబాదులోని వనస్థలిపురంలో 2006 జూన్ నుంచి డిసెంబరు దాకా క్రాంతి ట్రాన్స్ పోర్టు కంపెనీలో గుమాస్తాగా పార్ట్ టైమ్ ఉద్యోగం చేశాడు.

తరువాత సురేష్ అనే ఒక స్నేహితుడి సలహాతో ఫిల్మ్ నగర్ కు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో 2007 లో యూసఫ్ గూడా కి మారాడు. అక్కడ కొద్ది రోజులు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ముహూర్తం అనే సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది. కానీ టైటిల్స్ లో అతని పేరు లేదు. కొంతకాలం ఘోస్టు రైటరుగా పని చేశాడు. ఇలాగైతే గుర్తింపు రాదనే ఉద్దేశ్యంతో బాబాయి సలహాతో అపోలో ఆస్పత్రిలో బీ పాజిటివ్ అనే మ్యాగజీన్ కి మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ గా చేరాడు. అక్కడ ఆగస్టు 2008 నుంచి 2010, ఆగస్టు వరకు పనిచేశాడు. ఆ మ్యాగజీన్ కు రాం చరణ్ భార్యయైన ఉపాసన కామినేని ప్రచురణ కర్త.

సినీ ప్రయాణం

[మార్చు]

కాశీ అనే సహాయ దర్శకుడి సహాయంతో దర్శకుడు సుకుమార్ పరిచయం కలిగింది. అలా అతనికి తన సినిమా 100% లవ్ సినిమాలో గీత రచయితగా అహో బాలు, దటీజ్ మహాలక్ష్మి, ఏ స్క్వేర్ బీ స్క్వేర్ మూడు పాటలు రాసే అవకాశం దక్కింది. తరువాత సెగ, జులాయి, బాడీగార్డ్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు.[3] 100% లవ్ సినిమాలో అతను రాసిన పాటలకు, సెగ సినిమాలో దేవీ శ్రీప్రసాద్ స్వరపరిచిన వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ అనే పాటలకు మంచి ప్రశంసలు లభించాయి. తాను ప్రత్యేకంగా పాటలు రాసుకోవడానికి కూర్చోననీ తను నడుస్తున్నపుడో, ఇతరులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడో అకస్మాత్తుగా మనసులోకి వస్తే తన ఫోనులో రికార్డు చేస్తుంటాననీ సినీ గోయెర్ కి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.[4]

సినిమాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత

  1. 2019: "ఇదే కదా" (మహర్షి)

మూలాలు

[మార్చు]
  1. మ్యూజికాలజిస్ట్, రాజా. "బుల్లెట్ కమ్ రాకెట్ .... శ్రీమణి". gotelugu.com. గోతెలుగు. Retrieved 11 November 2016.
  2. TV9 Telugu (19 September 2021). "SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట." Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Climbing up solo". The Hindu. Retrieved January 7, 2012.
  4. "Interview With Shree Mani". CineGoer.net. Archived from the original on 2016-09-13. Retrieved January 8, 2012.
  5. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.
  6. Sakshi (19 March 2021). "సినిమాని పాటలు డామినేట్‌ చేస్తున్నట్లుగా చూడొద్దు". Sakshi. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 26 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీమణి&oldid=4137191" నుండి వెలికితీశారు