ఈ వర్షం సాక్షిగా (2014 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/disambiguation' not found.]]

ఈ వర్షం సాక్షిగా
దర్శకత్వంరమణ మోగిలి
స్క్రీన్ ప్లేరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతబి ఓబుల్ సుబ్బారెడ్డి
తారాగణంవరుణ్ సందేశ్
హరిప్రియ
ఛాయాగ్రహణంమోహన్ చంద్
కూర్పునందమూరి హరి
సంగీతంఅనిల్ గోపిరెడ్డి
నిర్మాణ
సంస్థ
రాహుల్ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2014 డిసెంబరు 13 (2014-12-13)
సినిమా నిడివి
127 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ వర్షం సాక్షిగా 2014 డిసెంబర్13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమణ మొగిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేష్, హరిప్రియ, ధనరాజ్, వేణు ముఖ్యపాత్రల్లో నటించగా, అనిల్ గోపి రెడ్డి సంగీతం అందించారు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే, మోహన్ చంద్ ఛాయాగ్రహణం అందించారు. [1]

కధ[మార్చు]

జై (వరుణ్ సందేశ్) ఎప్పుడూ అమ్మాయిల చేతిలో మోసపోయే ఓ అమాయకపు కుర్రాడు. ఒకరోజు రైలు ప్రయాణంలో మహాలక్షి (హరిప్రియ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇంటికి చేరుకున్న తర్వాత మహాలక్ష్మికి తన మనసులో ప్రేమను వ్యక్తం చేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. వెంటనే మహాలక్ష్మి సొంతఊరు రాజమండ్రి కి ప్రయాణం అవుతాడు.ఆ ఊరుకివెళ్ళిన తర్వాత జైకు... మహాలక్షి మరెవరో వక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోయిందన్న చేదు నిజం తెలుస్తుంది. అప్పుడు జై.... మహాలక్షి ఎక్కడుందో తెలుసుకుని ఎం చేశాడు..? జై ప్రేమకథ ఏమైంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.[2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: రమణ మొగిలి
 • నిర్మాత : బి.ఓబుల్ సుబ్బారెడ్డి
 • రచన:ముకంద్ పాండే ,రామస్వామి
 • స్క్రీన్ ప్లే: రాజేంద్ర భరద్వాజ్
 • సంగీతం: అనిల్ గోపి రెడ్డి
 • ఛాయాగ్రహణం: మోహన్ చంద్
 • నిర్మాణ సంస్థ: రాహుల్ మూవీమేకర్స్

పాటలు[మార్చు]

ఈ సినిమాకు పాటలకు, నేపథ్య సంగీతానికీ అనిల్ గోపిరెడ్డి సారథ్యం వహించాడు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా 2014 నవంబర్ 11వ తేదీన విడుదలయ్యింది. [3]

సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."భూమ్మీద బ్యూటీ [4]"శ్రీమణి రాహుల్ సిప్లిగంజ్ , అనిల్ గోపిరెడ్డి 3:45
2."జరిగేది జరగనీ [5]"శ్రీమణిప్రణవి 3:45
3."ఓ కొంచెం కొత్తగా [6]"రామజోగయ్య శాస్త్రి దీపు 3:28
4."నీ నవ్వూ తారల్లే [7]"విజయ్ బాలాజీ అనిల్ గోపిరెడ్డి4:29
5."మనసా మనసా [8]"రామజోగయ్య శాస్త్రిహేమచంద్ర 3:38

విడుదల[మార్చు]

ఈ చిత్రం 2014, డిసెంబర్ 13న విడుదలై ప్రేక్షకులు,సినీ విమర్శకులనుండి మంచి స్పందనలను అందుకుంది.[9]

మూలాలు[మార్చు]

 1. సినిమా ప్రారంభం ,", వెబ్ దునియా 28 ఫిబ్రవరి 2013. Retrieved jun18 2020.
 2. Sakshi (9 December 2014). "డబ్బుల వర్షం కురవాలి". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
 3. ఆడియో లాంఛ్ , ", సాక్షి న్యూస్ . Retrieved jun18 2020.
 4. భూమ్మీద బ్యూటీ గీతం ,", youtube. Retrieved jun18 2020.
 5. జరిగేది జరగనీ గీతం ,", youtube. Retrieved jun18 2020.
 6. ఓ కొంచెం కొత్తగా గీతం ,", youtube. Retrieved jun18 2020.
 7. నీ నవ్వూ తారల్లే గీతం ,","youtube". Retrieved jun18 2020.
 8. మనసా మనసా గీతం ,",youtube. Retrieved jun18 2020.
 9. 123తెలుగు ఈ వర్షం సాక్షిగా మూవీ రివ్యూ ",. Retrieved jun18 2020.


ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో: * ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఈ వర్షం సాక్షిగా