రాజేంద్ర భరద్వాజ్
రాజేంద్ర భరద్వాజ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | కథా రచయిత మాటల రచయిత స్క్రీన్ రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2000 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
రాజేంద్ర భరద్వాజ్ సినీ మాటల రచయిత, కథారచయిత. ఇతని రచన ఆలోచనను రేకెత్తించే దృక్పథానికి, కుటుంబవిలువలకీ పెట్టింది పేరు. ఇతను 1999 లో శివరంజని తెలుగు సిని వారపత్రికలో పాత్రికేయ వృత్తిని ప్రారంబించి ఆతరువాత బైరవి సినిమా ద్వారా కధ, మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. కొత్తగా మా ప్రయాణం, కథనం వంటి తెలుగు సినిమాలకు, మాటలు, స్క్రీన్‌ప్లే, రచయితగా, కిలాడీ.నం.1, నాయక్ వంటి భోజ్‌పురి సినిమాలకు, కథ, స్క్రీన్‌ప్లే రచయితగా సినిమా రంగంలో పేరుపొందాడు.
మొదటి రోజులు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లోని కారుచోల గ్రామంలో రాజేంద్ర భరద్వాజ్ 'కరి రాజేంద్రగా కరి శ్రీకృష్ణ మూర్తి సీతారత్నంలకు జన్మించాడు. మద్దిరాలలోని సాదీనేని చౌదరయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యునికేషన్ లో మాస్టర్ డిగ్రీ పొందాడు. శివరంజని తెలుగు సినిమా వారపత్రికలో ఇతడు పాత్రికేయునిగా తన వృత్తిని ప్రారంభించాడు. తదనంతరం, అమెరికాకు చెందిన తెలుగు ఛానల్ స్నేహ టీవీలోనూ, సివిఆర్ ఓం ఆధ్యాత్మిక ఛానెల్‌లో సీనియర్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అన్నయ్యా రవిచంద్ర శేఖర్ ప్రోత్సాహంతో సిని రంగ ప్రవేశం చేసారు.
రచనా శైలి
[మార్చు]సామజిక అంశాలను ప్రస్తావిస్తూ స్థానిక జీవన స్థితిగతులను కథల్లో ప్రతిభావంతంగా చూపుతూ జీవన వాస్తవికత నుంచి కథా వాస్తవికతలోకి ప్రేక్షకులను తీసుకువెళ్ళి ఆలోచింప చేసే శైలి, నేర్పు,అతని ప్రతి సినిమా కథలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
సినిమాల జాబితా
[మార్చు]† | ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | చిత్రంపేరు | భాష | నటీనటులు | విభాగం | Notes | Ref. |
---|---|---|---|---|---|---|
2008 | భైరవి | తెలుగు | అభినయశ్రీ , నందు, సైరాభాను | కథ,మాటలు | [1][2] | |
2008 | ఖిలాడి నం.1 | భోజ్‌పురి | దినేష్ లాల్ యాదవ్, పాకి హెగ్డే, రామిరెడ్డి (నటుడు), మనోజ్ టైగర్ | స్క్రీన్ ప్లే, కథ | [3] | |
2009 | ఘాయల్ కిలాడీ | హిందీ | దినేష్ లాల్ యాదవ్, పాఖీ హెగ్డే, ముక్తార్ ఖాన్, మనోజ్ టైగర్, రామిరెడ్డి (నటుడు), రఘునాథ రెడ్డి | కథ, స్క్రీన్ ప్లే | [4] | |
2014 | ఈ వర్షం సాక్షిగా (2014 సినిమా) | తెలుగు | వరుణ్ సందేశ్, హరిప్రియ, చలపతి రావు,ఢిల్లీ రాజేశ్వరి, ధన్‌రాజ్ | స్క్రీన్ ప్లే | [5][6] | |
2015 | టాప్ రాంకర్స్ | తెలుగు | గద్దె రాజేంద్ర ప్రసాద్, సోనీ చరిష్ట, గిరిబాబు | రచనాసహకారం | [7] | |
2015 | నువ్వు నేను ఒకటవుదాం | తెలుగు | రంజిత్ సోమి, ఫాతిమా సనా షేక్ | కథ, మాటలు | [8][9] | |
2017 | సీతారాముల కళ్యాణం చూతము రారండి సీతా రామంక బహఘర కలిజుగారే |
తెలుగు ఒడియా |
సబ్యసాచి మిశ్రా, మనీషా చటర్జీ, సుమన్ తల్వార్, బిజయ్ మొహంతి, పాప్పు పోమ్ పోమ్, చలాకి చంటి | మాటలు | ద్విభాషా చిత్రం | [10][11][12] |
2019 | కసమ్ దుర్గా కి | భోజపురి | రాణి చటర్జీ, మనోజ్ ఆర్ పాండే, గుర్లిన్ చోప్రా | కథ, స్క్రీన్ ప్లే | [13][14] | |
2019 | నాయక్ | భోజపురి | ప్రదీప్ పాండే, పావని, ప్రభాకర్, సంజయ్ మహానంద్ | కథ, స్క్రీన్ ప్లే | [15] | |
2019 | కొత్తగా మా ప్రయాణం | తెలుగు | ప్రియాంత్, యామిని భాస్కర్, గిరిధర్, భాను | స్క్రీన్ ప్లే, మాటలు | [17] | |
2019 | కథనం (2019 సినిమా) | తెలుగు | అనసూయ భరధ్వాజ్, వెన్నెల కిషోర్ , అవసరాల శ్రీనివాస్, ధనరాజ్ | స్క్రీన్ ప్లే, మాటలు | [19][20] | |
2020 | ఆనంద భైరవి† | తెలుగు | అంజలి, లక్ష్మీ రాయ్, అరుణ్ ఆదిత్య ,మురళి శర్మ , సాయికుమార్ | రచనాసహకారం | TBA | [21][22] |
2021 | ధర్మస్థలి | తెలుగు | షకలక శంకర్, పావని, సాయాజీ షిండే, ముక్తార్ ఖాన్, మిర్చి హేమంత్ | కథ , మాటలు, స్క్రీన్ ప్లే |
మూలాలు
[మార్చు]- ↑ Bhairavi' Audio Next Week,",indiaglitz, June 16, 2008. Retrieved 2020 జూలై 14.
- ↑ భైరవి ట్రైలర్ లాంచ్",వెబ్ దునియా. Retrieved 2020 జూలై 14.
- ↑ Bhairavi' Audio Next Week",indiaglitz, June 16, 2008. Retrieved 2020 జూలై 14.
- ↑ ఘాయల్ కిలాడీ ప్రొడక్షన్ క్రెడిట్స్","moviebuff, 17 Nov 2009. Retrieved 2020 జూలై 14.
- ↑ వర్షం సాక్షిగా ప్రొడక్షన్ క్రెడిట్స్","indiaglitz,March 25, 2013. Retrieved 2020 జూలై 14.
- ↑ ఈ వర్షం సాక్షిగా సమీక్ష","Cinejosh,Sep 16,2019.Retrieved 2020 జూలై 14.
- ↑ రాజేంద్రప్రసాద్ హీరోగా ‘టాప్ ర్యాంకర్స్"," Andhrabhoomi ,March 25, 2013. Retrieved 2020 జూలై 14.
- ↑ మరో అల్లరి ప్రేమకథ"," సాక్షి, Dec 29, 2013. Retrieved 2020 జూలై 14.
- ↑ Production Credits,","Moviebuff,20 Feb 2015.Retrieved 2020 జూలై 14.
- ↑ రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం2 ప్రారంభం,","Webdunia, 22 ఏప్రియల్ 2016. Retrieved 2020 జూలై 14.
- ↑ Production Credits ,","Ragalahari, Retrieved 2020 జూలై 14.
- ↑ film release note ,","Timesofindia,Oct 25, 2017. Retrieved 2020 జూలై 14.
- ↑ కసమ్ దుర్గా కి ప్రొడక్షన్ క్రెడిట్స్"," ఇండియన్ ఫిలిం హిస్టరీ. Retrieved 2020 జూలై 22.
- ↑ Rani Chatterjee shares the poster"," Timesofindia, Sep 16, 2019. Retrieved 2020 జూలై 14.
- ↑ ప్రొడక్షన్ క్రెడిట్స్"," Bookmyshow, Retrieved 2020 జూలై 14.
- ↑ Pradeep Pandey Chintu starrer Nayak gets a release date,","Zeenews, May 25, 2019.Retrieved 2020 జూలై 14.
- ↑ కొత్తగా మా ప్రయాణం ప్రొడక్షన్ క్రెడిట్స్","Bookmyshow, Retrieved 2020 జూలై 14.
- ↑ కొత్తగా మా ప్రయాణం","Timesofindia, Nov 26, 2018.Retrieved 2020 జూలై 14.
- ↑ కథనం ప్రొడక్షన్ క్రెడిట్స్"," Bookmyshow, Retrieved 2020 జూలై 14.
- ↑ Kathanam Movie Review,"," Timesofindia, Aug 9, 2019. Retrieved 2020 జూలై 14.
- ↑ యథార్థ పాత్రల ప్రేరణతో ఆనందభైరవి" Archived 2020-06-26 at the Wayback Machine,"Tv9telugu, January 30, 2020.Retrieved 2020 జూలై 14.
- ↑ Anjali and Laxmi Raai to entertain as Anandabhairavi","TheHansindia,15 Jun 2019.Retrieved 2020 జూలై 14.