కథనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉన్నదున్నట్లు చెప్పటం ప్రత్యక్ష కథనం. వేరేవాళ్లు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కథనం. అవి రెండూ అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరికి "అని" అనేదాన్ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు.

ఇతరులు చెప్పిన దాన్ని, లేక తాను చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుకరించి చెప్పడం ప్రత్యక్షానుకృతి. ఉదా: నేను నీతో "నేను రాను" అని చెప్పాను

అనుకరించిన దానిలోని విషయాన్ని లేదా అభిప్రాయాన్ని మాత్రమే అనుకరించడం పరోక్షానుకృతి. ఉదా: నేను నీతో రానని చెప్పాను.

ఉదాహరణలు

[మార్చు]
ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం
నేను నీతో "నేను పాఠశాలకు వెళ్తున్నాను" అని చెప్పాను. నేను నీతో పాఠశాలకు వెళ్తున్నానని చెప్పాను.
నువ్వు అతనితో "నువ్వు తొందరగా రా" అన్నావు. నువ్వు అతనితో అతనిని తొందరగా రమ్మని అన్నావు.
అమ్మ మీతో "బాగా చదువుకోండి" అని చెప్పినది. అమ్మ మీతో బాగా చదువుకొమ్మని చెప్పినది.
స్థానం నరసింహారావు "నా నాటక అనుభవాలన్నీ వివరిస్తాను" అని అన్నాడు. స్థానం నరసింహారావు తన నాటక అనుభవాలన్నీ వివరిస్తానని అన్నాడు.
"https://te.wikipedia.org/w/index.php?title=కథనం&oldid=3376818" నుండి వెలికితీశారు