రామిరెడ్డి (నటుడు)
రామిరెడ్డి | |
---|---|
![]() రామిరెడ్డి | |
జననం | గంగసాని రామిరెడ్డి ఓబుళంవారిపల్లె, చిత్తూరు జిల్లా |
వృత్తి | నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1990 - 2011 |
గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాల, భోజ్‌పురి భాషలలో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాలలో నటించాడు.
వ్యక్తిగత జీవితము[మార్చు]
రామిరెడ్డి చిత్తూరు జిల్లా, వాయల్పాడులో జన్మించాడు. నటుడు కాక మునుపు పత్రికా విలేఖరిగా పనిచేశాడు.[1] కొంతకాలం మూత్రపిండాల సంబంధ వ్యాధి కారణంగా మృత్యువు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు.[2][3] కానీ అదే వ్యాధితో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 14, 2011 న మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.
కేసు[మార్చు]
జనవరి 19, 2007 శనివారం రాత్రి 11:45 సమయంలో మెహదీపట్నంలోని రైతు బజార్ సమీపంలో పోలీసులు ఆయనను మద్యంతాగి వాహనం నడుపుతున్నందుకు అరెస్టు చేశారు. ఆ సమయంలో రామిరెడ్డి నగర శివార్లలో ఓ కార్యక్రమానికి హాజరై శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఇంటికి వస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. మరుసటి రోజు బెయిల్ పై విడుదల చేశారు.[4]
సినిమాలు[మార్చు]
అంకుశం, ఒసేయ్ రాములమ్మా, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాలు.
పేరుపడ్డ సంభాషణలు[మార్చు]
- స్పాట్ పెడతా
మూలాలు[మార్చు]
- ↑ "Actor Rami Reddy passes away". thehindu.com. Kasturi and Sons. Retrieved 12 September 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ http://andhrafriends.com/index.php?topic=114437.0
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-11-07. Retrieved 2010-11-04.
- ↑ Staff, Reporter. "Actor Rami Reddy held for drunken driving". thehindu.com. Kasturi and Sons. Retrieved 12 September 2016. CS1 maint: discouraged parameter (link)