అనగనగా ఒక రోజు
అనగనగా ఒక రోజు | |
---|---|
![]() | |
దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
కథా రచయిత | రామ్ గోపాల్ వర్మ నడిమింటి నర్శింగ రావు |
నిర్మాత | రామ్ గోపాల్ వర్మ కె. ఎల్. ఎన్. రాజు |
తారాగణం | జె. డి. చక్రవర్తి, ఊర్మిళ రఘువరన్ బ్రహ్మానందం కోట శ్రీనివాస రావు |
ఛాయాగ్రహణం | వాసు |
కూర్పు | భానోదయ |
సంగీతం | శ్రీ కొమ్మినేని |
పంపిణీదారు | వర్మ క్రియేషన్స్ |
విడుదల తేదీ | జనవరి 1996 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనగనగా ఒక రోజు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా.[1] ఈ సినిమాలో నటనకు గాను బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.
కథ[మార్చు]
చక్రి (జె. డి. చక్రవర్తి), మధు (ఊర్మిళ) పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు.
మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. మధ్యలో ఒక కారు ఆపి ఎక్కుతారు. కారు డ్రైవరు మధ్యలోనే చనిపోతాడు. వీళ్ళు హత్య కేసులో ఇరుక్కుంటారు. ఓ పక్క పోలీసులు, ఓ పక్క రౌడీలు వీరిని తరుముకుంటూ వస్తుంటారు. వీటన్నింటినీ అధిగమించి చివరకు ఎలా బయటపడతారన్నదే మిగతా కథ.
తారాగణం[మార్చు]
- చక్రి గా జె. డి. చక్రవర్తి
- మధు గా ఊర్మిళ
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- రఘువరన్
- రామిరెడ్డి
- వై. విజయ
- చలపతి రావు
- నర్సింగ్ యాదవ్
- ఆహుతి ప్రసాద్
- సుత్తివేలు
- కళ్ళు చిదంబరం
- ఉత్తేజ్
- జెన్నీ
నటన[మార్చు]
ఈ సినిమాలో బ్రహ్మానందం మైఖేల్ జాక్సన్ అనే దొంగగా నటించాడు. పోలీసులను తప్పించుకోవడానికి అతను చేసే ప్రయత్నాలు మంచి హాస్యాన్ని సృష్టించింది. ఈ సినిమాలో నటనకు బ్రహ్మానందంకు ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం లభించింది.
మూలాలు[మార్చు]
- ↑ "అనగనగా ఒక రోజు సినిమా సమీక్ష". thecinebay.com. Retrieved 28 September 2017.