రఘువరన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రఘువరన్
RaghuSir.JPG
జననం డిసెంబర్ 11, 1948
Kollengode, కేరళ
మరణం 19 మార్చి 2008(2008-03-19) (వయసు 49)
చెన్నై, తమిళనాడు
వృత్తి సినిమా నటుడు
ఎత్తు 6 ft 3 in (191 cm)
జీవిత భాగస్వామి రోహిణి (విడాకులు)
పిల్లలు రిషివరన్
తల్లిదండ్రులు వేలాయుధన్, కస్తూరి.

రఘువరన్ (డిసెంబర్ 11, 1948 - మార్చి 19, 2008) దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. ప్రతినాయక పాత్రలు పోషించి మెప్పించాడు. దాదాపు 150 సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ చిత్రాలున్నాయి.

జననం[మార్చు]

రఘువరన్ కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లాకు చెందిన కోలెంగూడె అనే ప్రాంతమునందు జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు వేలాయుధన్ మరియు కస్తూరి.

తెలుగు నటి రోహిణితో ఆయనకు వివాహం జరిగింది. వారికి సాయి రిషివరన్ అనే కొడుకు ఉన్నాడు. అయితే వారు తరువాత విడాకులు తీసుకున్నారు.

మరణం[మార్చు]

చిత్రరంగంలో బాగా విజయవంతమైనా ఆయన మాదకద్రవ్యాలకు, మద్యానికి బానిస కావడంతో జీవితం ఒడిదుడుకులకు గురైంది. రఘువరన్ మార్చి 19, 2008చెన్నైలో గాఢ నిద్రలో ఉండగానే గుండెపోటుతో మరణించాడు. దీర్ఘకాలం మద్యం సేవించడం వలన ఆయన కాలేయం కూడా దెబ్బతిన్నది. చనిపోవడానికి కొద్దిరోజులకు ముందు ఆయన నిద్రలో ఉండగా చనిపోయే సన్నివేశంలో నటించడం యాదృచ్ఛికంగా జరిగింది.

కెరీర్[మార్చు]

శివ, పసివాడి ప్రాణం, బాషా మొదలైన సినిమాలలో ఆయన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

నటించిన తెలుగు సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రఘువరన్&oldid=2245808" నుండి వెలికితీశారు