జేబు దొంగ (1987 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేబుదొంగ
Jebu Donga.jpg
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
రచనగొల్లపూడి మారుతీరావు (కథ)
నిర్మాతఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు
నటవర్గంచిరంజీవి, భానుప్రియ, రాధ,
ఛాయాగ్రహణంలోక్ సింగ్
కూర్పుఎం. వెల్లై స్వామి
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
రోజా మూవీస్
పంపిణీదారులుగీతా ఆర్ట్స్
విడుదల తేదీలు
1987 డిసెంబరు 25 (1987-12-25)
నిడివి
142 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

జేబుదొంగ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో విడుదలైన చిత్రం.[1] ఇందులో చిరంజీవి, భానుప్రియ, రాధ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై ఎం. అర్జునరాజు, ఎం. రామలింగరాజు నిర్మించారు. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. గొల్లపూడి మారుతీరావు ఈ చిత్రానికి కథ అందించాడు. పి. సత్యానంద్ మాటలు రాశాడు.

కథ[మార్చు]

జిమూంబా అనే విదేశీయుడు కొంతమంది భారతీయులతో కలిసి దేశ అభివృద్ధిని కుంటుపరచడానికి కొన్ని పథకాలు రచిస్తుంటాడు. దేశంలో అనేక చోట్ల ఈ ముఠా అల్లర్లకు పాల్పడుతూ ఉంటుంది. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వస్తుంది. ముఠా రహస్యాలను బయట పెట్టడం కోసం సిబిఐ ఒక ఏజెంటును నియమిస్తారు. అతను రహస్యాలను సేకరించాడని తెలుసుకున్న ముఠా అతని కుటుంబంతో సహా చంపేస్తారు.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

ఇందులో చిరంజీవి చిల్లరదొంగ, ఆఫీసరుగా ద్విపాత్రాభినయం చేశాడు. భానుప్రియ, రాధ కథానాయికలుగా నటించాడు. రఘువరన్, కన్నడ ప్రభాకర్ ప్రతినాయక పాత్రల్లో నటించారు. కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు సీబీఐ ఆఫీసర్లుగా కనిపించారు.

సంగీతం[మార్చు]

ఈ సినిమాకు కె. చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

మూలాలు[మార్చు]

  1. "Jebu Donga (1987) | Jebu Donga Movie | Jebu Donga Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-10-26.