షణ్ముఖ శ్రీనివాస్
స్వరూపం
షణ్ముఖ శ్రీనివాస్ | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1987 - 1992 |
తల్లిదండ్రులు |
|
షణ్ముఖ శ్రీనివాస్ ఒక తెలుగు సినీ నటుడు, కూచిపూడి నర్తకుడు.[1] 1987లో బాల నటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. స్వర్ణకమలం, శృతిలయలు మొదలైన సినిమాలలో ప్రాముఖ్యం ఉన్న పాత్రల్లో నటించాడు. ఈటీవీలో ప్రసారమైన అన్వేషిత అనే సీరియల్ లో కూడా నటించాడు. నాట్యరంగంలో రాణించినందుకు వెంపటి సీతారామ్మోహనరావు డ్యాన్స్ అకాడమీ పురస్కారం అందుకున్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]షణ్ముఖ శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. అతని తండ్రి శివరామకృష్ణ. ప్రస్తుతం హైదరాబాదులోని ఫిలిం నగర్ లో నివాసం ఉంటున్నాడు.
కెరీర్
[మార్చు]శ్రీనివాస్ 1987లో చిరంజీవి నటించిన జేబుదొంగ సినిమాలో బాలనటుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు. శృతిలయలు, స్వర్ణకమలం సినిమాలకు గాను ఉత్తమ బాల నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | సహనటులు | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|---|
1987 | జేబు దొంగ | చిరంజీవి | బాలనటుడు | తెలుగు | మొదటి సినిమా |
1987 | శృతిలయలు | రాజశేఖర్ | శ్రీనివాస్ | తెలుగు | నంది ఉత్తమ బాలనటుడు |
1988 | ది డిసీవర్స్ | పియర్స్ బ్రాస్నన్ | హీరాలాల్ | ఆంగ్లం | |
1988 | స్వర్ణకమలం | దగ్గుబాటి వెంకటేష్ | శ్రీనివాస్ | తెలుగు | నంది ఉత్తమ బాలనటుడు |
1988 | ముగ్గురు కొడుకులు | ఘట్టమనేని కృష్ణ | చిన్నప్పటి కృష్ణగా | తెలుగు | |
1991 | అయ్యప్పస్వామి మహత్యం | శరత్ బాబు | అయ్యప్ప | తెలుగు | |
1994 | కౌరవ సామ్రాజ్యం | చంద్రమోహన్ | బాలనటుడు | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Movie Actor Shanmukha Srinivas". nettv4u.com. Retrieved 12 September 2016.