స్వర్ణకమలం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
స్వర్ణకమలం
(1988 తెలుగు సినిమా)
Swarnakamalam.jpg
దర్శకత్వం కె.విశ్వనాధ్
తారాగణం వెంకటేష్ ,
భానుప్రియ ,
జానకి
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ భాను ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

కథ[మార్చు]

చిత్రకారుడైన యువకుడు తనపొరిగింటిలో ఉండే వృద్దబ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెలోని నాట్యకళా కౌశలం గుర్తించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం. వెంకటేశ్, భానుప్రియ లు నాయకీ నాయకులుగా దర్శకుడు కె.విశ్వనాధ్ అధ్బుతంగా మలచిన చిత్రం. ఈ చిత్ర సంగీతం వీనులవిందుగా సాగుతుంది.

మీనాక్షి (భానుప్రియ), సావిత్రి (సుమలత) కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన శేషేంద్ర శర్మ యొక్క ఇద్దరు కూతుర్లు. ఆయన నాట్యంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన వాడైనా పెద్దగా కలిగిన కుటుంబం కాకపోవడంతో తన ఇద్దరు కూతుళ్ళకూ అందరిలాగే చదువు చెప్పించలేక పోతాడు. కానీ సావిత్రికి కర్ణాటక సంగీతం లో, మీనాక్షి కి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తాడు. సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా ఎంచి దాన్నే జీవనాధారంగా భావిస్తుంటుంది. కానీ రెండవ కూతురు మీనాక్షి మాత్రం నాట్యం లాంటి కళలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటుంది. సాధారణంగా అందరూ అభిమానించే విలాసవంతమైన జీవనం గడపాలని కోరుకుంటుంది. ఇవన్నీ కేవలం ఆమె అక్కతోనే చెప్పుకుంటుంది.

ఇదిలా ఉండగా వారి ఇంటి పక్కన ఇంట్లోకి చంద్రశేఖర్ (వెంకటేష్) అనే చిత్రకాడు అద్దెకు దిగుతాడు. ఆమెలోని నాట్యాన్ని చూసి అభిమానిస్తాడు. కానీ ఆమె అయిష్టతను గమనించి బాధపడతాడు. వారి కుటుంబానికి చిన్న చిన్న పనుల్లో సహాయపడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమె చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయిస్తాడు. అయితే ఆమె అయిష్టంగా అందుకు ఒప్పుకొని నాట్యం మధ్యలో సగంలో నిలిపివేయడంతో ఆమె తండ్రి నాట్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన నాట్యం చేస్తుండగానే మరణిస్తాడు. తన తండ్రి మరణానికి తనే కారణమయ్యానని బాధ పడుతుంటుంది. ఆమెకు అమెరికా కు వెళ్ళే ఆసక్తిని గమనించిన చంద్రశేఖర్ ఆమెను కూచిపూడి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించేలా ప్రయత్నించి భారతీయ నృత్యంలో ప్రసిద్ధురాలైన ఒక అమెరికా నర్తకి సాయంతో అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తాడు. అమెరికా వెళ్ళడానికి ఎయిర్‌పోర్ట్ దాకా వెళ్ళిన ఆమె, చంద్రశేఖర్ కు తనమీద ఉన్న ప్రేమను అర్థం చేసుకుని ఇద్దరూ కలుసుకోవడంతీ కథ సుఖాంతమవుతుంది.ఈ సినిమా అద్భుత విజయం సాధించి వెంకటేష్ కు నంది బహుమతిని తెచ్చింది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

All music composed by ఇళయరాజా.

పాటలు
సంఖ్య. పాట సాహిత్యం గానం నిడివి
1. "అందెల రవమిది పదములదా"   సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి  
2. "ఆకాశంలో ఆశల హరివిల్లు:" ([1]) సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్. జానకి  
3. "ఆత్మాత్వం"        
4. "చేరి యశోదకు"   అన్నమయ్య పి. సుశీల  
5. "ఘల్లు ఘల్లు ఘల్లు" ([2][3]) సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  
6. "కొత్తగా రెక్కలొచ్చెన" ([4]) సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి  
7. "నటరాజనే"     పి. సుశీల  
8. "శివపూజకు చివురించిన" ([5]) సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల  

మూలాలు[మార్చు]