అందెల రవమిది పదములదా (పాట)
స్వరూపం
"అందెల రవమిది పదములదా" | |
---|---|
రచయిత | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంగీతం | ఇళయరాజా |
సాహిత్యం | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
ప్రచురణ | స్వర్ణకమలం (1988) |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
భాష | తెలుగు |
గాయకుడు/గాయని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం |
రికార్డు చేసినవారు (స్టుడియో) | భాను ఆర్ట్ క్రియెషన్స్ |
చిత్రంలో ప్రదర్శించినవారు | భానుప్రియ , వెంకటేశ్ |
అందెల రవమిది పదములదా అనే ఈ పాట 1988లో విడుదలైన స్వర్ణకమలం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడారు.[1]
పాట నేపథ్యం
[మార్చు]నృత్యకారిణికి తన నృత్యం విలువ తెలిపే సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాటలో నృత్యకారిణిగా భానుప్రియ, యువకుడిగా వెంకటేష్ నటించాడు.
సాహిత్యం
[మార్చు]పాట పల్లవి:
పల్లవి:
ఆమె: అందెల రవమిది పదములదా ||2||
అంబరమంటిన హృదయముదా ||అందెల||
అమృతగానమిది పెదవులదా
అమితానందపు ఎదసడిదా
అతడుశ సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా ||2||
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ||అందెల||
పురస్కారాలు
[మార్చు]- సిరివెన్నెల సీతారామశాస్త్రి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం - 1988.
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (30 April 2017). "అందెల రవమిది..." Archived from the original on 13 August 2017. Retrieved 22 December 2020.
ఇతర లంకెలు
[మార్చు]- భావలహరి వెబ్ సైట్ Archived 2016-03-05 at the Wayback Machine
- లో పాట వీడియో