లంకేశ్వరుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంకేశ్వరుడు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం చిరంజీవి ,
రాధ,
నాజర్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ విజయమాధవీ కంబైన్స్
భాష తెలుగు

లంకేశ్వరుడు 1989 లో వచ్చిన తెలుగు సామాజిక సమస్యా చిత్రం, దాసరి నారాయణరావు రచన దర్శకత్వం చేసిన ఈ సినిమాలో చిరంజీవి, రాధ, రేవతి, కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు, రఘువరన్ నటించారు. విజయ మాధవీ కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు [1]

కథ[మార్చు]

శంకర్ ( చిరంజీవి ), రేవతి తోబుట్టువులు, అనాథలు. ఆకలితో ఉన్న సోదరిని పోషించడానికి, శంకర్ సమీపంలోని టీ స్టాల్ నుండి రొట్టె దొంగిలిస్తాడు, అదే సమయంలో, మరొక అనాథ (కళ్యాణ్ చక్రవర్తి) కుర్రాడు కూడా అక్కడ ఉంటాడు. అతను కూడా ఆకలితో ఉంటాడు. శంకర్ అతనికీ రొట్టె ముక్క ఇస్తాడు. తన చెల్లెలిని, ఆ అనాథనూ పెంచే బాధ్యతను శంకర్ తీసుకుంటాడు. శంకర్ వారికి ఆహారం సంపాదించడం కోసం తనకు సాధ్యమయ్యే ప్రతిపనీ చేస్తాడు. నెమ్మదిగా అతను ఒక చిన్న దొంగ నుండి చిన్నపాటి ముఠా నాయకుడిగా మారుతాడు. ఈ సమయంలో, అతను సమీపంలోని ఒక గ్రామానికి సహాయం చేస్తాడు. ఆ గ్రామస్థులు అతన్ని దేవుడిలా చూస్తాడు. ఒకసారి అతను దాదా ( కైకాల సత్యనారాయణ ) మనుషులను కొడతాడు. అది నచ్చిన దాదా తన దగ్గర పనిచెయ్యమని అడుగుతాడు. అందుకు శంకర్ తిరస్కరిస్తాడు. దాదా అతనికి భాగస్వామ్యాన్ని ఇస్తానని అన్నప్పుడు, అతను అంగీకరిస్తాడు. నేరం కాకుండా, శంకర్ మంచి డాన్సర్ కూడా. అతను డ్యాన్స్ నేర్పిస్తాడు కూడా; రాధ అతడికి పెద్ద అభిమాని. ఆమె అతనితో ప్రేమలో పడుతుంది.

రేవతి కళ్యాణ్ చక్రవర్తిని ప్రేమిస్తోందని శంకర్ తెలుసుకుంటాడు. అతను వారికి పెళ్ళి చేస్తాడు. కళ్యాణ్ చక్రవర్తి శంకర్ సహాయంతో పోలీసు అధికారి అవుతాడు. ఒక నేరంలో అతనికి దాదా ప్రమేయం గురించి కొంత సమాచారం వస్తుంది. అదే క్రైమ్ సిండికేట్‌లో శంకర్ భాగస్వామి అని తెలియని కళ్యాణ్, దాదా ముఠాను తొలగించడంలో శంకర్ సహాయం అడుగుతాడు. అప్పుడు శంకర్, దాదాను విడిచిపెట్టాలని నిర్ణయించుకుని దాదాకు చెబుతాడు. దాదా ఈ ప్రతిపాదనను అంగీకరిస్తాడు. కాని అతడి బావ తన చేతిలో చనిపోతే తాను బాధ్యత వహించనని చెబుతాడు. కాబట్టి దాదాను విడిచిపెట్టాలనే ఆలోచనను శంకర్ వదులుకుంటాడు. దాదా అతన్ని సిండికేట్ అధిపతిగా చేస్తాడు. రఘువరన్, మోహన్ బాబు లకు అది నచ్చదు. కాబట్టి వారు శంకర్, దాదాలను లేపెయ్యడానికి మరొక ముఠాను మాట్లాడుతారు. ఇంతలో, శంకర్ నేరస్థుడని కళ్యాణ్ చక్రవర్తి, రేవతి లకు తెలుస్తుంది. వారు అతనిని ప్రశ్నించగా, ఏ పరిస్థితుల్లో తాను అలా మారడో అతడు వారికి చెబుతాడు. కానీ వారు అతనిని విడిచిపెడతారు. మోహన్ బాబు, రఘువరన్ లు తమ కొత్త ముఠాతో కలిసి దాదాపైనా గ్రామస్తులపైనా దాడి చేసి దాదాను చంపేస్తారు. కోపంతో శంకర్, గూండాలందరినీ చంపి తన బావకు లొంగిపోతాడు.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."జివ్వుమని కొండగాలి , రచన:దాసరి నారాయణరావు"మనో, ఎస్. జానకి4:34
2."కన్నెపిల్ల వేడికి"మనో, ఎస్. జానకి4:41
3."పదహారేళ్ళ వయసు"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి5:56
4."పోతే పోనీ లేరా"మనో5:46
5."హేయ్ పాపా హేయ్ హేయ్ పాపా"మనో, ఎస్. జానకి3:59
Total length:24:57

మూలాలు[మార్చు]

  1. "Lankeswarudu". Archived from the original on 2017-10-20. Retrieved 2020-08-11.