Jump to content

రక్షకుడు

వికీపీడియా నుండి
రక్షకుడు
దర్శకత్వంప్రవీణ్ గాంధీ
స్క్రీన్ ప్లేప్రవీణ్ గాంధీ
కథకె. టి. కుంజుమోన్
నిర్మాతకె. టి. కుంజుమోన్
ఫ్రాన్సిస్ జోసెఫ్
తారాగణంఅక్కినేని నాగార్జున
సుస్మితా సేన్
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పుబి. లెనిన్
వి. టి. విజయన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
కుంజుమోన్ స్టూడియోస్
పంపిణీదార్లుజెంటిల్మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
జె. ఆర్. ఎస్. కంబైన్స్
విడుదల తేదీ
30 అక్టోబరు 1997 (1997-10-30)
సినిమా నిడివి
154 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
బడ్జెట్18 crore (equivalent to 78 crore or US$9.8 million in 2020)

రక్షకుడు 1997 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం. నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని కె. టి. కుంజుమోన్ నిర్మించగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా అతనికిది తొలి సినిమా. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.

అజయ్ ఒక నిరుద్యోగి. తన కోపం వల్ల ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కుంటూ ఉంటాడు. తన కళ్ళ ముందు ఎవరు నేరానికి పాల్పడినా సహించలేని వ్యక్తిత్వం అతనిది. వాళ్ళను చెడామడా వాయించి ఉచిత సలహాలు ఇస్తుంటాడు.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

1996 జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. కానీ నిర్మాణం ఆలస్యం అయ్యి 1997 జనవరికి ప్రారంభించబడింది. సంగీత దర్శకుడిగా అప్పటికే మంచి పేరున్న ఎ. ఆర్. రెహమాన్, మిస్ యూనివర్స్ అందాల పోటీ విజేత అయిన సుస్మితా సేన్, తెలుగు స్టార్ కథానాయకుడైన నాగార్జున లాంటి వారు ఈ ప్రాజెక్టులో ఉన్న నిర్మాత కుంజుమోన్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ప్రవీణ్ గాంధీకి ఆ బాధ్యతలు అప్పగించాడు. అందుకు కారణం అతని నైపుణ్యం, కష్టపడే తత్వం అని తెలియజేశాడు.[1]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించగా పాటలన్నీ భువనచంద్ర రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, ఉదిత్ నారాయణ్, అనుపమ, హరిహరన్, హరిణి పాటలు పాడారు.[2]

  1. సోనియా సోనియా
  2. చందురుని తాకినది
  3. ప్రేమే నా గమ్యమన్నా
  4. నిన్నే నిన్నే వలచినది
  5. మెర్క్యురి పూలు మాడర్న్
  6. కలవా కన్నె కలవా శిలవా
  7. బాంబే మడ్రాస్ డెల్లి
  8. లక్కి లక్కి లక్కి లక్కి

మూలాలు

[మార్చు]
  1. "Rediff On The Net, Movies: Will Rakshakan resurrect Sushmita's career?". Rediff. 1997-08-02. Retrieved 2012-11-12.
  2. "రక్షకుడు పాటలు". Archived from the original on 2011-01-05. Retrieved 2010-05-25.
"https://te.wikipedia.org/w/index.php?title=రక్షకుడు&oldid=4233019" నుండి వెలికితీశారు