వినోదిని (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోదిని
జననం
లక్ష్మి కె. ఆర్.
ఇతర పేర్లుశ్వేత, బేబీ లక్ష్మి, మింటా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1982 – ప్రస్తుతం

వినోదిని భారతీయ నటి. ఆమె తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు తమిళ టెలివిజన్ ధారావాహికలలో కూడా నటిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆమె కన్నడ చిత్రాలలో శ్వేతగా గుర్తింపు పొందింది.[1]

కెరీర్[మార్చు]

వినోదిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది,[1] తమిళ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించడానికి ముందు ఆమె మనల్ కయిరు, పుతియా సగప్తం, మన్నుక్కుల్ వైరం వంటి చిత్రాలలో సహాయపాత్రలలో నటించింది. 1992లో, ఆమె బాలు మహేంద్ర దర్శకత్వంలో వన్న వన్న పౌక్కల్‌లో నటించింది. ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమైంది. తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2]

అదే సంవత్సరం, ఆమె సూర్య మానసంతో మలయాళ సినిమా, చైత్రద ప్రేమాంజలితో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది, అయితే అక్కడ ఆమె శ్వేతగా వచ్చింది.[3][4] ఈ రెండు సినిమాలూ విజయాలు సాధించాయి. బాలు మహేంద్ర మరుపదియుమ్, విసు పట్టుకోట్టై పెరియప్ప, రామ నారాయణన్ వంగ భాగస్వామి వంగా, రెండు కె. ఎస్. రవికుమార్ చిత్రాలైన సూర్యన్ చందిరన్, ముత్తుకులిక వారియలతో సహా పలు తమిళ చిత్రాలలో నటించింది.

1990ల మధ్య నాటికి, ఆమె ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించినా చివరిలో తమిళ చిత్రాలలో ఆమె చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్, అతిథి పాత్రలకే పరిమితమైంది. ఆమె చిత్రాలలో ప్రవీణ్ గాంధీ యాక్షన్ చిత్రం రచ్చగన్, సుందర్.సి కామెడీ చిత్రం ఉనక్కగా ఎల్లం ఉనక్కగా, ఎన్. మాతృభూతం పుతిర పునీతమా ఉన్నాయి.

ఆ తరువాత వినోదిని టెలివిజన్ ధారావాహికలలో నటించడం ప్రారంభించింది, అవి డ్రామా సిరీస్ చితి, అగల్ విలక్, కన్నడి కథవుగల్, క్రేజీ మోహన్ హాస్య ధారావాహిక విడత సిరిప్పు. అంతేకాకుండా, ఆమె ఎనిమిదేళ్లపాటు టెలివిజన్ షోను నిర్వహించింది.[5][6]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Film Role Language Notes
1982 మనల్ కయీరు తమిళం బేబీ లక్ష్మిగా
1985 పుతియా సగప్తం తమిళం
1986 మన్నుక్కుల్ వైరం తమిళం బేబీ లక్ష్మిగా
1987 నాయకన్ తమిళం బేబీ లక్ష్మిగా / నాయకుడు గా తెలుగులో
1991 చితిరై పూక్కల్ తమిళం
1991 ఆత అన్ కోయిలీలే తమిళం
1991 ఎన్ ఆసై రసతి తమిళం
1992 వన్నా వన్నా పూక్కల్ తమిళం
1992 అభిరామి తమిళం
1992 అన్నై వాయల్ తమిళం
1992 కిజక్కు వీధి తమిళం
1992 సూర్య మానసం మలయాళం
1992 చెవాలియర్ మైఖేల్ మలయాళం
1992 చైత్రదా ప్రేమాంజలి కన్నడ
1993 మరుపడియుం తమిళం
1993 సూర్యన్ చంద్రన్ తమిళం
1993 ఆత్మ తమిళం రత్నగిరి అమ్మోరు గా తెలుగులో
1993 గెజ్జె నాడ కన్నడ
1993 పొన్ను చామీ మలయాళం
1994 వంగ భాగస్వామి వంగా తమిళం
1994 ఎన్ రాజాంగం తమిళం
1994 చిన్న మేడమ్ తమిళం
1994 పట్టుకోట్టై పెరియప్ప తమిళం
1994 జన్ కోడీశ్వరన్ మలయాళం
1995 కల్యాణం తమిళం
1995 ఇళవరసి తమిళం స్పెషల్ అప్పీయరెన్స్
1995 ముత్తుకులిక వారియాల తమిళం
1995 తొండన్ తమిళం
1996 వీట్టుకుల్లె తిరువిళ తమిళం
1996 అజకియ రావణన్ మలయాళం
1996 హెత్తవారు కన్నడ
1996 కర్పూరద గొంబే కన్నడ
1996 మినుగు తారే కన్నడ
1996 ముద్దిన అలియా కన్నడ
1997 నోడు బా నమ్మూరా కన్నడ
1997 బడుకు జటకా బండి కన్నడ
1997 లక్ష్మీ మహాలక్ష్మి కన్నడ
1997 రచ్చగన్ తమిళం రక్షకుడు గా తెలుగులో
1997 తాడయం తమిళం
1998 అగ్ని సాక్షి కన్నడ
1999 ఉనక్కగా ఎల్లం ఉనక్కగా తమిళం
2000 పుతిర పునీతమ తమిళం
2001 కోటిగొబ్బా కన్నడ
2001 నమ్మ సంసారం ఆనంద సాగర కన్నడ
2004 కుటుంబ కన్నడ
2005 కస్తూరి మాన్ తమిళం
2008 పిరివోం సంతిప్పోం తమిళం
2011 సాధురంగం తమిళం
2017 కొంజాం కొంజాం తమిళం
2021 కాల్స్ తమిళం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Comic interlude". The Hindu. 17 April 2004. Archived from the original on 7 November 2004.
  2. "Young and mature at once". The Hindu. 15 February 2002. Archived from the original on 25 March 2002.
  3. "Raghuveer passes away!". Sify. Archived from the original on 28 July 2021.
  4. "Chaitrada Premanjali actor Raghuveer no more". The Times of India.
  5. "Kannaadi Kadhavugal". The Hindu.
  6. "Crazy robot". The Hindu. 28 March 2004. Archived from the original on 16 October 2014.