కిల్లర్
కిల్లర్ | |
---|---|
దర్శకత్వం | ఫాజిల్ |
రచన | జంధ్యాల (మాటలు), ఫాజిల్ (కథ, చిత్రానువాదం) |
నిర్మాత | వి. బి. రాజేంద్ర ప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, నగ్మా, శారద, సుత్తివేలు, రఘువరన్ |
ఛాయాగ్రహణం | ఆనంద కుట్టన్ |
కూర్పు | టి. ఆర్. శేఖర్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1991 |
భాష | తెలుగు |
కిల్లర్ 1991 లో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, శారద ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.
కథ
[మార్చు]ఉపోద్ఘాతం
[మార్చు]ఒక గర్భవతియైన మహిళను కొంతమంది రౌడీలు తరుముతూ వస్తుంటారు. మేరీ అనే నర్సు ఆమెకు బిడ్డను కనడంలో సహాయం చేస్తుంది. ఆ బిడ్డపేరు ఈశ్వర్. రౌడీలు ఈశ్వర్ తల్లిని కనుగొనేసరికి మేరీ ఈశ్వర్ ని తీసుకుని పారిపోతుంది. ఆ రౌడీలు ఈశ్వర్ తల్లిని చంపేస్తారు. మేరీ ఆ బిడ్డను తనతో తీసుకెళ్ళి తనకు అంతకు ముందే ఇరువురు సంతానం ఉన్నా అతని బాధ్యతను తలకెత్తుకుంటుంది. ఆమెకు తర్వాత నాన్సీ అనే ఆడపిల్ల పుడుతుంది. కొద్ది రోజులకు ఈశ్వర్ కి మేరీ తన సొంత తల్లి కాదని తెలుస్తుంది. మేరీ కూడా ఆర్థిక సమస్యల వల్ల అతని ఒక అనాథాశ్రమంలో చేరుస్తుంది. ఆ అనాథాశ్రమంలో అనేక కష్టాలు పడి మొరటివాడుగా తయారవుతాడు.
అసలు కథ
[మార్చు]డబ్బు కోసం ఈశ్వర్ ఒక కిరాయి రౌడీగా మారతాడు. భూపతి అనే వ్యక్తి తన కొడుకు బెనర్జీ ద్వారా ఈశ్వర్ ని పిలిపించి పదిహేను రోజుల్లోగా మాళవిక ఒక మహిళ, చిన్న పాపను చంపేలా ఐదు లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. కానీ అతని మొదటి ప్రయత్నమే బెడిసి కొడుతుంది. దాంతో భూపతి అతను ఎంచుకున్న పని ఎంత కష్టమైనదో వివరించి కావాలంటే అడ్వాన్సు తిరిగిచ్చేసి తన ప్రయత్నం విరమించుకోమంటాడు. కానీ ఈశ్వర్ ఆ పని ఇంకా చాలెంజిగా తీసుకుంటాడు.
తారాగణం
[మార్చు]- ఈశ్వర్ గా నాగార్జున
- ప్రియ గా నగ్మా
- మాళవిక గా శారద
- బేబి షామిలి[1]
- భూపతి గా విజయ కుమార్
- అల్లు రామలింగయ్య
- సుబ్బలక్ష్మి గా నిర్మలమ్మ
- నాన్సీ గా తులసి
- అన్నపూర్ణ
- రమాప్రభ
- చిట్టిబాబు
- కాదంబరి కిరణ్
- చిడతల అప్పారావు
- బ్రహ్మానందం గా బ్రహ్మానందం
- బెనర్జీ బెనర్జీ
- సుత్తివేలు
- శ్రీధర్ సూరపనేని
- నర్సింగ్ యాదవ్
- హుస్సేన్
- దినేష్
పాటలు
[మార్చు]ఇందులో పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రాశాడు. ఇళయరాజా సంగీతాన్నందించాడు.[2]
- ప్రియా ప్రియతమా రాగాలు (గానం: మనో, చిత్ర)
- ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర)
- పిలిచే కుహూ కుహూ వయసే (గానం: ఎస్. జానకి)
- సింధూర పూదోటలో (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
- ఓరబ్బీ ఏం దెబ్బ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, కృష్ణ)
- రంభలకి రంజుమొగుడుని (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
- ↑ "యూట్యూబు లో కిల్లర్ సినిమా పాటల జూక్ బాక్స్". youtube.com. ఆదిత్య మ్యూజిక్. Retrieved 26 October 2017.