Jump to content

శివాజీ (2007 సినిమా)

వికీపీడియా నుండి
శివాజీ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.శంకర్
నిర్మాణం ఏ.వి.ఎం.
కథ ఎస్.శంకర్
చిత్రానువాదం ఎస్.శంకర్
తారాగణం రజనీకాంత్, శ్రియా సరన్, సుమన్, రఘువరన్, వివేక్, మణివణ్ణన్
సంగీతం ఏ.ఆర్.రెహమాన్
నృత్యాలు ప్రభుదేవా, రాజు సుందరం, లారెన్స్, బృంద
సంభాషణలు శ్రీరామకృష్ణ
ఛాయాగ్రహణం కె.వి.ఆనంద్
కళ తోట తరణి
కూర్పు ఆంథోనీ
నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం.ప్రొడక్షన్స్
విడుదల తేదీ జూన్ 15, 2007
నిడివి 3 గంటలు
భాష తెలుగు

శివాజీ ఎస్. శంకర్ దర్శకత్వంలో 2007లో విడుదలైన తమిళ అనువాద చిత్రం. ఇందులో రజనీకాంత్, శ్రీయ, సుమన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వి.ఎం ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్ గా ఆర్థికంగా బాగా సంపాదించి భారతదేశానికి తిరిగి వస్తాడు శివాజీ. ప్రజలకు సేవ చేయడం కోసం తన సొంత ఖర్చుతో ఉచిత వైద్యశాలలు, ఉచిత విద్య సమకూర్చాలనుకుంటాడు. కానీ సంఘంలో మంచి పలుకుబడి ఉన్న ఆదిశేషు అనే వ్యాపారవేత్త అతని ప్రయత్నాలకు అడ్డుపడతాడు. అవినీతి అతన్ని నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఈ పరిస్థితుల్లో శివాజీ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.

ఈ సినిమా 2007 జూన్ 15 న ప్రపంచవ్యాప్తంగా తమిళంలో విడుదలైంది. తెలుగు అనువాదం కూడా ఇదే రోజున విడుదలైంది. హిందీ అనువాదం 2010 జనవరి 8 న విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలనందుకుని వాణిజ్యపరంగా మంచి వసూళ్ళు రాబట్టింది.

శివాజీ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్టుగా అమెరికాలో పనిచేస్తూ భారతదేశానికి తిరిగివస్తాడు. శివాజీ ఫౌండేషన్ అనే సేవాసంస్థను స్థాపించి దాని ద్వారా పేదలకు ఉచిత విద్య, ఉచిత వైద్యసేవలు అందించాలన్నది అతని ఆకాంక్ష. సమాజంలో మంచి పలుకుబడి ఉన్న ఆదిశేషుకు స్వంతంగా ఆసుపత్రులు, కళాశాలలు ఉంటాయి. వాటి లాభానికి గండిపడుతుందని శివాజీ తనకు పోటీ వస్తున్నాడని భావించిన ఆదిశేషు తనకున్న పలుకుబడిని ఉపయోగించి శివాజీ పనులకు ఆటంకం కలిగిస్తాడు. అవినీతిపరులైన అధికారులకు పెద్దమొత్తంలో లంచాలు ఇవ్వవలసివస్తుంది. దానికోసం శివాజీ తన కారును అమ్మేయడమే కాక, ఇల్లును కూడా తాకట్టుపెట్టవలసి వస్తుంది. శివాజీ కోర్టుకు వెళతాడు కానీ ఆదిశేషు అతను ప్రారంభించిన సంస్థలన్నీ లంచమిచ్చి చేయించాడని నిరూపించడంతో కేసు ఓడిపోతాడు. ఈ లోపు శివాజీ ఒక అమ్మాయి ప్రేమలో పడతాదు. కానీ ఇద్దరి జాతకాలు చూసి వారి పెళ్ళయితే శివాజీకి ప్రాణగండం ఉందని పండితులు చెబుతారు. కానీ శివాజీ మాత్రం ఎలాగైనా ఆమెనే పెళ్ళిచేసుకుంటానంటాడు.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]