సాలమన్ పాపయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాలమన్ పాపయ్య
జననం (1936-02-22) 1936 ఫిబ్రవరి 22 (వయసు 88)
విద్యాసంస్థది అమెరికన్ కాలేజ్ ఇన్ మదురై (బి.ఎ.), త్యాగరాజర్ కాలేజ్ (ఎం.ఎ.)
వృత్తితమిళ ప్రొఫెసర్
(1961-1991)
ది అమెరికన్ కాలేజ్[1]
తల్లిదండ్రులు
 • ఎ.సుందరం (తండ్రి)
పురస్కారాలు

సాలమన్ పాపయ్య (తమిళం:சாலமன் பாப்பையா) (జననం 22 ఫిబ్రవరి 1936) సన్ టి.వి.లో రెండు దశాబ్దాలకు పైగా ప్రసారమవుతున్న "పట్టిమంద్రం" (చర్చా కార్యక్రమం) టాక్ షో ద్వారా సుపరిచితుడు. ఇతడు ఇంతవరకు 12 వేలకుపైగా ప్రజలకుపయోగపడే సామాజిక అంశాలపై చర్చాకార్యక్రమాలు నిర్వహించాడు.[2] ఇతడు తమిళ సాహిత్యాన్ని 60 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ గొప్ప తమిళ విద్వాంసులలో ఒకడిగా పేరుపొందాడు. ఇతడు తమిళభాషను ఉచ్చరించే తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇతనికి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ 2021వ సంవత్సరంలో లభించింది. [3][4]

ప్రారంభ జీవితం[మార్చు]

పాపయ్య ఎ.సుందరం,ఎస్.పక్కియమ్మ దంపతులకు 12 మంది సంతానంలో తొమ్మిదవ వాడిగా జన్మించాడు. ఇతని తండ్రి మిల్లు కార్మికుడు. పేదరికం వల్ల ఇతడు స్నేహితుల సహాయంతో చదువును కొనసాగించాడు. అమెరికన్ కాలేజీ హైయ్యర్ సెకండరీ స్కూలుకు చెందిన డ్రాయింగ్ మాస్టర్ అరసు ఇతనికి మెళకువలు నేర్పించాడు. ప్రొఫెసర్ జ్యోతి ముత్తు ఇతనికి తమిళభాషపట్ల మమకారాన్ని పెంపొందించింది. ఇతడు త్యాగరాజర్ కాలేజీలో ఎం.ఎ. తమిళం మొట్టమొదటి బ్యాచ్‌లో చేరి ఎం.ఎ.పట్టాను పొందాడు. 1960లో ఇతడు అమెరికన్ కాలేజీ లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఇతడు అమెరికన్ కాలేజీ తమిళ విభాగానికి అధిపతిగా ఎదిగాడు. అనేక వేదికల ద్వారా ఇతడు తన సాహిత్య పరిజ్ఞానాన్ని ప్రజలకు అందించాడు. "పట్టి మంద్రం" ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాడు. ఇతడు కాలేజీ చదివే రోజులలో కొన్ని నాటకాలను వ్రాసి దర్శకత్వం వహించాడు.[5] ఇతడు తమిళభాషలో ఐదు గ్రంథాలను రచించాడు.

పురస్కారాలు, బిరుదులు[మార్చు]

 • 2000వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం ద్వారా కళైమామణి పురస్కారం.[6]
 • 2010లో అన్నామలై విశ్వవిద్యాలయం ద్వారా "ముత్తమిళ్ పెరరిజ్ఞర్ అవార్డు".[5]
 • "తమిళ్ అరిజ్ఞర్", "అయల్ కళై అరిజ్ఞర్" బిరుదులు.[1]
 • 2021లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం.

నటన[మార్చు]

పాపయ్య ఈ క్రింది సినిమాలలో నటించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సాలమన్ పాపయ్య మదురై జిల్లా, తిరుమంగళం తాలూకా సతన్‌గుడి గ్రామంలో జన్మించాడు. ఇతడు తన భార్య జయాబాయితో కలిసి మదురైలో నివసిస్తున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[1]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "Celebrities Archives". Archived from the original on 2021-01-26. Retrieved 2021-01-30.
 2. Saravanan, T. (26 February 2010). "Mesmerising the masses" – via www.thehindu.com.
 3. "PIB Press Release: This Year's Padma Awards announced". Pib.nic.in. Retrieved 2011-02-02.
 4. "Shinzo Abe, Tarun Gogoi, Ram Vilas Paswan among Padma Award winners: Complete list". The Times of India. 25 January 2021. Retrieved 25 January 2021.
 5. 5.0 5.1 "Archive News". The Hindu.
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-25. Retrieved 2021-01-30.

బయటి లింకులు[మార్చు]