తోట తరణి
తోట తరణి | |
---|---|
![]() తోట తరణి | |
జననం | తోట తరణి 1949 డిసెంబరు 16 /డిసెంబరు 16, 1949 బందరు |
నివాసం | చెన్నై, తమిళనాడు |
వృత్తి | కళా దర్శకత్వం |
తల్లిదండ్రులు |
|
వెబ్ సైటు | [1] |
తోట తరణి ఒక ప్రముఖ సినీ కళా దర్శకుడు. జాతీయ పురస్కార గ్రహీత.[1] సుమారు 100 సినిమాలకు పైగా కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
తోట తరణి స్వస్థలం బందరు. తండ్రి తోట వెంకటేశ్వర రావు నాటకరంగ కళాకారుడు. ఆడ వేషాలు వేయడంలో నేర్పరి. ఆయనకు ఎనిమిది మంది సంతానం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వెళ్ళాడు. మల్లీశ్వరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. జయసింహ, అమరదీపం, పాండురంగ మహత్మ్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర ప్రఖ్యాత సినిమాలకు ఆయనే కళాదర్శకుడు. దాంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.[2]
తరణికి ఐదేళ్ళ వయసు నుండే కళారంగం మీద ఆసక్తి మొదలైంది. కాగితం దొరికితే ఏదో ఒక బొమ్మలు గీస్తుండే వాడు. ఆయన చదువుకూడా సరిగా సాగలేదు. ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి తప్పాడు. తరువాత ఎన్. టీ. ఆర్ ప్రోత్సాహంతో మళ్ళీ చదివి మెట్రిక్యులేషన్ పాసై తరువాత చిత్రలేఖనంలో డిప్లోమా, పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. తరువాత ముంబైలో ఒక కంపెనీలో ఆర్టిస్టుగా పనిచేశాడు. మద్రాసుకు తిరిగి వచ్చి తండ్రికి సినిమా సెట్లలో సహకరించడం మొదలుపెట్టాడు.
కెరీర్[మార్చు]
తండ్రితో పనిచేసేటపుడు అతని ప్రతిభను గమనించిన కొందరు అతనికి నాగమల్లి అనే సినిమాలో అవకాశం కల్పించారు. తరువాత మౌనరాగం, అమావాస్య చంద్రుడు, నాయకుడు, అంజలి, దళపతి, రోజా, బొంబాయి తదితర విజయవంతమైన చిత్రాలకు పనిచేయడంతో అతని ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. గీతాంజలి, శివ, చైతన్య, నిర్ణయం, చినరాయుడు, శుభ సంకల్పం, చూడాలని ఉంది, మృగరాజు, మాస్ లాంటి కమర్షియల్ చిత్రాలకు కూడా పనిచేశాడు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా కోసం మదుర మీనాక్షి దేవాలయం సెట్టు వేశాడు. తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో కూడా అప్పటి కాలానికి తగ్గ సెట్లు వేశాడు.
పురస్కారాలు[మార్చు]
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు : 1989 (నాయకుడు), 1997 (భారతీయుడు), 2007 (శివాజీ)
- పద్మశ్రీ పురస్కారం (2001).[3]
చిత్ర సమాహారం[మార్చు]
- 1957 : పాండురంగ మహత్యం
- 1977 : ఎదురీత
- 1978 : సొమ్మొకడిది సోకొకడిది
- 1982 : శుభలేఖ
- 1983 : నెలవంక
- 1985 : అన్వేషణ
- 1989 : నాయకుడు, శివ
- 1990 : అంజలి
- 1991 : దళపతి
- 1993 : జంటిల్ మేన్
- 1994 : ప్రేమికుడు
- 1996 : ప్రేమదేశం, బొంబాయి, భారతీయుడు
- 1998 : జీన్స్
- 2004 : అర్జున్, మాస్
- 2005 : అతడు, చంద్రముఖి
- 2007 : శివాజీ
- 2008 : కథానాయకుడు, దశావతారం
- 2010 : లీడర్
మూలాలు[మార్చు]
- ↑ రెంటాల, జయదేవ. "ఆయన పోలికలున్నాయని నన్ను నటించమన్నారు!". sakshi.com. సాక్షి. Retrieved 18 December 2016.
- ↑ "దర్శకుడిది 'కల'.. తరణిది 'కళ'". eenadu.net. ఈనాడు. Retrieved 18 December 2016.[permanent dead link]
- ↑ "Thotta Tharani's profile". Archived from the original on 2008-02-20. Retrieved 2011-10-21.
బయటి లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- తెలుగు సినిమా కళా దర్శకులు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- 1949 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- నంది ఉత్తమ కళా దర్శకులు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు