బొంబాయి (సినిమా)
బొంబాయి | |
---|---|
![]() | |
దర్శకత్వం | మణిరత్నం |
కథా రచయిత | మణిరత్నం |
నిర్మాత | ఎస్. శ్రీరామ్ మణిరత్నం(చూపలేదు) జాము సుగంద్ |
తారాగణం | అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా |
ఛాయాగ్రహణం | సురేష్ ఉర్స్ |
కూర్పు | రాజీవ్ మేనన్ |
సంగీతం | ఎ.ఆర్ రెహ్మాన్ |
విడుదల తేదీ | 1995 మార్చి 10 |
సినిమా నిడివి | 130 ని[1] |
భాష | తెలుగు |
బొంబాయి మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా. 1995 లో విడుదలైంది. ఇందులో అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలు పోషించారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతాన్నందించాడు. బొంబాయి మతకలహాల నేపథ్యంలో తీసిన సినిమా ఇది.
కథ[మార్చు]
శేఖర్ ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు. బాంబేలో పాత్రికేయ విద్యనభ్యసిస్తుంటాడు. ఒకసారి సెలవులకు తన ఊరు వస్తాడు. తిరిగి బాంబే వెళ్ళేటపుడు శైల భాను అనే ముస్లిం అమ్మాయిని చూసి ఆమె మీద అనురాగం పెంచుకుంటాడు. మొదట్లో తమ కులాలు కలవవని శైలభాను శేఖర్ ని దూరంగా ఉంచుతుంది. కానీ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉండటం, శేఖర్ ఆమె కోసం పడే తపనను గమనించి ఆమె కూడా అతన్ని ఆరాధించడం మొదలుపెడుతుంది.
శేఖర్ శైలభాను తండ్రి బషీర్ అహ్మద్ ను కలుసుకుని అతని కూతుర్ని ప్రేమిస్తున్నాననీ, పెళ్ళి చేసుకుంటానని అడుగుతాడు. మతాల పట్టింపుతో బషీర్ అతన్ని అంగీకరించక బయటకు గెంటేస్తాడు. శేఖర్ తన తండ్రి పిళ్ళై దగ్గర అదే ప్రస్తావన తెస్తాడు. ఆయన కూడా కోపానికి గురై బషీర్ తో గొడవ పెట్టుకుంటాడు. రెండు కుటుంబాల నుంచి వ్యతిరేకత రావడంతో శేఖర్ తిరిగి బాంబే వెళ్ళిపోతాడు. వెళుతూ శైల స్నేహితురాలి ద్వారా ఆమెను బాంబే వచ్చేయడానికి టికెట్ పంపిస్తాడు. శైల బాంబే వెళ్ళిపోయి శేఖర్ ను పెళ్ళి చేసుకుంటుంది. వారిద్దరికీ కవల పిల్లలు పుడతారు. కొద్ది కాలానికి ఇద్దరి తల్లిదండ్రులకు కోపం తగ్గి మనవలను చూసుకోవడానికి బాంబే వస్తారు. అదే సమయంలో అక్కడ మతకలహాలు రేగుతాయి.
చిత్రీకరణ[మార్చు]
బొంబాయి సినిమా బొంబాయి నగరంలో కేవలం మూడు రోజులే చిత్రీకరణ జరుపుకుంది. మిగిలిన చిత్రీకరణలను మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లోని స్టూడియోల్లో బొంబాయి వాతావరణాన్ని పునఃసృష్టించి చిత్రీకరించారు.[2]
తారాగణం[మార్చు]
- శేఖర్ గా అరవింద్ స్వామి
- శైలభాను గా మనీషా కొయిరాలా
- బషీర్ గా కిట్టీ
- నారాయణ్ మూర్తి గా నాజర్
- కుమార్ గా ప్రకాష్ రాజ్
- టినూ ఆనంద్
- కబీర్ నారాయణ్ గా మాస్టర్ హర్ష
- కమల్ బషీర్ గా మాస్టర్ హృదయ్
- రాళ్ళపల్లి
- ఎం.వి. వాసుదేవరావు
- హమ్మా హమ్మా పాటలో సోనాలి బెంద్రే, నాగేంద్ర ప్రసాద్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు.[3][4]
నిర్మాణం[మార్చు]
మణిరత్నం దొంగ దొంగ సినిమా తీస్తున్న సమయంలో బాంబేలో అల్లర్లు చెలరేగాయి. అప్పటి నుండి ఆ నేపథ్యంలో సినిమా చేయాలని మణిరత్నం ఆలోచించడం మొదలు పెట్టాడు. మళయాళ రచయిత ఎం. టి. వాసుదేవన్ ను కథ, కథనాలను సిద్ధం చేయమన్నాడు. కానీ అది ఆలస్యమవుతుండటంతో తనే స్వయంగా కథ సిద్ధం చేసుకుని తమిళంలో సినిమాగా తీయాలనుకున్నాడు. మొదట విక్రం, మనీషా కొయిరాలా మీద ఫోటో షూట్ చేశారు. అప్పటికే మరో చిత్రం కోసం గడ్డం, మీసం పెంచిన విక్రం ఈ సినిమా కోసం వాటిని తీయడానికి అంగీకరించలేదు. దాంతో రోజా సినిమాలో నటించిన అరవింద్ స్వామికి ఈ అవకాశం దక్కింది. నారాయణ మూర్తి పాత్రకు నాజర్ ను, బషీర్ గా కిట్టీ ని ఎన్నుకున్నారు. రాజీవ్ మేనన్ ను సినిమాటోగ్రాఫర్ గా నిశ్చయించారు.[5]
పురస్కారాలు[మార్చు]
ఈ సినిమా ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్ దత్ పురస్కారాన్ని అందుకుంది. సురేశ్ కు ఎడిటింగ్ విభాగంలో జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, మరాఠీ శ్రీ, రెండు తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. ఎడిన్ బర్గ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో గాలా అవార్డు లభించింది. అమెరికాలో నిర్వహించిన పొలిటికల్ ఫిల్మ్ సొసైటీ అవార్డ్స్ లో ప్రత్యేక బహుమతి లభించింది. జెరూసలేం ఫిల్ం ఫెస్టివల్ లో విం వాన్ లీర్ ఇన్ స్పిరిట్ ఫర్ ఫ్రీడమ్ అవార్డును మణిరత్నం అందుకున్నాడు.[5]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: మణిరత్నం
- సంగీతం: ఎ.ఆర్ రెహ్మాన్
- కళ : తోట తరణి
- నిర్మాణ సంస్థ: మణిరత్నం ఫిలింస్
పాటలు[మార్చు]
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఉరికే చిలకా | ఎ.ఆర్ రెహ్మాన్ | హరిహరన్, చిత్ర | |
కన్నానులే | ఎ.ఆర్ రెహ్మాన్ | చిత్ర | |
అది అరబిక్ కడలందం | ఎ.ఆర్ రెహ్మాన్ | ||
పూలకుంది కొమ్మ | ఎ.ఆర్ రెహ్మాన్ | ||
కుచ్చి కుచ్చి కూనమ్మా | ఎ.ఆర్ రెహ్మాన్ | హరిహరన్, ప్రకాశ్, స్వర్ణలత, శ్వేత |
మూలాలు[మార్చు]
- ↑ Rangan 2012, p. 292.
- ↑ రత్నం, మణి. "Mani Ratnam in conversation with Peter Webber" (వీడియో) (Interview). Interviewed by పీటర్ వెబర్. Retrieved 12 march 2017.
{{cite interview}}
: Check date values in:|accessdate=
(help); Cite has empty unknown parameters:|subjectlink3=
,|subjectlink2=
,|city=
,|program=
,|callsign=
, and|subjectlink4=
(help); More than one of|subject=
and|last=
specified (help); Unknown parameter|subjectlink=
ignored (help) - ↑ "1997-98 Kodambakkam babies Page". Indolink. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 24 జనవరి 2019.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help); More than one of|accessdate=
and|access-date=
specified (help); More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "AR Rahman birthday special: Five most popular songs by Mozart of Madras". Mumbai Mirror. 6 January 2017. Archived from the original on 21 September 2017. Retrieved 21 September 2017.
- ↑ 5.0 5.1 "మణిరత్నం 'బొంబాయి'కు 25ఏళ్లు!". www.eenadu.net. Archived from the original on 2020-03-10. Retrieved 2020-03-10.
బయటి లంకెలు[మార్చు]
- Harv and Sfn no-target errors
- CS1 errors: unsupported parameter
- CS1 errors: empty unknown parameters
- CS1 errors: redundant parameter
- Articles with short description
- Short description is different from Wikidata
- 1995 తెలుగు సినిమాలు
- Pages using infobox film with unknown empty parameters
- మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు
- తమిళ అనువాద చిత్రాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు