నాగేంద్ర ప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగేంద్ర ప్రసాద్
జననం
నాగేంద్ర ప్రసాద్ సుందరం

(1975-12-19) 1975 డిసెంబరు 19 (వయసు 48)
మైసూరు, మైసూర్ రాష్ట్రం
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
కొరియోగ్రాఫర్
తల్లిదండ్రులు
బంధువులురాజు సుందరం (సోదరుడు)
ప్రభుదేవా (సోదరుడు)

నాగేంద్ర ప్రసాద్ సుందరం (జననం 1975 డిసెంబరు 19) భారతీయ చలనచిత్ర నృత్య దర్శకుడు(కొరియోగ్రాఫర్). తమిళ, కన్నడ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన నటుడు కూడా. ఆయన సుందరం మాస్టర్ చిన్న కుమారుడు. అలాగే, ప్రభుదేవా, రాజు సుందరంలకు తమ్ముడు.

కెరీర్[మార్చు]

ఆయన బొంబాయి చిత్రంలోని హమ్మా హమ్మా.. పాటలో నటించినందుకు అత్యంత ప్రసిద్ధి చెందాడు.[1] ఆయన కన్నడ చిత్రం చిత్రలో రేఖ వేదవ్యాస్ సరసన నటించి అరంగేట్రం చేశాడు. తన తండ్రి సుందరం మాస్టర్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం మనసెల్లా నీనేలో కూడా ఆయన నటించాడు.[2][3] ఆయన కుషి (2000), ఘిల్లి (2004), మాస్టర్ (2021) వంటి అనేక తమిళ చిత్రాలలో హీరో స్నేహితుడిగా నటించాడు. ఆయన నటించిన ఘిల్లి ( రిస్క్ టేకర్) [4] తెలుగు భాషా చిత్రం ఓక్కడు (2003) రీమేక్ కాగా, మాస్టర్ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషాల్లో కూడా విడుదలైంది.[5]

ఆయన స్టార్ విజయ్‌లో మాయ మచింద్ర అనే టెలి-సీరియల్‌లో కూడా నటించాడు.[6] ఆయన జోడి నంబర్ 1 సీజన్ 7లో పాల్గొన్నాడు. తన తండ్రి పేరు మీద డ్యాన్స్ స్కూల్, ఎం.ఎస్.ఎం డ్యాన్స్ స్కూల్ ని ఆయన నిర్వహిస్తున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన హేమలతను వివాహం చేసుకున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "Story of Prabhu Deva's secret brother". Gulte. Archived from the original on 25 October 2014. Retrieved 25 June 2014.
  2. "Events - Nagendra Prasad wedding reception". Indiaglitz. Archived from the original on 5 February 2009. Retrieved 7 April 2009.
  3. "Raju Sundaram, Prabhudeva to the beat". Rediff. Archived from the original on 4 November 2013. Retrieved 25 June 2014.
  4. దామోదరన్ కె; గొర్రిన్జ్. "మదురై ఫార్ములా ఫిల్మ్స్: తమిళ సినిమాలో కుల, గర్వ , పాలిటిక్స్" (PDF). Archived from the original (PDF) on 2017-03-20. Retrieved 2019-12-07.
  5. Sakshi (29 December 2020). "విజయ్‌ 'మాస్టర్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది." Retrieved 14 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. "Archived copy". The Hindu. 2000-03-27. Archived from the original on 11 October 2020. Retrieved 25 June 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)