సుందరం మాస్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందరం మాస్టర్
జననం
శంకర్ మాంతప్పన్ మల్లప్ప
వృత్తినృత్య దర్శకుడు, నటుడు
పిల్లలుప్రభుదేవా,
రాజు సుందరం,
నాగేంద్ర ప్రసాద్

సుందరం మాస్టర్ గా పేరుగాంచిన శంకర్ మాంతప్పన్ మల్లప్ప ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు. అన్ని దక్షిణ భారతీయ భాషల్లో సుమారు 1200కి పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించాడు. ఎన్. టి. ఆర్, ఎ. ఎన్. ఆర్, ఎం. జి. ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వరకు అందరి కథానాయకులతో పనిచేసిన అనుభవం ఆయనకుంది.[1] ఈయన కుమారులు ప్రభుదేవా, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్యదర్శకులు, నటులే.

బాల్యం

[మార్చు]

సుందరం మాస్టర్ కు పెద్దలు పెట్టిన పేరు శంకర్ మాంతప్పన్ మల్లప్ప. ఆయన స్వస్థలం మైసూరు. తల్లిదండ్రులు సుందర అని పిలిచేవారు. నృత్య దర్శకుడైన తర్వాత అది సుందరం మాస్టర్ గా మారింది. రెండో తరగతి దాకా చదువుకున్నాడు.

వృత్తి

[మార్చు]

మొదటగా చెన్నైలోని వాహినీ స్టూడియోస్ లో ఉన్న చందమామ ప్రెస్ లో వీలరుగా చేరాడు. సినిమాల్లోకి రావలనే తపనతో డ్యాన్సు నేర్చుకోవడం కోసం ఒక గురువు దగ్గర చేరాడు. ఆయన ఉద్యోగం చేసే పక్కనే సినిమా చిత్రీకరణలు జరుగుతూ ఉండేవి. అప్పుడప్పుడూ అక్కడికి వెళుతూ డ్యాన్సర్ల బృందంలో ఒకడిగా ఎన్నికయ్యాడు. 1962 ప్రాంతంలో గ్రూపు డ్యాన్సులు బాగా తగ్గిపోవడంతో ఈయనకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో భారత్ చైనా యుద్ధం జరుగుతోంది. మిలిటరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో మిలిటరీకి వెళ్ళాలనుకున్నాడు. అందుకోసం ఎంపిక కూడా అయ్యాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అవకాశాలు రావడం ప్రారంభం కావడంతో సైన్యంలో చేరే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ప్రముఖ హాస్యనటుడు నగేష్ ఈయనను దర్శకుడు కె. బాలచందర్ కు పరిచయం చేశాడు. తర్వాత తంగప్ప అనే మాస్టర్ దగ్గర సహాయకుడిగా చేరాడు. తర్వాత ఎన్. టి. ఆర్, ఎ. ఎన్. ఆర్, ఎం. జి. ఆర్ లతో పరిచయం ఏర్పడింది.

చిన్న కుమారుడు ప్రసాద్ హీరోగా మనసంతా నువ్వే సినిమాను కన్నడలో నిర్మించాడు. తర్వాత సినీ నిర్మాణం జోలికి వెళ్ళలేదు.

మూలాలు

[మార్చు]
  1. "నేను అలా చెప్పుంటే ప్రకాష్‌రాజ్‌ ఉండేవాడు కాదు!". eenadu.net. ఈనాడు. Archived from the original on 6 December 2018.

బయటి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుందరం మాస్టర్ పేజీ