అరవింద్‌ స్వామి

వికీపీడియా నుండి
(అరవింద్ స్వామి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అరవింద్ స్వామి
జననం (1970-06-30) 1970 జూన్ 30 (వయస్సు: 48  సంవత్సరాలు)
చెన్నై, తమిళనాడు
విద్యాసంస్థలువేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం
లయోలా కాలేజ్, చెన్నై
వృత్తినటుడు, టీవీ వ్యాఖ్యాత, పారిశ్రామికవేత్త
క్రియాశీలక సంవత్సరాలు1991–2000
2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామిగాయత్రి రామమూర్తి (1994-2010)
అపర్ణ ముఖర్జీ (2012-ప్రస్తుతం)

అరవింద్ స్వామి దక్షిణ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త, మరియు టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు.[1] 1991 లో మణిరత్నం తన సినిమా దళపతి లో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన రోజా (1992), బొంబాయి (1995) సినిమాల్లో కథానాయకుడి పాత్రతో మంచి పేరు సంపాదించాడు.

బాల్యం[మార్చు]

అరవింద్ స్వామి చెన్నైలో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, మరియు భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషన్ల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు.

అరవింద్ స్వామి చిన్నప్పుడు వైద్యుడు కావాలనుకున్నాడు. పాకెట్ మనీ కోసం చిన్నప్పుడు ప్రకటనల్లో నటించేవాడు.[2] లయోలా థియేటర్ సొసైటీలో అతన్ని స్టేజీ మీద నుంచి కిందకు వెళ్ళిపొమ్మన్నారు. తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం అతన్ని ఒక ప్రకటనలో చూసి తనను ఓ సారి కలవమని అడిగాడు. తరువాత మణిరత్నం, సంతోష్ శివన్ అతనికి సినిమా నిర్మాణంలో మెలకువలు నేర్పించారు.[2]

సినిమా రంగం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mahesh Manjrekar to remake Kaksparsh in Hindi and Tamil with Arvind Swamy and Tisca Chopra – The Times of India". The Times of India.
  2. 2.0 2.1 Kamath, Sudhish (31 January 2013). "Return of the heartthrob". The Hindu. Chennai, India. Retrieved 31 January 2013.