Jump to content

రోజా (1992 సినిమా)

వికీపీడియా నుండి
రోజా
దర్శకత్వంమణి రత్నం
రచనమణి రత్నం
నిర్మాతమణి రత్నం
కె. బాలచందర్
తారాగణంఅరవింద్ స్వామి
మధుబాల
కూర్పుసురేష్ అర్స్
సంగీతంఏ.ఆర్. రెహమాన్
విడుదల తేదీ
1992
సినిమా నిడివి
137 ని.
భాషతమిళ్

రోజా (తమిళం: ரோஜா; ఆంగ్లం: Roja) 1992 లో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళ సినిమా కాగా తెలుగుతో సహా హిందీ, మళయాళం, మరాఠీ భాషలలో కూడా డబ్బింగ్ చేశారు.

ఇది మణిరత్నం దర్శకత్వంలో కాశ్మీరు తీవ్రవాద సమస్య మీద నిర్మించిన సందేశాత్మక చిత్రం. దీనికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.

శ్రీనగర్ లో కల్నల్ రాయప్ప నేతృత్వంలో వాసిం ఖాన్ అనే కాశ్మీరీ తీవ్రవాదిని పట్టుకుంటారు. తమిళనాడులో తెన్‌కాశి జిల్లాలోని ఒక అందమైన పల్లెటూరిలో రోజా అనే 18 ఏళ్ళ అమాయకమైన యువతి నివసిస్తూ ఉంటుంది. ఆమె అక్కకు భారత నిఘా సంస్థ అయిన రా లో క్రిప్టాలజిస్టుగా పనిచేసే రిషికుమార్ అనే వ్యక్తితో పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్ళి చూపులు నిర్విఘ్నంగా జరిగిపోవాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. కానీ రోజా అక్క మాత్రం తన మామ కొడుకునే ప్రేమిస్తూ ఉంటుంది. పెళ్ళి చూపుల్లో ధైర్యం చేసి రిషి కుమార్ కి తన ప్రేమ విషయం చెప్పి అందరి ముందు తను నచ్చలేదని చెప్పమంటుంది. అందుకు రిషి కుమార్ కూడా అంగీకరిస్తాడు. రిషికుమార్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రోజాను పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. అక్క ప్రేమ గురించి తెలియని రోజా అయిష్టంగానే పెళ్ళికి అంగీకరిస్తుంది. ఆమె అక్కకి తన బావతో పెళ్ళి చేస్తారు. రిషి కుమార్, రోజా కలిసి మద్రాసులో కాపురం పెడతారు. మొదట్లో రిషి చేసిన పని ఆమెకు నచ్చకపోయినా, తర్వాత అక్క ప్రేమకథ గురించి తెలుసుకుని, రిషిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ
  • నా చెలి రోజావే, నాలో ఉన్నావే
  • నాగమణి నాగమణి సందె కాడా ఎంది సద్దు?
  • వినరా వినరా దేశం మనదేరా

అవార్డులు

[మార్చు]

ఈ చిత్రం చాలా అవార్డులకు నామినేట్ చేయబడింది.[1] 1993 మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (రష్యా)

ఈ చిత్రం క్రింది అవార్డులను గెలుచుకున్నది.[1]

1993 జాతీయ ఫిల్మ్ అవార్డులు (భారతదేశం)
  • వెండి పద్మం - ఉత్తమ సంగీత దర్శకుడు - ఎ.ఆర్. రెహమాన్
  • వెండి పద్మం - ఉత్తమ గేయ రచయిత - వైరముత్తు
  • ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నర్గీస్ దత్ పురస్కారం
1993 ఫిల్మ్ ఫేర్ అవార్డులు
  • ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం
  • ఉత్తమ తమిళ చిత్రం - రోజా
  • ఉత్తమ తమిళ చిత్ర సంగీత దర్శకుడు - ఎ.ఆర్. రెహమాన్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Awards for Roja (1992)". Internet Movie Database. Retrieved 2009-02-25.

బయటి లింకులు

[మార్చు]