తలైవి
తలైవి | |
---|---|
దర్శకత్వం | ఎ.ఎల్.విజయ్ |
రచన | కె. వి. విజయేంద్ర ప్రసాద్ మదన్ కర్కి (తమిళ్) రజత్ అరోరా (హిందీ) |
నిర్మాత | విష్ణువర్ధన్ ఇందూరి శైలేష్ ఆర్.సింగ్ బ్రిందా ప్రసాద్ |
తారాగణం | కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్ |
ఛాయాగ్రహణం | విశాల్ విఠల్ |
కూర్పు | ఆంథోనీ, బాలు సాలూజా |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థలు | జీ స్టూడియోస్ విబ్రీ మోషన్ పిక్చర్స్ కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ గోతిక్ ఎంటర్‌టైన్‌మెంట్ స్ప్రింట్ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 10 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు హిందీ తమిళ్ |
తలైవి 2021లో విడుదలయిన తెలుగు సినిమా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించాడు. కంగనా రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్య శ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 సెప్టెంబరు 10న తెలుగు , తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.[1]
కథ
[మార్చు]ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్‌ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది ? తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ (అరవిందస్వామి) హఠాన్మరణంతో ఆయన వారసురాలిగా జయ నియమితురాలవుతుంది. ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమెను ముఖ్యమంత్రి కరుణతో (నాజర్) పాటు అధికార పార్టీ సభ్యులు అవమానిస్తారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని జయ శపథం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఎదురైన సవాళ్లను ఎలా ప్రతిఘటించి విజయం సాధించింది అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- కంగనా రనౌత్
- అరవింద్ స్వామి
- ప్రకాష్ రాజ్ - కరుణానిధి
- పూర్ణ - శశికళ [4]
- మధుబాల - ఎంజీఆర్ సతీమణి జానకి రామచంద్రన్
- నాజర్
- భాగ్యశ్రీ - జయలలిత తల్లిగా
- సముద్రఖని - ఎంజీఆర్ సన్నిహితుడి పాత్ర
- తంబి రామయ్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ స్టూడియోస్
విబ్రీ మోషన్ పిక్చర్స్
కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
గోతిక్ ఎంటర్‌టైన్‌మెంట్
స్ప్రింట్ ఫిలిమ్స్ - నిర్మాతలు: విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్
- కథ: కె. వి. విజయేంద్ర ప్రసాద్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్
- సంగీతం: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రఫీ: విశాల్ విఠల్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (24 August 2021). "వచ్చే నెల 10న 'తలైవి' - Telugu News Thalaivi Release Date Fixed". Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.
- ↑ Eenadu (10 September 2021). "రివ్యూ: 'తలైవి'". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ Namasthe Telangana (10 September 2021). "తలైవి రివ్యూ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ India Today (23 February 2020). "Poorna joins Kangana Ranaut's Thalaivi: It's truly a wonderful opportunity" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2021. Retrieved 30 August 2021.