Jump to content

మధుబాల (రోజా ఫేమ్‌)

వికీపీడియా నుండి
మధుబాల
జననం
మధు

(1969-03-26) 1969 మార్చి 26 (వయసు: 57)
వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1991-2001, 2013 - ప్రస్తుతం
భాగస్వామిఆనంద్ షా
పిల్లలుఅమేయ, కేయా
తల్లిదండ్రులు
  • టి.రఘునాథ్ (తండ్రి)
  • రేణుక (తల్లి)

మధుబాల (జ. మార్చి 3, 1969) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది.[1]

విశేషాలు

[మార్చు]

ఈమె ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలు. ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది.ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది. ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టాలమ్‌ అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో అజయ్ దేవగణ్తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి, మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. ఈమె గుజరాతీ వ్యాపారి ఆనంద్ షాను వివాహం చేసుకుని అమెరికాలో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
1990 పోలీస్ అధికారి/ పులన్ విసారణై తమిళం
1991 అళగన్ స్వప్న తమిళం
ఫూల్ ఔర్ కాంటే పూజా హిందీ నామినేషన్ - ఉత్తమ మహిళా తొలి నటికి ఫిలింఫేర్ అవార్డు
ఒట్టాయల్ పట్టాలం గోపిక వర్మ/ఇందు మలయాళం
నీలగిరి అనిత
1992 ఎన్నోదిష్టం కూడామో ఆరతి మీనన్
యోధ అశ్వతి
వానమే ఎలై కర్పగం తమిళం
రోజా రోజా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతికి

ఎంపికైంది - ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు - తమిళం

అల్లరి ప్రియుడు కవితా రాణి తెలుగు
1993 అన్నయ్య సరస్వతి కన్నడ
జెంటిల్ మేన్ సుశీల తమిళం
పెహ్చాన్ టీనా హిందీ
1994 ఫౌజ్ కమ్లి
ఎలాన్ మోహిని శర్మ
ప్రేమ్ యోగ్ అనిత
ఆవేశం మధు తెలుగు
సెంతమిళ్ సెల్వన్ వైదేగి తమిళం
జాలీమ్ మధు హిందీ
బ్రహ్మ చందా
జనతా కీ అదాలత్ మాలతి
పుట్టినిల్లు - మెట్టినిల్లు తెలుగు
1995 మోహిని రాగిణి హిందీ
దియా ఔర్ తూఫాన్ ఆషా
హత్కాడి రాణి
జల్లాద్ గాయత్రి
రావణ్ రాజ్ గీతా సూజీ ముఖం
హమ్ హై బేమిసాల్ మరియా
1996 మిస్టర్ రోమియో మధు తమిళం
దిల్జాలే షబ్నం హిందీ
జ్యువెల్ థీఫ్ తిరిగి రావడం మధు
పాంచాలంకురిచి పొట్టు కన్ని తమిళం
1997 చిలక్కొట్టుడు మధు తెలుగు
ఉడాన్ హిందీ
మేరే సప్నో కి రాణి వందన నెహ్లే హిందీ
యశ్వంత్ రాగిణి యశ్వంత్ లోహర్
ఇరువర్ నర్తకి తమిళం "నరుముఘాయే" పాటలో స్పెషల్ అప్పియరెన్స్
షేర్-ఎ-హిందుస్తాన్ హిందీ పాటలో ప్రత్యేక పాత్ర
1998 హఫ్తా వాసులి ఇన్స్పెక్టర్ దుర్గ
ఖోటే సిక్కీ సుమన్
గణేష్ దివ్య తెలుగు
జుల్మ్-ఓ-సితం మీనా 'బిల్లో' హిందీ
సార్ ఉఠా కే జియో షాలు
1999 చెహ్రా సిమ్రాన్
2002 ములాఖాత్ అర్చన పాట్కర్
2008 కభీ సోచా భీ నా థా రాధిక
2011 టెల్ మీ ఓ ఖుదా గీతా
లవ్ యు...మిస్టర్ కళాకార్! రీతు అత్త
2013 అంతకు ముందు... ఆ తరువాత... విద్యా తెలుగు
2014 వాయై మూడి పెసవుం శ్రీదేవి/విద్య తమిళం ద్విభాషా చిత్రం
సంసారం ఆరోగ్యతిని హానికరం మలయాళం
2015 రన్నా సరస్వతి కన్నడ నామినేట్ - కన్నడలో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు
సూర్య వర్సెస్ సూర్య నిఖిల్ తల్లి తెలుగు
2016 నాన్నకు ప్రేమతో దివ్య తల్లి
నాను మట్టు వరలక్ష్మి కన్నడ
2019 సీతారామ కళ్యాణం గీత తల్లి
అగ్ని దేవి శకుంతలా దేవి తమిళం
ప్రీమియర్ పద్మిని శ్రుతి కన్నడ
2020 కాలేజ్ కుమార్ జానకి తమిళ

తెలుగు

ద్విభాషా చిత్రం
2021 నెయిల్ పాలిష్ శోభా భూషణ్ హిందీ ZEE5 ఫిల్మ్
తలైవి వి.ఎన్. జానకి రామచంద్రన్ హిందీ

తమిళం

2022 డెజావు డీజీపీ ఆశా ప్రమోద్ తమిళం
రేమో భావన కన్నడ
రిపీట్ తెలుగు
2023 ప్రేమదేశం అర్జున్ తల్లి
శాకుంతలం మేనక
2024 ఈగల్ గాయత్రీ దేవి
గేమ్ ఆన్
కర్తం భుగ్తం హిందీ
2025 కన్నప్ప పన్నగ తెలుగు
చిన్న చిన్న ఆసై లీల మలయాళం

టెలివిజన్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు
2001 కావేరి కావేరి తమిళం
2004 దేవి దేవి పార్వతి హిందీ
2012 సౌందరవల్లి సౌందరవల్లి తమిళం కామియో
2017 ఆరంభ్: కహానీ దేవసేన కి మహారాణి సాంబవిజ హిందీ
పద్మవిజ
కోషిష్ సే కామ్యబి తక్ ప్రముఖ అతిథి
D4 జూనియర్ vs సీనియర్ ప్రముఖ న్యాయమూర్తి మలయాళం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్
2021 సూపర్ డాన్సర్ అతిథి హిందీ తాతామామల స్పెషల్ (శని) మధు షా స్పెషల్ (ఆదివారం)
కపిల్ శర్మ షో అతిథి జూహీ చావ్లా మరియు అయేషా జుల్కాతో పాటు
2023 మిణుగురు పురుగులు: పార్థ్ ఔర్ జుగ్ను ఇరా రనౌత్ జీ5
స్వీట్ కారమ్ కాఫీ కావేరి తమిళం అమెజాన్ ప్రైమ్ వీడియో
2024 మనోరతంగల్ గీతా పరేఖ్ మలయాళం ZEE5 ఆంథాలజీ ఫిల్మ్ సెగ్మెంట్: విల్పన

మూలాలు

[మార్చు]
  1. ఎస్, సత్యబాబు (26 August 2012). "చిన్ని చిన్ని ఆశ... మళ్లీ చిగురించదా!". సాక్షి ఫన్‌డే. Retrieved 19 March 2017.[permanent dead link]

బయటిలింకులు

[మార్చు]