అజయ్ దేవ్‌గణ్

వికీపీడియా నుండి
(అజయ్ దేవగణ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అజయ్ దేవ్‌గణ్
జననం
విశాల్ వీరు దేవ్‌గణ్

(1969-04-02) 1969 ఏప్రిల్ 2 (వయసు 55)
కొత్త ఢిల్లీ, భారతదేశం
ఇతర పేర్లుఅజయ్ దేవ్‌గణ్
వృత్తినటుడు, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1991–ఇప్పటి వరకు
జీవిత భాగస్వామికాజోల్ (1999–ఇప్పటి వరకు)
పిల్లలు2
తల్లిదండ్రులువీరు దేవ్‌గణ్ (తండ్రి)
వీణ దేవ్‌గణ్(తల్లి)
బంధువులుషోము ముఖర్జీ (మామ)
తనూజ (అత్త)
తనీషా ముఖర్జీ (మరదలు)

అజయ్ దేవ్‌గణ్ ఒక బాలీవుడ్ సినీ నటుడు. 2016 లో ఇతడికి పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేయబడింది.

నేపధ్యము

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

అజయ్‌ దేవగణ్‌ తండ్రి వీరూ దేవగణ్‌ బాలీవుడ్‌ దర్శకుడు, స్టంట్‌ మాస్టర్‌. తండ్రి వల్ల అజయ్‌కు మొదట్నుంచీ మార్షల్‌ ఆర్ట్స్‌పై ఇష్టం ఏర్పడింది. ఫూల్‌ ఔర్‌ కాంటే చిత్రంతో ఆయన వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రంలోనే నటనతో మెప్పించి ఫిలింఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. రెండో చిత్రం జిగర్‌లో తన మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రావీణ్యం చూపించి యాక్షన్‌ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. జఖ్మ్‌ చిత్రంలో మతవిద్వేషాల మధ్య నలిగిపోయిన యువకుడిగా అద్భుత నటన ప్రదర్శించి జాతీయ పురస్కారం సాధించాడు. హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌ అజయ్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలో ఆయన నటనకు మంచి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్‌ నామినేషన్‌ దక్కింది. ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌ సింగ్‌ లో భగత్‌ సింగ్‌ పాత్రకు ప్రాణం పోసి జాతీయ పురస్కారం సాధించాడు. దీవాంగేలో ప్రతినాయక పాత్రతోనూ ఫిలింఫేర్‌ పురస్కారం గెలుచుకున్నాడు. బాలీవుడ్‌లో ప్రముఖ యాక్షన్‌ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నా గోల్‌ మాల్‌ సిరీస్‌, ఆల్‌ ది బెస్ట్‌ లాంటి వినోద ప్రధాన చిత్రాల్లోనూ ఆకట్టుకున్నాడు. 'యూ మీ ఔర్‌ హమ్‌'తో దర్శకుడిగా మారాడు. అజయ్‌ దేవగణ్‌ ఫిలింస్‌ స్థాపించి పలు చిత్రాలను నిర్మించాడు. కంపెనీ, రెయిన్‌ కోట్‌, గంగాజల్‌, ఓంకార, రాజ్‌నీతి, సింగం, దృశ్యం, జఖ్మ్, తానాజీ, గంగూబాయి కతియావాడి, రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ తదితర చిత్రాల్లో ఆయన మంచి నటన కనబర్చాడు.[1]

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]

నటించిన పలు సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "వెండితెర అజేయుడు". ఈనాడు. 2016-01-26. Archived from the original on 2016-01-25. Retrieved 2016-01-26.
  2. Prime9News (30 November 2021). "మేడే ' కాదు రన్ వే 34 చిత్రం పేరు మార్పును ప్రకటించిన అజయ్ దేవ్ గన్". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లంకెలు

[మార్చు]