తనీషా ముఖర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తనీషా ముఖర్జీ
తనీషా ముఖర్జీ (2016)
జననం1978 (age 45–46)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003–2018, 2021–ప్రస్తుతం
తల్లిదండ్రులుషోము ముఖర్జీ - తనుజ
బంధువులుకాజోల్ (అక్క)
అజయ్ దేవ్‌గణ్ (బావ)

తనీషా ముఖర్జీ, హిందీ, తెలుగు, తమిళ సినిమా నటి. 2003లో వచ్చిన ష్.. సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి రామ్ గోపాల్ వర్మ తీసిని సర్కార్‌ సినిమాలో కూడా నటించింది.[1] 2012లో రియాలిటీ షో బిగ్ బాస్ 7లో మొదటి రన్నరప్‌గా కూడా నిలిచింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తనీషా ముఖర్జీ 1978లో షోము ముఖర్జీ, బాలీవుడ్ నటి తనుజ దంపతులకు మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో జన్మించింది. తనీషా బాలీవుడ్ నటి కాజోల్ చెల్లెలు. తండ్రి బెంగాలీ, తల్లి నుండి మరాఠీ. తనీషా ముఖర్జీ అవివాహితురాలు.[2]

కెరీర్[మార్చు]

సినిమారంగం[మార్చు]

ష్ సినిమాతో తనీషా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. వినయ్ రాయ్తో నటించిన ఉన్నాలే ఉన్నాలే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది, ఉత్తమ తొలి సినిమానటిగా విజయ్ అవార్డ్స్‌లో నామినేషన్ పొందింది. 2005లో, ఉదయ్ చోప్రా సరసన నీల్ ఎన్ నిక్కీ సినిమాలో నటించింది. పాప్‌కార్న్ ఖావో మస్త్ హో జావో, సర్కార్, టాంగో చార్లీ వంటి సినిమాల్లో కూడా నటించింది.[3]

బిగ్ బాస్[మార్చు]

2012లో సిపిఏఏ కోసం మనీష్ మల్హోత్రా & షైన ఎన్.సి. షో కోసం ముఖర్జీ

తనీషా టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ 7లో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది.[4][5] ఆ తర్వాత స్టాండ్-అప్ కామెడీ షో గ్యాంగ్స్ ఆఫ్ హసీపూర్‌లో న్యాయనిర్ణేతలలో ఒకరిగా కనిపించింది.[1] 2016లో, తనీషా ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 7లో పాల్గొని ఫైనలిస్ట్ అయింది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు
2003 ష్ మహేక్ గుజ్రాల్
2004 పాప్‌కార్న్ ఖావో! మస్త్ హో జావో తాన్య
2005 నీల్ 'ఎన్' నిక్కీ నిక్కితా బక్షి
సర్కార్ అవంతిక
టాంగో చార్లీ లచ్చి నారాయణ్
2007 ఉన్నాలే ఉన్నాలే దీపిక తమిళ సినిమా
2008 వన్ టూ త్రీ చాందిని
కంత్రి ప్యాసి ప్రియ తెలుగు సినిమా
సర్కార్ రాజ్ అవంతిక
2010 తుమ్ మీలో తో సాహి అతిథి పాత్ర
2016 అన్నా శిఖా
2021 కోడ్ నేమ్ అబ్దుల్ సల్మా

టెలివిజన్[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పేరు పాత్ర ఇతర వివరాలు మూలాలు
2013 బిగ్ బాస్ 7 పోటీదారు 1వ రన్నరప్ [6]
2014 గ్యాంగ్స్ ఆఫ్ హసీపూర్ న్యాయమూర్తి
2015 బిగ్ బాస్ 9 ఆమెనే అతిథి
2016 ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 పోటీదారు 4వ స్థానం
బిగ్ బాస్ 10 ఆమెనే అతిథి
2017 కామెడీ నైట్స్ బచావో
బిగ్ బాస్ 11
2018 ఎంటర్టైన్మెంట్ కీ రాత్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "'Gangs of Haseepur' has something for all: Mandira Bedi". IBNLive. Archived from the original on 2014-04-21.
  2. "Tanishaa Mukerji reveals how her 'amazing' family feels about her being unmarried at 43". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-07-18. Retrieved 2022-04-06.
  3. "Tanishaa Mukerji's candid confessions". The Times of India.
  4. "Tanisha Mukherjee becomes the first runner up in Bigg Boss 7". IBN. Archived from the original on 29 December 2013. Retrieved 2022-04-06.
  5. "Tanishaa Mukerji's candid confessions — The Times of India".
  6. "'Bigg Boss 7' complete list of contestants". Indian Express. 15 September 2013. Retrieved 2022-04-06.

బయటి లింకులు[మార్చు]